By: ABP Desam | Updated at : 09 Mar 2023 02:34 PM (IST)
Edited By: Arunmali
తత్కాల్‌లోనూ టికెట్ దొరకడం లేదా?
Train Ticket Booking: మన దేశ ప్రజల జీవితాల్లో రైలు ప్రయాణం ఒక భాగం. ప్రతి రోజూ కోట్లాది మంది ప్రజలు వందలాది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. పండుగలు, వేసవి సెలవుల సమయంలో రైళ్లలో రద్దీ చాలా రెట్లు పెరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు వేరొక ప్రాంతానికి వెళ్లడానికి రిజర్వేషన్ సీట్ అంత త్వరగా దొరకదు. ఆ పరిస్థితిలో ప్రజలు తత్కాల్ టిక్కెట్లను ఆశ్రయిస్తుంటారు. రద్దీ కారణంగా అవి కూడా అందుబాటులో ఉండడం లేదు. ప్రీమియం తత్కాల్ ప్రయత్నించినా సీట్ దొరకని పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సందర్భం మీకు ఎదురైతే.. ఒక సులభమైన ఉపాయంతో కన్ఫర్మ్‌డ్ టిక్కెట్‌ను సులభంగా (Trick to Book Confirm Train Ticket) పొందవచ్చు. IRCTC మాస్టర్ లిస్ట్‌ను ఉపయోగించి టికెట్ బుక్ చేయడమే ఆ ట్రిక్.
మాస్టర్ లిస్ట్ అంటే ఏంటి?
ప్రతి ప్రయాణీకుడు తన సొంత మాస్టర్ లిస్ట్ (IRCTC Master List) రూపొందించుకోవడానికి IRCTC అనుమతిస్తుంది. ఇంతకీ మాస్టర్ లిస్ట్ ఏంటి అనే ప్రశ్న మీ మదిలో మెదులుతోంది కదా?. ప్రయాణీకుల పేర్లు, వయస్సు, ఇతర వివరాలను ముందుగా కలిగి ఉండేదే మాస్టర్ లిస్ట్. టికెట్ బుకింగ్ చేసే సయమంలో ప్రయాణీకుల వివరాలను పూరించడానికి బదులుగా, మాస్టర్ లిస్ట్ నుంచి ప్రయాణీకుల వివరాలను మీరు చిటికెలో జోడించవచ్చు. ఇది మీ బుకింగ్ సమయాన్ని ఆదా చేస్తుంది, టిక్కెట్ కన్ఫర్మేషన్ పొందే అవకాశాలను పెంచుతుంది. IRCTC యాప్‌లోని ప్రొఫైల్ విభాగంలోకి వెళ్లి ఈ జాబితాను తయారు చేయవచ్చు. మాస్టర్ జాబితాను ఎలా సిద్ధం చేయాలో, దానిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మాస్టర్ లిస్ట్ సిద్ధం చేయడం:
ముందుగా IRCTC యాప్ ఓపెన్ చేయండి
ఆ తర్వాత, My Account ను ఎంచుకోవడం ద్వారా My Master List కు వెళ్లవచ్చు.
ఇంతకుముందే మీరు ఏ లిస్ట్‌నూ ఇక్కడ సృష్టించకపోతే, ఎటువంటి రికార్డ్ ఇక్కడ కనిపించదు. ఇప్పుడు OK క్లిక్ చేయండి.
ఇప్పుడు Add Passengers పై క్లిక్ చేయండి.
మీ పేరు, వయస్సు, ఇతర వివరాలతో పాటు మీతో పాటు ప్రయాణం చేసే వాళ్ల వివరాలు పూర్తి చేయండి.
ఆ తర్వాత SAVE చేయండి.
టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు మాస్టర్ లిస్ట్ ఎలా ఉపయోగించాలి?
టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు Plan My Journey పై క్లిక్ చేయండి.
ఇప్పుడు స్టేషన్, తేదీని ఎంచుకోండి.
ఆ తర్వాత Go to Passenger Details కు వెళ్లండి.
Add Passengers ఆప్షన్‌కు వెళ్లి, మాస్టర్ జాబితా నుంచి ప్రయాణీకుల పేర్లను టిక్ చేయండి. దీనివల్ల, టిక్కెట్ బుకింగ్ కోసం ఆటోమేటిక్‌గా అన్ని వివరాలు ఫిల్ అవుతాయి.
ఆ వెంటనే డబ్బులు చెల్లించండి, మీ టిక్కెట్ బుక్ అవుతుంది.
Master List కారణంగా, టిక్కెట్ బుకింగ్ కాల వ్యవధి తగ్గుతుంది. అందువల్లే తత్కాల్ టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలో కన్ఫర్మ్‌డ్ టిక్కెట్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Cryptocurrency Prices: 24 గంటల్లో రూ.75వేలు తగ్గిన బిట్‌కాయిన్!
Stock Market News: ఆఖరి రోజు అదుర్స్! రిలయన్స్ అండతో 1031 పాయింట్లతో ఢంకా మోగించిన సెన్సెక్స్
April Rules: ఏప్రిల్ నుంచి మారే 7 రూల్స్ ఇవి, జేబులోని పర్సు మీదే వీటి కన్ను
UPI Payments: UPI Payments: యూపీఐ వాడితే ఏప్రిల్ 1 నుంచి ఛార్జీ చెల్లించాలి, కాకపోతే?
Stock Market News: రాకెట్లా దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు - సెన్సెక్స్ 550, నిఫ్టీ 160 పాయింట్లు అప్!
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి