Union Budget 2022: ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు బడ్జెట్! సాయంత్రం 4-9 గంటల మధ్య లోక్‌సభలో చర్చలు
ఈ సారి బడ్జెట్ సమావేశాలను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించబోతున్నారు. రోజుకు 5 గం।। చొప్పున రాజ్యసభ, లోక్‌సభను నడిపిస్తారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపడతారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సారి బడ్జెట్ సమావేశాలను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించబోతున్నారు. రోజుకు ఐదు గంటల చొప్పున రాజ్యసభ, లోక్‌సభను నడిపిస్తారు. ఉదయం పెద్దల సభ, మధ్యాహ్నం లోక్‌సభ సమావేశాలు ఉంటాయి.
బడ్జెట్‌కు ముందు రోజున రెండు సభల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపడతారు. ఇక ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు లోక్ సభ సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు నిర్వహిస్తారు. ఉదయం రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి.
కొవిడ్ నేపథ్యంలో ఉభయ సభల్లో భౌతిక దూరాన్ని కట్టుదిట్టంగా అమలు చేయబోతున్నారు. రెండు సభల్లోని ఛాంబర్లు, గ్యాలరీల్లోనూ సభ్యులను కూర్చొబెట్టనున్నారు. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా సభ్యుల మధ్య దూరం ఉంటుంది. ఇక రాజ్యసభకు షెడ్యూలు ఇంకా ప్రకటించలేదు. అయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సభ జరుగుతుందని తెలిసింది. రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు షెడ్యూలుపై తుది నిర్ణయం తీసుకుంటారు. కొవిడ్ పాజిటివ్ రావడంతో ఆయన హైదరాబాద్‌లో క్వారంటైన్ అయ్యారు.
Union Budget 2022 is likely to be presented at 11 am on 1st February, despite staggered timing for Lok Sabha & Rajya Sabha: Sources
— ANI (@ANI) January 25, 2022
బడ్జెట్ మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో విడత సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. రెండో విడత షెడ్యూళ్లకు సంబంధించి ఇంకా వివరాలు రాలేదు.
కరోనా ఉన్నప్పటికీ 2020, వర్షకాల సమావేశాలను కట్టుదిట్టమైన ఆంక్షల మధ్య విజయవంతంగా నిర్వహించారు. ఉదయం రాజ్యసభ, మధ్యాహ్నం లోక్‌సభ సమావేశాలు జరిగాయి. 2021 మొదటి విడత బడ్జెట్ సమావేశాలకూ ఇదే విధంగా నిబంధనలు అమలు చేశారు. అయితే గతేడాది రాజ్యసభ, లోక్‌సభను సాధారణ సమయాల్లోనే నిర్వహించారు. శీతకాలం, వర్షకాలం సమావేశాలకూ ఇదే అనుసరించారు. అయితే భౌతిక దూరం మాత్రం తప్పనిసరిగా అమలు చేశారు.
Also Read: Nirmala Sitharaman Profile: పేరే.. 'నిర్మల'! ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో 'మదురై మీనాక్షి'!!
Also Read: Tata Punch Price Cut: గుడ్‌న్యూస్.. టాటా పంచ్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?