Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Aster DM, Adani, CDSL, SpiceJet
మన స్టాక్ మార్కెట్ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 27 March 2024: గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్నాయి, భారత మార్కెట్లు ఈ రోజు (బుధవారం) అస్థిరంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 21 పాయింట్లు లేదా 0.1 శాతం రెడ్ కలర్‌లో 22,053 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
గ్లోబల్ మార్కెట్లు
ఈ రోజు ఉదయం, ఆసియా మార్కెట్లు దాదాపుగా పాజిటివ్ సైడ్‌లో మూవ్ అవుతున్నాయి. జపాన్‌కు చెందిన నికాయ్ 0.65 శాతం పెరిగి 40,662 స్థాయి కంటే పైన ట్రేడవుతోంది. Topix కూడా 0.67 శాతం పెరిగింది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి రేంజ్ బౌండ్‌లో ఉంది. ఆస్ట్రేలియా ASX 200 కూడా 0.37 శాతం పెరిగింది. అయితే, హాంగ్ కాంగ్‌కు చెందిన హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ 1.32 శాతం క్షీణించి 16,398 స్థాయిలకు చేరుకుంది.
నిన్న, అమెరికాలో, మూడు ప్రధాన ఇండెక్స్‌లు వరుసగా మూడో రోజూ నష్టాల్లో కొనసాగాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ స్వల్పంగా పడిపోయింది. S&P 500 0.28 శాతం దిగి వచ్చింది. టెక్ హెవీ నాస్‌డాక్ కాంపోజిట్ 0.42 శాతం క్షీణించింది.
అమెరికాలో బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ స్వల్పంగా పెరిగి 4.236 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ భారీగా పడిపోయి, బ్యారెల్‌కు $85 వద్దకు తిరిగి వచ్చింది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
ఆస్టర్ DM హెల్త్‌కేర్: ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఒలింపస్ క్యాపిటల్ ఆసియా, ఆస్టర్ DM హెల్త్‌కేర్‌లో 9.8 శాతం వాటాను 19.53 బిలియన్ రూపాయలకు విక్రయించాలని యోచిస్తోంది.
CDSL: CDSLలో పబ్లిక్ షేర్‌హోల్డర్ అయిన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, తనకున్న మొత్తం 7.18 శాతం వాటాను (75 లక్షల ఈక్విటీ షేర్లు) 151 మిలియన్ డాలర్లకు బ్లాక్ డీల్ ద్వారా విక్రయించే అవకాశం ఉంది.
స్పైస్‌జెట్: రూ.755 కోట్ల రుణాలను సెటిల్ చేసేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ కంపెనీ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కెనడాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల, ఫైనాన్స్‌లో ఉన్న 15 బాంబార్డియర్ Q400 విమానాల్లో 13 విమానాల యాజమాన్యం స్పైస్‌జెట్‌కు దక్కుతుంది.
అదానీ పోర్ట్స్: మన దేశంలో అతి పెద్ద పోర్ట్ ఆపరేటర్ అయిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ), ఒడిశాలోని గోపాల్‌పూర్ పోర్ట్ లిమిటెడ్‌లో (GPL) 95 శాతం వాటాను రూ.3,080 కోట్లకు కొనుగోలు చేయడంతో, భారతదేశ తీరప్రాంతంలో ఈ కంపెనీ ఉనికి మరింత పెరిగింది.
L&T: రూ.7,500 కోట్లను సమీకరించేందుకు లార్సెన్ & టూబ్రో డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. బాహ్య వాణిజ్య రుణాలు, టర్మ్ లోన్లు, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు వంటి వాటి రూపంలో ఈ డబ్బు సేకరిస్తుంది.
ఎల్‌ఐసి: 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, GST చెల్లింపుల కోసం పన్ను అధికారులు దాదాపు రూ.39.39 లక్షల డిమాండ్ నోటీసును పంపినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
సనోఫీ ఇండియా - సిప్లా: భారతదేశంలో సనోఫీ సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ (CNS) ఔషధాలను మరింత విస్తృతంగా మార్కెటింగ్ చేయడానికి రెండు కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. సనోఫీకి చెందిన CNS ఔషధాలను పంపిణీ చేయడానికి సిప్లా కంపెనీ తన విస్తృత నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటుంది.
పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్: రైట్స్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ ద్వారా పిరమల్ క్యాపిటల్ & హౌసింగ్ ఫైనాన్స్‌లో రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి