Crime NeWs : ఒళ్లు జలదరించే రొమాంటిక్ మర్డర్ క్రైమ్ కథ ! మైనర్ లవరే మాస్టర్ ప్లానర్
మాజీ లవర్‌ను చంపేసి అడవిలో పాతి పెట్టేసింది ఓ పదిహేడేళ్ల బాలిక. ఇలా ఎందుకు చేసింది ? ఆమెకు ఎవరు సహకరించారు ? సినిమా స్టోరీకి ఏ మాత్రం తగ్గని ప్లాన్ ఇది.
![Crime NeWs : ఒళ్లు జలదరించే రొమాంటిక్ మర్డర్ క్రైమ్ కథ ! మైనర్ లవరే మాస్టర్ ప్లానర్ 17-Year-Old Murders Ex-Boyfriend With Help of Lover, Buries Body in Jungle Crime NeWs : ఒళ్లు జలదరించే రొమాంటిక్ మర్డర్ క్రైమ్ కథ ! మైనర్ లవరే మాస్టర్ ప్లానర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/24/a40c1b0756279dec63bb4b3aa2a8534e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తమ కుమారుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వస్తారు. పోలీసులు ఆ కేసును ఛాలెజింగ్‌గా తీసుకుంటారు. కానీ ఎక్కాడ క్లూ దొరకదు. అదే సమయంలో మరో అమ్మాయి మిస్సయినట్లుగా కంప్లైంట్ వస్తుంది. రెండింటికి సంబంధం ఉందా అని పోలీసులు తికమక పడుతూ... వెతకగా.. వెతకగా ఓ చోట అమ్మాయి వెళ్తున్న దృశ్యాలు ఓ సీసీ టీవీ ఫుటేజీలో కనిపిస్తాయి. ఆ అమ్మాయితో అబ్బాయి కూడా ఉన్నాడు. చివరికి అమ్మాయిని కనిపెట్టి పోలీసులు పట్టుకుని ప్రశ్నిస్తారు. అంతే ఒళ్ల జలదరించే వాస్తవం వెలుగులోకి వస్తుంది. ఆ కుర్రాడ్ని ఆ అమ్మాయే చంపేసి పాతి పెట్టింది. దీనికి ఆమె లవర్ కూడా సహకరించాడు. ఎందుకు చంపింది..? అనేది ఈ స్టోరీలో సస్పెన్స్ ధ్రిల్లర్. ఇది సినిమా స్టోరీ కాదు. నిజంగానే ఉత్తరాఖండ్‌లో జరిగింది.
ఉత్తరాఖండ్‌లో బంటీ అనే కుర్రాడు హఠాత్తుగా మాయమయ్యాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో 17 ఏళ్ల బాలిక కూడా కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులు సెర్చ్ చేసి అమ్మాయిని పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారణ జరిపితే బంటీని తానే చంపేసి పాతి పెట్టానని చెప్పేసింది. అందుకు తన ఫేస్ బుక్ లవర్ సాయం చేశాడని చెప్పేసింది. అసలు ఎందుకు చంపాల్సి వచ్చిందంటే.. తన క్రైమ్ లవ్ స్టోరీని సుదీర్గంగా చెప్పింది.
17 ఏళ్ల బాలికను బంటీ సిన్సియర్‌గాప్రేమించాడు. బాలిక కూడా ప్రేమించింది. అయితే వీరి ప్రేమ కథలోకి మూడో వ్యక్తి వచ్చాడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన మరో వ్యక్తితో బాలిక ప్రేమలో పడింది.త బంటీ కన్నా ఫేస్ బుక్ ప్రేమికుడే బాగా ప్రేమిస్తున్నాడని డిసైడ్ చేసుకుని బంటీతో కటీఫ్ చెప్పాలనుకుంది. చెప్పింది. కానీ బంటీ మాత్రం అలా అనుకోలేదు. బాలికనే సిన్సియర్‌గా ప్రేమిస్తున్నానని వెంటపడటం ఆపలేదు. దీంతో ఆ బాలిక వయోలెంట్‌గా ఆలోచించింది. బంటీని అడ్డు తొలగించుకోవాలనుకుంది. తన ఫేస్ బుక్ లవర్‌తో కలిసి ప్రణాళిక వేసింది.
ఓ రోజు ఫోన్ చేసి బంటీని ప్రేమగా మాట్లాడి మాట్లాడుకుందాం రమ్మని పిలిచింది. అతన్ని అడవిలో తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ కాచుకుని కూర్చున్న బాలిక ఫేస్ బుక్ లవర్ దాడి చేశారు.ఇద్దరూ కలిసి కొట్టి చంపేసి అక్కడే పాతి పెట్టి పారిపోయారు. తర్వాత దొరికిపోయారు. మైనర్లలోనే ఇంత దారుణమైన నేరపూరిత ఆలోచనలు రావడం చూసి పోలీసులు కూడా షాక్‌కు గురయ్యారు. మైనర్ హంతకురాలు చెప్పిన వివరాల ఆధారంగా డెడ్ బాడీని వెలికి తీశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)