85 ఏళ్ల వృద్ధురాలిని చంపిన వృద్ధుడు, మద్యం మత్తులో గొడుగుతో కొట్టి హత్య
Rajasthan Crime: రాజస్థాన్‌లో ఓ 60 ఏళ్ల వద్ధుడు 85 ఏళ్ల వృద్ధురాలిని గొడుగుతో కొట్టి చంపాడు.
Rajasthan Crime:
రాజస్థాన్‌లో దారుణం..
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 60 ఏళ్ల వృద్ధుడు 85 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఓ గొడుగుతో కొట్టి చంపుతుండగా పక్కనే ఉన్న ఇద్దరు మైనర్‌లు ఈ వీడియో రికార్డ్ చేశారు. అంత దాడి చేస్తున్నా కనీసం ఆపకుండా వీడియో తీస్తూ నిలబడ్డారు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రతాప్ సింగ్ మద్యం మత్తులో ఆమెని కొట్టి చంపినట్టు తేలింది. ఓ వ్యక్తిని అడ్డుకోడానికి ప్రయత్నించినా వినకుండా గొడుగుతో గట్టిగా కొట్టాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఆ వృద్ధుడు మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి ఇలా చేశాడు. విచారణలో ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడయ్యాయి. నిందితుడు ప్రతాప్ సింగ్ తనను తాను శివుని అవతారంగా చెప్పుకున్నాడు. ఆమెను చంపిన తరవాత పునర్జన్మనిచ్చే శక్తి తనకు ఉందని అన్నట్టు పోలీసులు వివరించారు. నువ్వు మహారాణివి అంటూనే ఉన్నట్టుండి గట్టిగా ఆమె ఛాతిపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బని తట్టుకోలేక ఆ మహిళ అకస్మాత్తుగా కుప్ప కూలిపోయింది. అక్కడితో ఆగకుండా జుట్టు పట్టుకుని కొంత దూరం లాగాడు. అచేతనంగా పడి ఉన్న మహిళ తలపై గొడుగుపై గట్టిగా కొట్టాడు నిందితుడు. ఆ దెబ్బకి ప్రాణాలు వదిలింది వృద్ధురాలు. ఉదయ్‌పూర్‌లోని గొగుండాలో ఈ ఘటన జరిగింది. బంధువుల ఇంటికి వెళ్తున్న వృద్ధురాలిని అడ్డగించి ఇలా కొట్టి చంపాడు ప్రతాప్ సింగ్. అయితే...ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కోపంతోనే చంపాడన్న పుకార్లు వచ్చాయి. దీనిపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అదంతా అవాస్తవమని, అది అనుకోకుండా జరిగిన హత్య అని తేల్చి చెప్పారు.
రాజస్థాన్‌లో బాలిక హత్య..
ఇటీవల రాజస్థాన్‌లో 14 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన రాజకీయంగానూ కాక రేపింది. మరి కొద్ది నెలల్లోనే అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. బిల్వారాలోని ఓ ఇటుక బట్టీలో కాలిపోయిన మృతదేహం కనిపించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తెల్లవారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తల్లితో కలిసి మేకలు కాసేందుకు వెళ్లిన బాలిక ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. కూతురి జాడ కోసం తల్లి అంతా వెతికింది. గ్రామస్థులూ రాత్రంతా గాలించారు. చివరకు తన ఇంటి వద్దే ఓ ఇటుకల బట్టీలో శవమై కనిపించింది. ఆమె ఎముకలు, పట్టీలు, షూస్ ఘటనా స్థలంలో దొరికాయి. అప్పటికే ఆమె శరీరం అప్పటికే మంటల్లో కాలిపోయింది. హత్య చేసే ముందు సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలోనే దాక్కున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మృతదేహం కనిపించగానే వందలాది మంది గ్రామస్థులు వచ్చి ఆందోళన చేశారు. న్యాయం చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. కూతురు కనిపించడం లేదని ముందుగానే చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ కేసుని విచారించేందుకు రాజస్థాన్ బీజేపీ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది.
Also Read: దొంగతనం చేశారన్న అనుమానంతో మైనర్‌లపై దారుణం, మూత్రం తాగించి కారం పెట్టి చిత్రహింసలు