Stocks Watch Today, 22 May 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Vedanta, Delhivery, Power Grid
మన స్టాక్ మార్కెట్ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stock Market Today, 22 May 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 8.15 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 26 పాయింట్లు లేదా 0.14 శాతం రెడ్ కలర్‌లో 18,213 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: శ్రీ సిమెంట్స్, BPCL, PB ఫిన్‌టెక్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్. ఈ షేర్లపై మార్కెట్ దృష్టి ఉంటుంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
MCX: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో MCX రూ. 5.5 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అదే సమయంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 134 కోట్లుగా ఉంది.
BEL: నాలుగో త్రైమాసికానికి BEL నికర లాభం ఏడాది ప్రాతిపదికన దాదాపు 20% పెరిగి రూ. 1,382 కోట్లకు చేరుకుంది, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 2% పెరిగి రూ. 6,479 కోట్లకు చేరుకుంది.
నీల్‌కమల్: జనవరి-మార్చి కాలంలో నీల్‌కమల్ రూ. 48 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈ కాలంలో కార్యకలాపాల ద్వారా రూ. 829 ఆదాయం వచ్చింది.
దొడ్ల డెయిరీ: Q4FY23లో రూ. 22 కోట్ల నికర లాభాన్ని ఈ డెయిరీ సంస్థ ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 23% YoY పెరిగి రూ. 724 కోట్లకు చేరుకుంది.
గోదావరి పవర్ అండ్ ఇస్పాత్: నాలుగో త్రైమాసికంలో గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ నికర లాభం 58% తగ్గి రూ. 170 కోట్లకు పరిమితమైంది. ఆదాయం 8% తగ్గి రూ. 1,316 కోట్లుగా నమోదైంది.
దివీస్ ల్యాబ్స్: మార్చి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 64% YoY తగ్గి, రూ. 321 కోట్లకు పడిపోయిందని దివీస్ లాబొరేటరీస్ నివేదించింది. ఆదాయం 22.5% క్షీణించి రూ.1,951 కోట్లకు చేరుకుంది.
NTPC: మార్చితో ముగిసిన త్రైమాసికంలో, విద్యుత్ ఉత్పత్తి దిగ్గజం NTPC లిమిటెడ్ ఏకీకృత నికర లాభం 6% తగ్గి రూ. 4,871 కోట్లకు చేరుకుంది. సమీక్ష కాల త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం 19% పెరిగి రూ. 44,253 కోట్లకు చేరుకుంది.
పవర్ గ్రిడ్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏకీకృత నికర లాభం సంవత్సరానికి దాదాపు 4% వృద్ధితో రూ. 4,320 కోట్లకు పెరిగింది. ఈ త్రైమాసికంలో ఆదాయం దాదాపు 15% పెరిగి రూ. 12,264 కోట్లకు చేరుకుంది.
డెలివెరీ: లాజిస్టిక్స్ సంస్థ డెలివెరీ ఏకీకృత నికర నష్టం మార్చి త్రైమాసికంలో రూ. 159 కోట్లకు పెరిగింది. సమీక్ష కాల త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం 10% YoY తగ్గి రూ. 1,860 కోట్లకు చేరుకుంది.
JSW స్టీల్: జనవరి-మార్చి కాలంలో స్టీల్ దిగ్గజం ఏకీకృత నికర లాభం 13% వృద్ధితో రూ. 3,664 కోట్లకు చేరుకుంది. రిపోర్టింగ్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ. 46,962 కోట్ల ఆదాయం వచ్చింది, YoY ప్రాతిపదికన ఫ్లాట్‌గా ఉంది.
ఇది కూడా చదవండి: సల్లూ భాయ్ లగ్జరీ హోటల్, 19 అంతస్తుల బిల్డింగ్ ప్లాన్ వింటే వావ్ అంటారు
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.