Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు
ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు షాకిచ్చింది. మంత్రి అంబటిపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు షాకిచ్చింది. మంత్రి అంబటిపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యూలేషన్ స్కీమ్ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సత్తెనపల్లి పోలీసులు తెలిపారు.
మంత్రి అంబటి రాంబాబు పేరుతో వైసీపీ నేతలు సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి లక్కీ డ్రా నిర్వహించారని జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. దాంతో గుంటూరు కోర్టులో జనసేన జిల్లా అధ్యక్షుడు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన గుంటూరు కోర్టు మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని సత్తెనపల్లి పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దాంతో పోలీసులు లక్కీ డ్రా వ్యవహారంలో మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు.
సంక్రాంతి సంబరాల్లో మంత్రి అంబటి రాంబాబు సందడి
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి అంబటి రాంబాబు సందడి చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో స్టెప్పులేసి అందరిలో జోష్ పెంచారు. స్థానిక బంజారా మహిళలతో కలిసి అంబటిరాంబాబు డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది.