అన్వేషించండి

Swiggy: స్విగ్గీ ఉద్యోగులకు జాక్‌పాట్‌ - 500 మందికి రూ.కోట్లు వచ్చి పడ్డాయి

Swiggy IPO Listing: స్టాక్‌ మార్కెట్‌లోకి స్విగ్గీ అరంగేట్రంతో 500 మంది ఉద్యోగులు తలో రూ.1 కోటికి పైగా సంపాదించారు. అంతేకాదు, చాలామంది సిబ్బంది రూ.9,000 కోట్ల ESOP పూల్‌లో భాగస్వాములుగా ఉన్నారు.

Swiggy Share Price Today: ఫుడ్ డెలివరీ సెక్టార్‌లో జొమాటో (Zomato) కంపెనీకి ప్రత్యర్థి స్విగ్గీ బుధవారం నాడు (13 నవంబర్‌ 2024) స్టాక్‌ మార్కెట్‌లోకి అరంగేట్రం చేసింది. ఈ కంపెనీ షేర్లు దాదాపు 7.69 శాతం ప్రీమియంతో NSEలో రూ. 420 వద్ద లిస్ట్ అయ్యాయి. BSEలో ఒక్కో షేరు 5.64 శాతం ప్రీమియంతో రూ. 412 వద్ద జర్నీ ప్రారంభించింది. రోజు ముగిసే సరికి, ఈ షేర్లు 17 శాతం లాభంతో రూ. 456 వద్ద ముగిశాయి. బుధవారం ట్రేడింగ్‌ చివరి నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ.1,02,062.01 కోట్లుగా ఉంది.

ఉద్యోగులకు కంపెనీలో వాటా
Swiggy ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ఇటీవలి సంవత్సరాల్లో వచ్చిన అతి పెద్ద IPO మాత్రమే కాదు, ఇది కంపెనీ ఉద్యోగులకు జాక్‌పాట్‌ ఆఫర్‌ చేసింది. బెంగళూరుకు చెందిన ఫుడ్ డెలివరీ దిగ్గజం, తన ఉద్యోగులకు "ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్" (ESOPs)ను గతంలోనే కేటాయించింది. అంటే, కంపెనీలో వాటా ఇచ్చింది. ఇప్పుడు స్విగ్గీ స్టాక్‌ మార్కెట్‌లోకి రావడంతో, ESOPs కారణంగా సంస్థ ఉద్యోగులు కోటీశ్వరులుగా మారారు.       

500 మంది కోటీశ్వరులు
500 మంది ఉద్యోగులు ఒక్కొక్కరు కోటి రూపాయలకు పైగా సంపాదిస్తారని, మిగిలిన అర్హులైన సిబ్బంది రూ. 9,000 కోట్ల ESOP పూల్‌ను పంచుకుంటారని మనీ కంట్రోల్‌ నివేదించింది. అనేక సంవత్సరాలుగా కంపెనీలో ఉన్న & సంస్థ వృద్ధికి సహకరించిన ఉద్యోగులు ఈ లిస్టింగ్ నుంచి ప్రయోజనం పొందారు. భారతదేశంలోని స్టార్టప్ వ్యవస్థలో ఇంత సంపద సృష్టి అతి పెద్దది.            

సంపద సృష్టి పరంగా... స్విగ్గీ IPO జొమాటో, పేటీఎం (Paytm) వంటి కంపెనీలను అధిగమించింది. జొమాటో, 2021లో రూ. 9,375 కోట్ల IPOతో పబ్లిక్‌లోకి వచ్చింది, ఆ సమయంలో 18 మంది మిలియనీర్‌లను సృష్టించింది. పేటీఎం లిస్టింగ్‌ దాదాపు 350 మంది ఉద్యోగులను కోటీశ్వరులను చేసింది. స్విగ్గీ IPO ఈ లెక్కల కంటే ఎక్కువ మంది ఉద్యోగులకు రివార్డ్ ఇచ్చింది. ఇది భారతీయ స్టార్టప్ స్పేస్‌లో అత్యంత భారీ సంపద పంపిణీల్లో ఇది ఒకటిగా నిలిచింది.

ఈ రోజు (గురువారం, 14 నవంబర్‌ 2024) ఉదయం 10.10 గంటల సమయానికి, స్విగ్గీ షేర్లు NSEలో 0.68% నష్టంతో రూ. 452.90 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.         

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: థర్డ్ ఏసీ టికెట్‌తో ఫస్ట్ ఏసీలో ప్రయాణం చేయొచ్చు, దీనికోసం ఏం చేయాలి? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Best Gun Combinations in BGMI: బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
బీజీఎంఐలో చికెన్ డిన్నర్ కొట్టాలంటే ఈ గన్ కాంబినేషన్స్ బెస్ట్ - మీ కాంబోలో ఏం ఉన్నాయి?
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
Embed widget