Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Bajaj Auto, Tata Steel, Tech M, TVS Motor
మన స్టాక్ మార్కెట్ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 25 January 2024: గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు మిశ్రమంగా ఉండడంతో, ఈ రోజు (గురువారం) ఇండియన్ ఈక్విటీ మార్కెట్లలో ట్రేడింగ్ ఆశాజనకంగా ప్రారంభం కాకపోవచ్చు.
ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 42 పాయింట్లు లేదా 0.19 శాతం నష్టంతో 21440 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
గ్లోబల్ మార్కెట్లు
నిన్న యుఎస్ మార్కెట్లు పతనంతో, ఈ రోజు ఉదయం ఆసియాలోని ప్రధాన మార్కెట్లు స్థబ్దుగా ట్రేడవుతున్నాయి. తైవాన్ 0.5 శాతం, హాంగ్ సెంగ్ 0.2 శాతం పెరిగింది. నికాయ్, కోస్పీ 0.3 శాతం క్షీణించాయి.
ఓవర్‌నైట్‌లో, యూఎస్ మార్కెట్లలో డౌ జోన్స్ 0.3 శాతం క్షీణించి, ఇంట్రా డే కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. నాస్‌డాక్ 0.4 శాతం, S&P 500 0.1 శాతం లాభపడ్డాయి,
US బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ 4.176 శాతానికి పెరిగాయి. ఈ రోజు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ECB) పాలసీ నిర్ణయాలను ప్రకటిస్తుంది. వడ్డీ రేట్లను ECB యథాతథంగా ఉంచుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: ACC, అదానీ పవర్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సైయెంట్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, HPCL, ఇండియన్ ఎనర్జీ ఎక్సేంజ్ (IEX), ఇంద్రప్రస్థ గ్యాస్, JSW స్టీల్, LT ఫుడ్స్, నోవార్టిస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, SBI కార్డ్స్, SBI లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా టెక్నాలజీస్, వేదాంత.
టాటా స్టీల్: 2023 డిసెంబర్ త్రైమాసికంలో రూ. 513.37 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని సాధించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ. 2,223.84 కోట్ల నికర నష్టంలో ఉంది. ఆదాయం ఏడాది ప్రాతిపదికన (YoY) 3.1 శాతం తగ్గి రూ.55,311.88 కోట్లకు చేరుకుంది.
బజాజ్ ఆటో: Q3 FY24 ఏకీకృత నికర లాభం మార్కెట్ అంచనాల కంటే పెరిగింది. లాభం 38 శాతం పెరిగి రూ.2,032 కోట్లు మిగిలింది. ఆదాయం 30 శాతం పెరిగి రూ.12,165 కోట్లకు చేరుకుంది.
టెక్ మహీంద్ర: Q3 నికర లాభం 60.6 శాతం తగ్గి రూ. 510.4 కోట్లకు చేరుకోగా, ఆదాయం 4.6 శాతం తగ్గి రూ. 13,101 కోట్లకు పరిమితమైంది.
TVS మోటార్: డిసెంబర్ క్వార్టర్‌లో కంపెనీ నికర లాభం గత ఏడాది కంటే 59 శాతం జంప్‌తో రూ.478.75 కోట్లకు చేరింది. కార్యకలాపాల ఆదాయం 25 శాతం పెరిగి రూ.10,113.94 కోట్లుగా లెక్క తేలింది.
ఇండియన్ ఆయిల్ (IOC): మార్కెటింగ్ మార్జిన్స్ పెరగడంతో 2023 డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 10 రెట్లు పైగా పెరిగి రూ. 9,030 కోట్లకు చేరుకుంది.
కెనరా బ్యాంక్: Q3 FY24 నికర లాభంలో 26.9 శాతం వృద్ధితో రూ. 3,656 కోట్లను మిగుల్చుకుంది. నికర వడ్డీ ఆదాయం (NII) 9.5 శాతం పెరిగి రూ.9,417 కోట్లకు చేరుకుంది.
జీ ఎంటర్‌టైన్‌మెంట్: సోనీ ఇండియాతో విలీన ఒప్పందం రద్దు నేపథ్యంలో, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆశ్రయించింది. విలీన పథకాన్ని అమలు చేసేలా సోనీ ఇండియాను ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించింది. 10 సంవత్సరాల బాండ్ కూపన్ రేటును 7.57 శాతంగా నిర్ణయించింది.
సియట్: Q3 FY24 నికర లాభం, ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 5 రెట్లు పెరిగి రూ.181.48 కోట్లకు చేరుకుంది. ఆదాయం 8.6 శాతం పెరిగి రూ.2,963.14 కోట్లకు చేరుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: పర్సనల్ లోన్ కావాలా?, తక్కువ వడ్డీ తీసుకుంటున్న బ్యాంక్‌లు ఇవే