అన్వేషించండి

Vodafone Idea: ఆయన తిరిగొచ్చారు - వొడాఫోన్‌ ఐడియా షేర్లలో యమా జోరు

వొడాఫోన్ ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 8.36 శాతం వాటా ఉంది.

Vodafone Idea: ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, దేశంలోని మూడో అతి పెద్ద టెలికాం కంపెనీ అయిన వొడాఫోన్ ఐడియా బోర్డులోకి తిరిగి వచ్చారు. కంపెనీ అదనపు డైరెక్టర్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ నియామకం గురువారం (ఏప్రిల్ 20, 2023) నుంచి అమలులోకి వచ్చింది.

కుమార మంగళం బిర్లా, రెండేళ్ల క్రితం వరకు వొడాఫోన్ ఐడియా చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆ పదవిని వదిలేశారు. వొడాఫోన్ ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 8.36 శాతం వాటా ఉంది.

2023 ఏప్రిల్ 20, గురువారం నాడు డైరెక్టర్ల బోర్డు సమావేశం జరిగిందని, కుమార మంగళం బిర్లాను అదనపు డైరెక్టర్‌గా నియమించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వొడాఫోన్‌ ఐడియా వెల్లడించింది. 

బిర్లా పునరాగమనం - కొంత ఉపశమనం 
వొడాఫోన్ ఐడియా ప్రస్తుత పరిస్థితి గురించి కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఈ కంపెనీ అతి భారీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్‌ ఐడియాలోకి డైరెక్టర్‌ హోదాలో కుమార మంగళం బిర్లా తిరిగి అడుగు పెట్టడాన్ని ఆ కంపెనీకి కొంత ఉపశమనంగా చూడాలి. 

ప్రస్తుతం, వొడాఫోన్‌ ఐడియా నెత్తిన రూ. 2.23 లక్షల కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో, కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు రూ. 16,133 కోట్లను ఈక్విటీగా మార్చింది. దీంతో, భారత ప్రభుత్వం వొడాఫోన్ ఐడియాలో అతి పెద్ద వాటాదారుగా అవతరించింది. ఇప్పుడు ఈ కంపెనీలో భారత ప్రభుత్వానికి దాదాపు 33 శాతం వాటా ఉంది. రూ. 10 ముఖ విలువ కలిగిన షేర్లను ప్రభుత్వానికి ఈ కంపెనీ జారీ చేసింది. 

అత్యంత భారీ స్థాయి అప్పుల భారంలో ఉన్న వొడాఫోన్‌ ఐడియాను నడపడానికి భారీ మూలధనం అవసరం. కంపెనీ ప్రమోటర్ల వైపు నుంచి మూలధనాన్ని సమకూర్చుకోవడం గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి, అవి ఇంకా ఓ కొలిక్కి రాలేదు. వొడాఫోన్ ఐడియా మెరుగైన రీతిలో పని చేయాలంటే ఇప్పటికిప్పుడు రూ. 40,000 నుంచి 45,000 కోట్లు అవసరం. ఇందులో 50 శాతం బ్యాంకు నుంచి రుణంగా పొందితే, మిగిలిన మొత్తాన్ని ప్రమోటర్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ప్రమోటర్ పెట్టుబడి లేకుండా, బయటి పెట్టుబడిదారు ఎవరూ కూడా కంపెనీలోకి డబ్బు తేవడానికి ఇష్టపడరు, ఏ బ్యాంకు కూడా రుణం ఇవ్వదు. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి కూడా కంపెనీ డబ్బులు సేకరించలేకపోతోంది. కాబట్టి, ప్రమోటర్లు కనీసం 50% సర్దితే, మిగిలిన మొత్తాన్ని బయటి నుంచి తేవచ్చన్న ప్రతిపాదన చాలాకాలంగా నలుగుతోంది. కుమార మంగళం బిర్లా బోర్డ్‌లోకి తిరిగి వచ్చారంటే, ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందన్న ఆశలు చిగురించాయి.

రాకెట్‌ను తలపించిన షేర్‌ ధర
కుమార మంగళం బిర్లా రిటర్న్స్‌ వార్త బయటకు రావడంతో, ఇవాళ (శుక్రవారం, 21 ఏప్రిల్‌ 2023) వొడాఫోన్ ఐడియా షేర్లు శ్రీహరికోట రాకెట్లను తలపిస్తున్నాయి. ఉదయం 10.10 గంటల సమయానికి 9.09% లాభంతో రూ. 6.60 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ ధర వద్ద, ఈ కంపెనీలో భారత ప్రభుత్వం పెట్టుబడి (దాదాపు 33 శాతం వాటా) 40 శాతం నష్టంలో ఉంది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget