అన్వేషించండి

Gautam Adani: అదానీ రిటర్న్స్‌ - టాప్-20 బిలియనీర్స్‌ లిస్ట్‌లోకి రీఎంట్రీ, ఒక్కరోజులో రూ.లక్ష కోట్ల ర్యాలీ

సోమవారం బిజినెస్‌ అవర్స్‌ ముగిసే నాటికి రూ.10.27 లక్షల కోట్లుగా ఉండగా, మంగళవారం ట్రేడింగ్‌ ముగింపు సమయానికి రూ.11.31 లక్షల కోట్లకు పెరిగాయి.

Gautam Adani is back on the top-20 billionaires list: అదానీ గ్రూప్‌ ఓనర్‌ గౌతమ్‌ అదానీ హవా మళ్లీ కొనసాగుతోంది. దేశంలో రెండో అత్యంత ధనవంతుడైన అదానీ సంపద విలువ ఒక్కసారిగా పెరిగింది. దీంతో, ప్రపంచంలోని టాప్‌ 20 సంపన్నుల జాబితాలో మళ్లీ గౌతమ్‌ అదానీ పేరు చేరింది.

నిన్న (మంగళవారం, 28 నవంబర్‌ 2023) అదానీ గ్రూప్ షేర్లు విపరీతంగా ర్యాలీ చేశాయి. దీనివల్ల, అదానీ గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా 1 లక్ష కోట్లు పెరిగింది. గ్రూప్‌లో మేజర్‌ షేర్‌ హోల్డర్‌ అయిన అదానీ సంపద విలువ (Gautam Adani wealth) కూడా అమాంతం ఎగబాకింది. ఆస్తుల విలువ పెరగడంతో, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ల జాబితాలో (Bloomberg top 20 billionaires in the world) రెండు స్థానాలు మెరుగుపరుచుకుని, టాప్-20లోకి అదానీ తిరిగి వచ్చారు. అంతకుముందు, ఈ జాబితాలో 22వ స్థానంలో ఉన్నారు. అదానీ నికర విలువ (Gautam Adani networth) 6.5 బిలియన్ డాలర్లు పెరిగి 66.7 బిలియన్లను దాటింది.

షేర్లలో భారీ పెరుగుదల
మంగళవారం, అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లోని లిస్టెడ్‌ కంపెనీల షేర్లు దాదాపు 20 శాతం వరకు లాభపడ్డాయి. అదానీ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ (Adani group market capitalisation 2023) సోమవారం బిజినెస్‌ అవర్స్‌ ముగిసే నాటికి రూ.10.27 లక్షల కోట్లుగా ఉండగా, మంగళవారం ట్రేడింగ్‌ ముగింపు సమయానికి రూ.11.31 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే, కేవలం 24 గంటల వ్యవధిలో రూ. 1.04 లక్షల కోట్లు పెరిగాయి. ఈ ఏడాది జనవరి 24న హిండెన్‌బర్గ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత, అదానీ గ్రూప్ షేర్లు ఒక్కరోజులో ఇంతగా పెరగడం ఇదే తొలిసారి.

అదానీ స్టాక్స్ ర్యాలీకి కారణాలు
హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ (Hindenburg Research report) కేసులో సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది. ఆ కేసులో తీర్పును అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్‌ చేసింది. అదానీ గ్రూప్‌ అవకతవకలకు పాల్పడినట్లు తమకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని సెబీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు చెప్పింది. ఈ నేపథ్యంలో, అత్యున్నత న్యాయస్థానం తీర్పు అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా ఉండదు అన్న ఊహాగానాలతో అదానీ కంపెనీల షేర్లు పెరుగుతున్నాయి. 

దీనికితోడు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ‍‌ఫలితాలపై ‍‌(Election Results of Five States) అంచనాలు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు (General Elections 2024) కూడా అదానీ గ్రూప్‌ షేర్లను వేగంగా నడిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ బలం పెరుగుతుందని, మరోమారు కమలం పార్టీనే అధికారంలోకి వస్తుందని ఇటీవల కొన్ని రిపోర్ట్స్‌ మార్కెట్‌లో చక్కర్లు కొట్టాయి. ప్రభుత్వం మారకపోతే అదానీ గ్రూప్‌ లాభపడుతుందని మార్కెట్‌ భావిస్తోంది. 

13వ ప్లేస్‌లో ముకేష్ అంబానీ
బ్లూమ్‌బెర్గ్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో, మన దేశంలో అత్యంత సంపన్న వ్యక్తి ముకేష్ అంబానీ 13వ స్థానంలో నిలిచారు. అతని మొత్తం నికర విలువ (Mukesh Ambani networth) దాదాపు 89.5 బిలియన్‌ డాలర్లు. ఈ ఏడాది ముకేష్ అంబానీ సంపద 2.34 బిలియన్ డాలర్లు పెరిగింది. 

