By: ABP Desam | Updated at : 03 Jul 2023 03:23 PM (IST)
యెస్ బ్యాంక్ FDలపై మరింత ఆదాయం - వడ్డీ రేట్లు పెంపు
Yes Bank New FD Rates: దేశంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యెస్ బ్యాంక్, తన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను మార్చింది. కొత్త FD రేట్లు ఈ రోజు నుంచి (జులై 3, 2023) నుంచి అమలులోకి వచ్చాయి. యెస్ బ్యాంక్, 2 కోట్ల రూపాయల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో రేట్లను మార్చింది. కొత్త రేట్ల ప్రకారం... 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మెచ్యూరిటీ గడువు ఉన్న FDలపై 3.25 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ ఆదాయం లభిస్తుంది. సాధారణ కస్టమర్లకు (60 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న వాళ్లు) ఈ రేట్లు వర్తిస్తాయి. యెస్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా వడ్డీ రేట్ల మార్పులను అప్‌డేట్ చేశారు.
యెస్ బ్యాంక్ కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు:
7 రోజుల నుంచి 14 రోజుల దేశీయ టర్మ్ డిపాజిట్లపై 3.25 శాతం వడ్డీ చెల్లిస్తుంది
15 రోజుల నుంచి 45 రోజుల కాల పరిమితి గల ఎఫ్‌డీలపై 3.70 శాతం వడ్డీని అందిస్తోంది
46 రోజుల నుంచి 90 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.10 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది
91 రోజుల నుంచి 180 రోజుల టర్మ్ డిపాజిట్ల మీద 4.75 శాతం వడ్డీ ఇస్తుంది
121 రోజుల నుంచి 180 రోజుల FDలపై 5 శాతం వడ్డీ రేటు చెల్లిస్తుంది
మరో ఆసక్తికర కథనం: కార్డ్‌లెస్ క్యాష్, UPI ఫీచర్స్ - అబ్బో, YONO మారిపోయిందిగా!
10 బేసిస్ పాయింట్లు పెంపు
181 రోజుల నుంచి 271 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచింది యెస్ బ్యాంక్. 272 రోజుల నుంచి 1 సంవత్సరం మెచ్యూరిటీ ఉన్న ఎఫ్‌డీలపైనా వడ్డీ రేటును 0.10 శాతం లేదా 10 బేసిస్ పాయింట్లు పెంచింది. 181 రోజుల నుంచి 271 రోజుల వరకు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇప్పటి నుంచి 6.10 శాతం వడ్డీ లభిస్తుండగా, 272 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు ఉండే ఎఫ్‌డీలపై 6.35 శాతం వడ్డీ అందుతుంది.
ఈ FDలపై 7.50 శాతం వరకు వడ్డీ
1 సంవత్సరం నుంచి 18 నెలల టర్మ్ డిపాజిట్ల మీద 7.50 శాతం వడ్డీని యెస్ బ్యాంక్ అందిస్తుంది. 18 నెలల నుంచి 36 నెలల FDల మీద 7.75 శాతం వడ్డీని చెల్లిస్తుంది. 36 నెలల నుంచి 120 నెలల కాల వ్యవధి గల డిపాజిట్లపై 7 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
నేటి నుంచి సీనియర్ సిటిజన్లకు కొత్త FD రేట్లు
సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ హోల్డర్లతో పోలిస్తే, సీనియర్ సిటిజన్‌లకు (60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాళ్లు) అర శాతం (0.50 శాతం లేదా 50 బేసిస్ పాయింట్లు) ఎక్కువ వడ్డీ దక్కుతుంది. ఈ ప్రకారం, సీనియర్ సిటిజన్లకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద 3.75 శాతం నుంచి 8.25 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: ITR-1 ఎవరు ఫైల్ చేయకూడదు, మీరు రాంగ్ ఫామ్ నింపుతున్నారేమో?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Spam Calls: బీమా కంపెనీలు 1600 నంబర్ నుంచే కాల్స్ చేయాలి! స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యల దిశగా TRAI
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Personal loan Interest Rates: దిగొచ్చిన పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు.. టాప్ 5 బ్యాంకులలో ఏది తక్కువ వడ్డీకి లోన్ ఇస్తుంది
PPF vs FD : సేవింగ్స్ చేయడానికి PPF మంచిదా? FD బెటరా? ఎక్కువకాలం పొదుపు చేస్తే ట్యాక్స్, వడ్డీ ఎలా ఉంటాయి?
పర్సనల్ లోన్ కొరకు అర్హత: బజాజ్ ఫైనాన్స్ తో త్వరిత నిధులకు సులభమైన మార్గదర్శకం
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?