అన్వేషించండి

Stocks Watch Today, 02 May 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - బ్యాంక్‌ నంబర్లు భళా!

మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.

Stock Market Today, 02 May 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 36 పాయింట్లు లేదా 0.20 శాతం రెడ్‌ కలర్‌లో 18,237 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: టాటా స్టీల్, అదానీ టోటల్ గ్యాస్, వరుణ్ బెవరేజెస్, అంబుజా సిమెంట్స్. వీటిపై మార్కెట్‌ దృష్టి ఉంటుంది.

ఆటో స్టాక్స్: ఏప్రిల్ నెల అమ్మకాల డేటాను వాహన కంపెనీలు నివేదించాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆటో స్టాక్స్ మీద ఆసక్తి చూపించవచ్చు.

అదానీ గ్రూప్ కంపెనీలు: హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై విచారణను పూర్తి చేయడానికి గడువు పొడిగించాలని కోరుతూ, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో, అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఫోకస్‌లో ఉంటాయి.

అల్ట్రాటెక్ సిమెంట్: 2023 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో అల్ట్రాటెక్ సిమెంట్ ఏకీకృత నికర లాభం 36% తగ్గి రూ. 1,666 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ఆదాయం 18% పెరిగి రూ. 18,562 కోట్లకు చేరుకుంది.

RBL బ్యాంక్: నాలుగో త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం 37% పెరిగి రూ. 271 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం (NII) సంవత్సరానికి (YoY) 7% పెరిగింది.

IDBI బ్యాంక్: ఏడాది ప్రాతిపదికన... ఐడీబీఐ బ్యాంక్ మార్చి త్రైమాసిక లాభం రూ. 1,133 కోట్లుగా నమోదు కాగా, నికర వడ్డీ ఆదాయం (NII) 35% పెరిగి రూ. 3,279 కోట్లకు చేరుకుంది.

IDFC ఫస్ట్ బ్యాంక్: ప్రైవేట్ రుణదాత IDFC ఫస్ట్ బ్యాంక్ స్వతంత్ర లాభం Q4లో 134% (YoY) పెరిగి రూ. 803 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ. 3,596.75 కోట్లకు చేరింది, 34.75% పెరిగింది.

కోటక్ మహీంద్ర బ్యాంక్: మార్చి త్రైమాసికంలో నికర లాభం 26.3% వృద్ధితో రూ. 3,495.6 కోట్లకు, నికర వడ్డీ ఆదాయం 35% పెరిగి రూ. 6,102.6 కోట్లకు చేరుకుంది.

SBI కార్డ్: మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికి SBI కార్డ్ రూ. 596 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది, గత ఏడాది ఇదే కాలంలోని రూ.581 కోట్లతో పోలిస్తే స్వల్పంగా 3% పెరిగింది. మార్చి త్రైమాసికంలో మొత్తం ఆదాయం ఏడాది ప్రాతిపదికన 30% పెరిగి రూ. 3,917 కోట్లకు చేరుకుంది.

మహీంద్ర ఫైనాన్స్: మార్చి త్రైమాసికంలో మహీంద్ర ఫైనాన్స్ స్వతంత్ర నికర లాభం ఏడాది ప్రాతిపదికన 14% పెరిగి రూ. 684 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం రూ. 1,723 కోట్లుగా ఉంది, ఏడాది ప్రాతిపదికన 13% ఎక్కువ.

ఇండియామార్ట్ ఇంటర్‌మెష్: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి రూ. 56 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నివేదించింది, క్రితం ఏడాది ఇదే కాలంలోని రూ. 57 కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయాలని బోర్డు సిఫార్సు చేసింది.

PSP ప్రాజెక్ట్స్: కేంద్ర ప్రభుత్వం నుంచి 441 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్‌లను PSP ప్రాజెక్ట్స్ దక్కించుకుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hydra: హైడ్రా కూల్చివేతలపై మైండ్ బ్లాంకయ్యే కబురు చెప్పిన రంగనాథ్ - ఇక బుల్డోజర్లకు పని లేనట్లే !
హైడ్రా కూల్చివేతలపై మైండ్ బ్లాంకయ్యే కబురు చెప్పిన రంగనాథ్ - ఇక బుల్డోజర్లకు పని లేనట్లే !
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
Manchu Manoj Mother Wrote A Letter: మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
Russia Moscow Blast: రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hydra: హైడ్రా కూల్చివేతలపై మైండ్ బ్లాంకయ్యే కబురు చెప్పిన రంగనాథ్ - ఇక బుల్డోజర్లకు పని లేనట్లే !
హైడ్రా కూల్చివేతలపై మైండ్ బ్లాంకయ్యే కబురు చెప్పిన రంగనాథ్ - ఇక బుల్డోజర్లకు పని లేనట్లే !
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
Manchu Manoj Mother Wrote A Letter: మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
Russia Moscow Blast: రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
Samyuktha Menon :  సమంత అనుకునేరు సంయుక్త.. పింక్ కలర్ పట్టుచీరలో అదిరిపోయింది కదా!
సమంత అనుకునేరు సంయుక్త.. పింక్ కలర్ పట్టుచీరలో అదిరిపోయింది కదా!
Rohit Sharma Retirement: టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్‌? డగౌట్ ముందు గ్లౌస్‌లతో సంకేతాలు!
టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్‌? డగౌట్ ముందు గ్లౌస్‌లతో సంకేతాలు!
Actor Darshan: ఆపరేషన్ అని బెయిల్‌పై బయటకు వచ్చాడు... బాబోయ్ దర్శన్ కేసులో ఈ ట్విస్టేంటి?
ఆపరేషన్ అని బెయిల్‌పై బయటకు వచ్చాడు... బాబోయ్ దర్శన్ కేసులో ఈ ట్విస్టేంటి?
Gautam Bigg Boss Telugu: మెగా ఫ్యామిలీ మనసులు గెలిచాడు... స్టేజిపై గౌతమ్ కృష్ణకు చరణ్ ఏం చెప్పాడంటే?
మెగా ఫ్యామిలీ మనసులు గెలిచాడు... స్టేజిపై గౌతమ్ కృష్ణకు చరణ్ ఏం చెప్పాడంటే?
Embed widget