అన్వేషించండి

Fixed Deposit Rates: ఈ రెండు బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లను పెంచాయ్‌, 8.35% వరకు కచ్చితమైన రాబడి

చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో రెండు బ్యాంకుల పేర్లు చేరాయి.

Fixed Deposit Rates: ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ ఏడాది ఐదు సార్లు వడ్డీ రేట్లను పెంచింది. రెపో రేటు 4.00 శాతం నుంచి 6.25 శాతానికి తీసుకెళ్లింది. 2022 డిసెంబర్ 7న జరిగిన సమావేశంలో పెంచిన రేటుతో రెపో రేటు 6.25 శాతానికి చేరింది. ఈ పెరుగుదల బ్యాంకు ఖాతాదారులపైనా ప్రభావం చూపింది. చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో రెండు బ్యాంకుల పేర్లు చేరాయి. అవి... సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, DCB బ్యాంక్. 

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD రేట్లు పెంపు (Suryoday Small Finance Bank FD Rates)
రూ. 2 కోట్ల కంటే తక్కువ FDల మీద వడ్డీ రేటును పెంచాలని సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నిర్ణయించింది. బ్యాంక్ కొత్త రేట్లు 21 డిసెంబర్ 2022 నుంచి అమలులోకి వచ్చాయి. వడ్డీ రేటు పెంపు తర్వాత, సాధారణ ఖాతాదారులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు కాల పరిమితి ఉన్న FDలపై 4.00 శాతం నుంచి 6.00 శాతం వరకు వడ్డీ రేటును ఈ బ్యాంక్‌ అందిస్తోంది. అదే సమయంలో, సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం నుంచి 6.50 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 999 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద గరిష్ట వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తోంది. ఈ కాల వ్యవధి డిపాజిట్ల కోసం, సాధారణ పౌరులకు 8.51 శాతం - సీనియర్ సిటిజన్లకు 8.76 శాతం వడ్డీ రేటును బ్యాంక్‌ అందిస్తోంది.

7 రోజుల నుంచి 14 రోజుల FD – 4.00%
15 రోజుల నుంచి 45 రోజుల FD - 4.25 శాతం
46 రోజుల నుంచి 90 రోజుల FD - 4.50 శాతం
91 రోజుల నుంచి 6 నెలల వరకు FD – 5.00%
6 నెలల నుంచి 9 నెలల వరకు FD - 6.00 శాతం
9 నెలల నుంచి 1 సంవత్సరం వరకు FD - 6.00 శాతం
1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 6 నెలల వరకు FD – 7.00%
1 సంవత్సరం 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు FD - 8.01 శాతం
2 సంవత్సరాల నుంచి 998 రోజుల వరకు FD - 7.51 శాతం
999 రోజుల FD – 8.51%
32 నెలల 27 రోజుల నుంచి 3 సంవత్సరాల వరకు FD - 7.25 శాతం
3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు FD - 6.75 శాతం
5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు FD - 6.00 శాతం

DCB బ్యాంక్ FD రేట్లు పెంపు (DCB Bank FD Rates)
DCB బ్యాంక్ కూడా రూ. 2 కోట్ల కంటే తక్కువ FDలపై వడ్డీ రేటును పెంచాలని నిర్ణయించింది. బ్యాంక్ కొత్త రేట్లు 21 డిసెంబర్ 2022 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ బ్యాంక్, తన సాధారణ ఖాతాదారులకు 3.75 శాతం నుంచి 7.60 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అదే సమయంలో, సీనియర్ సిటిజన్లకు 4.25 శాతం నుంచి 8.10 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సాధారణ పౌరులకు గరిష్టంగా 7.85 శాతం - సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 8.35 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తోంది. వివిధ కాలావధుల కోసం DCB బ్యాంక్ (సాధారణ కస్టమర్లకు) అందిస్తున్న ఈ వడ్డీ రేట్లు ఇవి:

7 రోజుల నుంచి 45 రోజుల FD – 3.75%
46 రోజుల నుంచి 90 రోజుల FD – 4.00%
91 రోజుల నుంచి 6 నెలల వరకు FD – 4.75%
6 నెలల నుంచి 12 నెలల వరకు FD – 6.25%
12 నెలల నుంచి 18 నెలల వరకు FD- 7.25%
18 నెలల నుంచి 700 రోజుల FD – 7.50%
700 రోజుల నుంచి 36 నెలల వరకు FD - 7.85 శాతం
36 నెలల నుంచి 120 నెలల వరకు FD - 7.60 శాతం

పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సహా మరికొన్ని బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను పెంచి, పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Embed widget