టెస్లా, ఎక్స్ వంటి గ్లోబల్‌ కంపెనీల ఓనర్‌ ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రపంచ సంపన్నుల లిస్ట్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌లో ఉన్నారు. అతని మొత్తం సంపద విలువ 228 బిలియన్ డాలర్లు. రెండో స్థానంలో, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) పేరు ఉంది, అతని నికర విలువ 171 బిలియన్‌ డాలర్లు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault) 167 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నారు.

మరో ఆసక్తికర కథనం: డిసెంబర్‌లో బ్యాంక్‌లకు 18 రోజులు సెలవులు, 6 రోజులు సమ్మె - ఇక మీ బ్యాంక్‌ పని అయినట్టే!

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayawada News: వైసీపీ వైపు జలీల్ ఖాన్ చూపు- దిద్దుబాటు చర్యల్లో టీడీపీ
వైసీపీ వైపు జలీల్ ఖాన్ చూపు- దిద్దుబాటు చర్యల్లో టీడీపీ
YS Sharmila: నేడు కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్, పార్టీ నేతల హౌస్ అరెస్టులపై షర్మిల ఫైర్
నేడు కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్, పార్టీ నేతల హౌస్ అరెస్టులపై షర్మిల ఫైర్
Moto G04 Sale: రూ.10 వేలలో బెస్ట్ ఫోన్ - సేల్ నేటి నుంచే - 16 వేలలోపే 8 జీబీ ర్యామ్!
రూ.10 వేలలో బెస్ట్ ఫోన్ - సేల్ నేటి నుంచే - 16 వేలలోపే 8 జీబీ ర్యామ్!
APPSC Group 2 Exam: గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఏపీపీఎస్సీ లేఖపై స్పందించిన ఎస్‌బీఐ
గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఏపీపీఎస్సీ లేఖపై స్పందించిన ఎస్‌బీఐ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on Gas Cylinder : ఆరు గ్యారెంటీల్లో మరో హామీ అమలు ప్రకటించిన సీఎం రేవంత్| ABP DesamRakul Preet Singh Wedding : గోవాలో గ్రాండ్ గా రకుల్ ప్రీత్ సింగ్ వివాహం | ABP DesamVarun Tej on Lavanya Tripathi : పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ చేస్తానంటున్న వరుణ్ తేజ్ | ABP DesamTDP Leaders Welcoming Vemireddy prabhakar reddy : వేమిరెడ్డిని టీడీపీలోకి ఆహ్వానిస్తున్న నేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada News: వైసీపీ వైపు జలీల్ ఖాన్ చూపు- దిద్దుబాటు చర్యల్లో టీడీపీ
వైసీపీ వైపు జలీల్ ఖాన్ చూపు- దిద్దుబాటు చర్యల్లో టీడీపీ
YS Sharmila: నేడు కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్, పార్టీ నేతల హౌస్ అరెస్టులపై షర్మిల ఫైర్
నేడు కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్, పార్టీ నేతల హౌస్ అరెస్టులపై షర్మిల ఫైర్
Moto G04 Sale: రూ.10 వేలలో బెస్ట్ ఫోన్ - సేల్ నేటి నుంచే - 16 వేలలోపే 8 జీబీ ర్యామ్!
రూ.10 వేలలో బెస్ట్ ఫోన్ - సేల్ నేటి నుంచే - 16 వేలలోపే 8 జీబీ ర్యామ్!
APPSC Group 2 Exam: గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఏపీపీఎస్సీ లేఖపై స్పందించిన ఎస్‌బీఐ
గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఏపీపీఎస్సీ లేఖపై స్పందించిన ఎస్‌బీఐ
Rakul Preet Singh wedding: పెళ్లి ఫొటోలు విడుదల చేసిన రకుల్‌ - ఇకపై నువ్వు నా సొంతం అంటూ భర్తపై ప్రేమ..
పెళ్లి ఫొటోలు విడుదల చేసిన రకుల్‌ - ఇకపై నువ్వు నా సొంతం అంటూ భర్తపై ప్రేమ..
Medaram Jatara 2024: మేడారం జాతరలో బెల్లమే బంగారం ఎలా అయింది!
Medaram Jatara 2024: మేడారం జాతరలో బెల్లమే బంగారం ఎలా అయింది!
Congress Alliance In AP : ఏపీలో మరో కూటమి, కాంగ్రెస్‌ సారథ్యంలో ఏర్పాటు..?
ఏపీలో మరో కూటమి, కాంగ్రెస్‌ సారథ్యంలో ఏర్పాటు..?
Singareni Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ -త్వరలోనే సింగ‌రేణిలో పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు: డిప్యూటీ సీఎం భట్టి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ -త్వరలోనే సింగ‌రేణిలో పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు: డిప్యూటీ సీఎం భట్టి
Embed widget