By: ABP Desam | Updated at : 12 Jul 2022 03:21 PM (IST)
కట్టుబట్టలే మిగిలినా "డేటింగ్ యాప్" మత్తులోనే పెద్ద డాక్టర్ - మగాళ్లే అని చెప్పినా వినడే !
Crime news : హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు వచ్చే కేసుల్లో చాలా విచిత్రమైనవి ఉంటాయి. అలాంటి వాటిలో ఇదీ ఒకటి. అసలు కేసేమిటో తెలుసుకునే ముందు బాధితుడు గురించి చెప్పుకుందాం. అతని పేరు .. పేరు ఎందుకులెండి పరువు పోతుంది.. చేసే ఉద్యోగం డాక్టర్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఎప్పుడో ఉబుసుపోకనో..బిట్లు చూద్దామనో కంప్యూటర్ ఓపెన్ చేస్తే అతనికి డేటింగ్ యాప్ కనిపించింది. ఇదేదో బాగుందని ఫోన్ నెంబర్ ఇచ్చి మరీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అంత పెద్ద డాక్టరైనా... ఆ డేటింగ్ యాప్ వలలో చిక్కుకుపోయాడు.
ఆగని ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు, వివాహిత బలవన్మరణం - వాట్సప్‌లో అసభ్య మెసేజ్‌లు!
ఆ డేటింగ్ యాప్ నుంచి ఒక్కొక్కరుగా పోన్ చేయడం... ఆయనతో మాట్లాడటం... డబ్బులు డిపాజిట్ చేయించుకోవడం..వాట్సాప్ కాల్స్ తో శృంగారం..వీడియో కాల్స్‌తో శృంగారం అంటూ రకరకాలుగా డబ్బులు పిండేశారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండానే రూ. 80 లక్షల దాకా వాళ్లకు చెల్లించారు. డబ్బులన్నీ ఏమైపోతున్నాయా అని ఇంట్లో వాళ్లు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. వెంటనే వాళ్లు సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకుని ఢిల్లీలో ఉన్న డేటింగ్ యాప్ దొంగల్ని పట్టుకొచ్చారు. అయితే డాక్టర్ మాత్రం ఆ మోసగాళ్ల వైపే నిలబడ్డారు. ఇంట్లో వారితో.. పోలీసులతో గొడవపడి వాళ్లతో రాజీ చేసుకుని పంపిచేశారు.
వివాహితపై అత్యాచారం కేసులో సీఐ నాగేశ్వరరావు అరెస్టు, ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోన్న సీఐ అక్రమాలు!
అంతటితో సినిమా అయిపోతే మళ్లీ ప్రారంభించాడు. ఈ సారి మరో ఎనభై లక్షల వరకూ సమర్పించుకున్నారు. పీఎఫ్ డబ్బులు సహా ఏమీ మిగల్లేదు. ఇంట్లో రోజుకర్చులకు కూడా లేకపోవడంతో డాక్టర్ సమీప బంధువు మరోసారి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. ఇలా చేస్తున్నాడని... వాళ్లంతా మోసగాళ్లని పోలీసులు ఎంత చెప్పినా డాక్టర్ వినిపించుకోవడం లేదు. మూడు సార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా మారడం లేదని పోలీసులు అంటున్నారు.
మోసపోయేవాడుంటే మోసం చేసే వాడుంటారు. ఒకసారి మోసపోతే ఎదుటివాడిదే తప్పు.. పదేపదే మోసపోతే మనదే తప్పు. ఆ విషయం ఎంతో చదువుకుని డాక్టర్ అయిన ... వయసు అరవై ఏళ్లు వచ్చినా ఆయన గుర్తించలేకపోయారు. ఇంట్లో వాళ్లు చెప్పలేకపోయారు. పోలీసులు చెప్పినా వినిపించుకోలేదు. అతను ఇంకా ఎంత ఆ డేటింగ్ యాప్స్‌కు పెడతాడోనని కుటుంబీకులు తలలు పట్టుకుంటున్నారు.
Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య
Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!
Srinivas Goud Firing : కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..
Crime News : దుప్పట్లు అమ్మేవాళ్లు మీ వీధిలో తిరిగారా ? అయితే తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులకు ఓ మాట చెప్పాల్సిందే ! ఎందుకంటే ?
Kamareddy Bus Accident : కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు బోల్తా, 25 మందికి గాయాలు
Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!
Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇక ఆన్లైన్లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!