Stocks To Watch 04 July 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' IDFC First Bank, DMart
స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 04 July 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 8.15 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 12 పాయింట్లు లేదా 0.06 శాతం గ్రీన్ కలర్‌లో 19,451 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
IDFC ఫస్ట్ బ్యాంక్: IDFC లిమిటెడ్‌ను, IDFC ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీని IDFC ఫస్ట్ బ్యాంక్‌లో విలీనం చేయడానికి బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ పచ్చజెండా ఊపింది.
ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్: ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ వెహికల్స్ బిజినెస్ కోసం, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనుబంధ సంస్థ TI క్లీన్ మొబిలిటీ, ఆనంద్ జయచంద్రన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఒక సబ్సిడియరీ కంపెనీని TI క్లీన్ మొబిలిటీ ఏర్పాటు చేస్తుంది.
ఆయిల్ ఇండియా: నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ అమలు కోసం ప్రాజెక్ట్ మూలధన వ్యయ అంచనాను రూ. 6,555 కోట్ల నుంచి రూ. 7,231 కోట్లకు పెంచేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.
ఇండస్ఇండ్ బ్యాంక్: ఈ బ్యాంక్‌తో పాటు మరికొన్ని స్ట్రాటెజిక్ ఆబ్జెక్టివ్స్‌లో వాటాను పెంచుకోవడానికి 1.5 బిలియన్ డాలర్ల మూలధనం సమీకరించాలని బ్యాంక్ ప్రమోటర్ ఎంటిటీ 'ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్' ప్లాన్ చేస్తోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్: 'జియో భారత్ ఫోన్'ను రిలయన్స్ జియో ప్రారంభించింది. తద్వారా, ఇప్పటికే ఉన్న 250 మిలియన్ ఫీచర్ ఫోన్ యూజర్లను ఈ ఇంటర్నెట్ ఎనేబుల్ ఫోన్‌లతో తన గుప్పెట్లో పెట్టుకోగలుగుతుంది. మొదటి 1 మిలియన్ జియో భారత్ ఫోన్‌ల కోసం బీటా ట్రయల్ ఈ నెల 7 నుంచి ప్రారంభం అవుతుంది.
బజాజ్ ఫైనాన్స్: కంపెనీ నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) జూన్ 2023 (Q1) నాటికి 32% పెరిగి రూ. 2.7 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మొదటి త్రైమాసికంలో, AUMలో దాదాపు రూ. 22,700 కోట్ల QoQ వృద్ధిని నమోదు చేసింది.
వేదాంత: లంజిగర్ రిఫైనరీలో అల్యూమినా ఉత్పత్తి YoYలో 18%, QoQలో 4% తగ్గింది. ఆపరేషన్లలో ఎఫిషియన్సీ కారణంగా అల్యూమినియం ఉత్పత్తి YoYలో 2% 579ktకి పెరిగింది.
జెనస్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: 27.69 లక్షల స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు, ఫీడర్ మీటర్, DT మీటర్ స్థాయి ఎనర్జీ అకౌంటింగ్ కోసం... సరఫరా, ఇన్‌స్టాలేషన్ & కమీషనింగ్‌తో కూడిన AMI సిస్టమ్ డిజైన్ సహా అధునాతన మీటరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడర్ (AMISP) నియామకానికి జెనస్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ. 2,207.53 కోట్ల లెటర్ ఆఫ్ అవార్డ్ (LOA) అందుకుంది.
అవెన్యూ సూపర్‌మార్ట్స్: రిటైల్ చైన్ DMartని నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్, జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి రూ. 11,584 కోట్ల స్టాండ్‌లోన్ ఆదాయాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ. 9,806 కోట్లతో పోలిస్తే ఇది 18% ఎక్కువ.
మరో ఆసక్తికర కథనం: యెస్ బ్యాంక్ FDలపై మరింత ఆదాయం - వడ్డీ రేట్లు పెంపు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.