Student Suicide: నా ఫొన్ అమ్మేసి అంత్యక్రియలు చేయండి.. నా ఆత్మ శాంతిస్తుంది..
అమ్మ, నాన్న ఐ లవ్ యూ.. నా ఫోన్ అమ్మేసి నాకు అంత్యక్రియలు చేయండి.. ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుని.. లేఖలో రాసిన చివరి మాటలివి. ఆ బాలుడు ఎందుకలా చేశాడు?
ప్రపంచమే మన గుప్పిట్లో ఉంది అంటే దానికి కారణం ఒకే ఒక్క డివైజ్. అదే స్మార్ట్ ఫోన్. అది చేతుల్లో ఉంటే చాలు ఈ ప్రపంచాన్నే చుట్టి రావచ్చు. ఇంట్లో కూర్చొని అన్ని పనులు చక్కపెట్టేయవచ్చు. చివరకు ఉద్యోగం కూడా స్మార్ట్ ఫోన్ తో చేసే రోజులు వచ్చాయి. మానవాళి టెక్నాలజీలో ఎంత ముందుకు వెళ్లిందో అర్థం అవుతుంది. కానీ ఫోన్ తో మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంది. ఒకటా.. రెండా.. ఎన్ని ఘటనలు చూస్తున్నాం.. ఫోన్ కారణంగా మృతి చెందిన వారు ఎంతో మంది. దాని వల్ల ఎన్ని లాభాలు, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ లోనూ అలాంటి ఘటనే జరిగింది.
హైదరాబాద్ బహదూర్ పురాలో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పదో తరగతి చదివే ఆ విద్యార్థి ఫోన్ కు ఎక్కువగా అడిక్ట్ అయ్యాడు. అయితే వారం రోజుల క్రితం గుండెలో నొప్పిగా అనిపించింది. అది గుండెపోటుగా అనుకున్నాడు. అదే విషయంతో మనస్తాపంతో చనిపోతున్నట్టు లేఖలో పేర్కొన్నాడు. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
'అమ్మా.. నాకు వారం క్రితం గుండె పోటు వచ్చింది.. కానీ నేను ఆ విషయం మీకు చెప్పలేదు.. ఇంట్లో చెపితే భయ పడతారని అనుకున్నాను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. అమ్మానాన్న నన్ను క్షమించండి.. నేను మిమ్మల్ని వదిలి వెళుతున్నాను .. నన్ను మర్చిపోండి. నా ఫోన్ అమ్మి నా అంత్యక్రియలు నిర్వయించండి..అప్పుడే నా ఆత్మకు శాంతి జరుగుతుంది.' అని చనిపోయే ముందు భావోద్వేగం తో సూసైడ్ నోట్ రాశాడు విద్యార్థి. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అతిగా ఫొన్ వాడొద్దు
గ్యాడ్జెట్స్ మీద మనం ఆధారపడడం ఎక్కువైపోయింది. కంప్యూటర్ ముందే గంటలు గంటలు గడుపుతున్నాం. ఈ మధ్యకాలంలో వచ్చిన ఇంకొక అలవాటేమిటంటే ఫోన్‌ని ఆపకుండా వాడుతూనే ఉండడం. పొద్దున్న నిద్ర లేచి లేవగానే ఫోన్ తీస్తున్నాం, రాత్రి నిద్ర కళ్ళ మీదకి వాలిపోయే వరకూ ఫోన్‌తోనే ఉంటున్నాం.
స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయడం హెల్త్‌కి మంచిది కాదని తెలిసిన విషయమే. ఎక్కువ సేపు ఫోన్ వాడడం వల్ల తలనొప్పి, మెడనొప్పి, ఐసైట్ ప్రాబ్లమ్స్ వంటివి వస్తాయి. మానసికంగా కూడా దెబ్బతింటాం. చిన్నపిల్లలు, విద్యార్థులకు ఫోన్లు దూరంగా పెట్టడమే మంచిది. చదువు పాడైపోవడమే కాదు.. ఫోన్ ఎక్కువగా వాడి ఆరోగ్య సమస్యలు, ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చాలానే చూస్తున్నాం.
Also Read: Crime News: ఫేస్ బుక్ పరిచయం.. ప్రియురాలు రమ్మంటే రాత్రి వెళ్లాడు.. ఆ దుంగ లేకుంటే ఏమయ్యేదో
Also Read: Crime News: భర్తను చంపితే బీమా డబ్బులొస్తాయని ప్లాన్.. ప్రియుడితో కలిసి స్కెచ్.. చివరకు..
Also Read: Mahabubnagar: ఒకే చీరకు ఉరేసుకున్న వదిన, మరిది.. కారణం తెలిసి స్థానికులు షాక్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి