అన్వేషించండి

Stocks To Watch Today 29 November 2023: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Tata Tech, Gandhar, Fedbank Fin, ICICI Sec

మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

Stock Market Today, 30 November 2023: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, హెవీవెయిట్స్‌ లాభాలతో బుధవారం ఇండియన్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు ర్యాలీ చేశాయి. మొమెంటం కొనసాగుతుందని మార్కెట్‌ ఎనలిస్ట్‌లు భావిస్తున్నారు. అయితే.. GDP, మంత్లీ F&O ఎక్స్‌పైరీ, ఎగ్జిట్ పోల్స్, ఈ రోజు జరిగే OPEC+ సమావేశం వంటి కీలక అంశాలు మార్కెట్‌ డైరెక్షన్‌ను మార్చే అవకాశం ఉంది.

నిఫ్టీ, 19900 స్థాయిని బ్రేక్‌ చేసింది కాబట్టి, భవిష్యత్‌ సెషన్స్‌లో 20250-20350 స్థాయిలకు చేరే ఛాన్స్‌ ఉంది, కొత్త ఆల్-టైమ్ గరిష్టాలు ఏర్పడొచ్చు. తక్షణ మద్దతు 19950 స్థాయిలో ఉంది.

US స్టాక్స్ పతనం
బుధవారం U.S. స్టాక్స్ నష్టాల్లో క్లోజ్‌ అయ్యాయి. డో జోన్స్‌ 0.04%, S&P ఆఫ్ 0.09%, నాస్‌డాక్ 0.16 శాతం క్షీణించాయి. బలంగా పుంజుకుంటున్న ఆ దేశ GDPతో మాంద్యం భయాలు తగ్గాయి. అయితే, ఫెడరల్ రిజర్వ్ అధికార్లు చేసిన కామెంట్లతో రెస్ట్రిక్టివ్‌ పాలసీ విధానంపై సందేహాలు రేకెత్తాయి.

మిక్స్‌డ్‌గా ఆసియా స్టాక్స్‌
2024 ప్రథమార్థంలో ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్లను తగ్గించే పనిని ప్రారంభించే అవకాశం ఉందన్న అంచనాలతో ఆసియాలో షేర్లు కొద్దిగా మారాయి. హాంగ్ సెంగ్ ఫ్యూచర్స్ 0.4% పెరిగింది, జపాన్ టోపిక్స్ 0.4% పడిపోయింది, ఆస్ట్రేలియా S&P/ASX 200 కొద్దిగా మారింది. 

ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 20 పాయింట్లు లేదా 0.01% గ్రీన్‌ కలర్‌లో 20,129 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

టాటా టెక్నాలజీస్, గాంధార్ ఆయిల్, ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్: ఈ మూడు కంపెనీల షేర్లు ఈ రోజు (గురువారం) ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అవుతాయి. టాటా టెక్నాలజీస్, గాంధార్ ఆయిల్ మంచి ప్రీమియంతో స్టార్ట్‌ అయ్యే అవకాశం ఉంది, ఫెడ్‌బ్యాంక్‌లో స్థబ్దత ఉండవచ్చు.

జొమాటో: చైనాకు చెందిన అలిపే, ఫుడ్ డెలివరీ కంపెనీ జోమాటోలో తన మొత్తం వాటాను బుధవారం బ్లాక్ డీల్స్ ద్వారా దాదాపు రూ.3,336 కోట్లకు విక్రయించింది.

ICICI సెక్యూరిటీస్‌: ICICI సెక్యూరిటీల షేర్లను డీలిస్ట్ చేయడానికి BSE, NSE నుంచి "నో అబ్జెక్షన్" లెటర్స్‌ను ICICI బ్యాంక్ అందుకుంది.

థామస్ కుక్: థామస్ కుక్ లిమిటెడ్ ప్రమోటర్ కంపెనీ ఫెయిర్‌బ్రిడ్జ్ క్యాపిటల్ (మారిషస్) లిమిటెడ్, ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా థామస్ కుక్‌లో 8.5% వాటాను విక్రయించాలని బుధవారం ప్రతిపాదించింది.

SBI లైఫ్: SBI లైఫ్ MD & CEOగా అమిత్ జింగ్రాన్‌ నియామకానికి షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు.

GNFC: టెండర్ రూట్‌ ద్వారా షేర్‌ బైబ్యాక్ తేదీలను GNFC ప్రకటించింది. బైబ్యాక్ డిసెంబర్ 1న ప్రారంభమై అదే నెల 7వ తేదీన ముగుస్తుంది.

ZEE: సోనీతో విలీనం క్యాన్సిల్‌ చేస్తున్నారంటూ వచ్చిన వార్తలు తప్పని Zee ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటించింది.

అల్ట్రాటెక్ సిమెంట్: బర్న్‌పూర్ సిమెంట్ నుంచి సిమెంట్ గ్రైండింగ్ అసెట్స్‌ను అల్ట్రాటెక్ సిమెంట్ కొనుగోలు చేసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: అదానీ రిటర్న్స్‌ - టాప్-20 బిలియనీర్స్‌ లిస్ట్‌లోకి రీఎంట్రీ, ఒక్కరోజులో రూ.లక్ష కోట్ల ర్యాలీ

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Ek Love Story: ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి  పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Embed widget