Stocks To Watch 18 July 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Sheela Foam, Amara Raja Batteries
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
![Stocks To Watch 18 July 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Sheela Foam, Amara Raja Batteries Stocks to watch today 18 July 2023 todays stock market todays share market Stocks To Watch 18 July 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Sheela Foam, Amara Raja Batteries](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/18/d8a7c6f1734641f370e0e4b34f5c41571689647867267545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stock Market Today, 18 July 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 8.10 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 9 పాయింట్లు లేదా 0.05 శాతం రెడ్ కలర్‌లో 19,770 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ Q1 రిజల్ట్స్: ఇండస్‌ఇండ్ బ్యాంక్, ICICI ప్రూ లైఫ్, పాలిక్యాబ్, L&T టెక్ ఇవాళ జూన్ త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తాయి. కాబట్టి, ఈ స్టాక్స్ మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
షీలా ఫోమ్: “స్లీప్‌వెల్” బ్రాండ్‌తో పరుపులు, దిండ్లు అమ్ముతున్న షీలా ఫోమ్, ఇదే రంగంలో బిజినెస్ చేస్తున్న కుర్లాన్ ఎంటర్‌ప్రైజెస్‌లో 94.66 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. “కర్ల్-ఆన్” బ్రాండ్‌తో కుర్లాన్ ఎంటర్‌ప్రైజెస్ బిజినెస్ చేస్తోంది. కుర్లాన్ ఎంటర్‌ప్రైజెస్ ఈక్విటీ విలువను రూ.2,150 కోట్లుగా లెక్కించి, 94.66 శాతం వాటా కోసం రూ. 2,035 కోట్లను షీలా ఫోమ్ చెల్లిస్తుంది.
LTIMindtree: 2023-24 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో LTIMindtree రూ. 1,152 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నివేదించింది. ఇది, గత సంవత్సరం ఇదే కాలంలోని రూ. 1,106 కోట్ల కంటే ఇది 4% ఎక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ. 7,644 కోట్ల నుంచి దాదాపు 14% పెరిగి రూ. 8,702 కోట్లుగా నమోదైంది.
టాటా ఎల్‌స్కీ: జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో టాటా ఎల్‌స్కీ నికర లాభం స్వల్పంగా 2% పెరిగి రూ. 189 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ఆదాయం 17% పెరిగింది.
పతంజలి ఫుడ్స్: అదానీ కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టిన యూఎస్ కంపెనీ GQG పార్ట్‌నర్స్, బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని FMCG కంపెనీ పతంజలి ఫుడ్స్‌లోనూ వాటా కొనుగోలు చేసింది. ఫ్లోరిడా కేంద్రంగా పని చేస్తున్న ఈ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, పతంజలి ఫుడ్స్‌లో రూ. 2,400 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది.
అమర రాజా బ్యాటరీస్: రిపోర్ట్స్ ప్రకారం, క్లారియోస్ ARBL హోల్డింగ్స్ అమర రాజా బ్యాటరీస్‌లో తనకు ఉన్న మొత్తం వాటాను బ్లాక్ డీల్ ద్వారా విక్రయించే అవకాశం ఉంది.
RPP ఇన్‌ఫ్రా: హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో రూ. 138 కోట్లతో కొత్త ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం కంపెనీ అంగీకార పత్రాన్ని (letter of acceptance) RPP ఇన్‌ఫ్రా అందుకుంది.
IDFC: మహేంద్ర ఎన్ షాను MDగా రీ-అపాయింట్ చేయడానికి, కంపెనీ CFOగా బిపిన్ జెమాని నియామకాన్ని IDFC డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.
HPCL: భారతదేశంలో గ్యాసోలిన్ డిమాండ్ ఆగస్టు చివరి నుంచి పెరిగే అవకాశం ఉందని, డీజిల్ వినియోగం బలహీనంగా ఉంటుందని HPCL వెల్లడించింది.
ONGC: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఈస్ట్ కోస్ట్ బ్లాక్ నుంచి 8,000 - 10,000 BPDలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ONGC ప్రకటించింది.
ఇది కూడా చదవండి: పతంజలి ఫుడ్స్‌పై కన్నేసిన 'అదానీ ఇన్వెస్టర్'! టార్గెట్ పెంచేశారుగా!!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)