Hydra: హైడ్రా కూల్చివేతలపై మైండ్ బ్లాంకయ్యే కబురు చెప్పిన రంగనాథ్ - ఇక బుల్డోజర్లకు పని లేనట్లే !
Hydra Commissioner Ranganath: జూలై తర్వాత చేస్తున్న అక్రమ నిర్మాణాలను మాత్రమే కూలుస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. రంగనాథ్ ప్రకటన చాలా కీలకమైనదిగా భావిస్తున్నారు.
Hydra Commissioner Ranganath announced that they will demolish the illegal constructions after July : హైడ్రా బుల్‌డోజర్లకు ఇక పెద్దగా పని ఉండే అవకాశం లేదు. ఈ అంశంపై రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రాను ఏర్పాటు చేసిన జూలై నుంచి ఎవరైనా ప్రభుత్వ భూములు, చెరువుల్లో అక్రమాలకు పాల్పడి ఉంటే వాటిని మాత్రమే కూల్చివేస్తామని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణఆల జోలికి వెళ్లబోమని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటిని కూల్చివేయక తప్పదని స్పష్టం చేశారు.
హైడ్రా ఏర్పాటు చేసిన జూలై నుంచి మాత్రమే కార్యాచరణ
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటన రియల్ ఎస్టేట్ వర్గాలను సంతోష పరుస్తోంది. ఎందుకంటే జూలై కంటే ముందు కట్టిన వాటికి కూడా వస్తున్నారు కాబట్టే గతంలో అందరూ హడలిపోయారు. రియల్ ఎస్టేట్ ఈ కారణంగానే పడిపోయిందని అనుకున్నారు. హైడ్రాకు చట్టబద్దత వచ్చిన తర్వాత అంతకు ముందు నిర్మించిన భవనాల విషయంలో గ్రేటర్ అధికారులు నిర్ణయం తీసుకుంటారని..కానీ హైడ్రా ఏర్పడినప్పడి నుండి మాత్రం ఎలాంటి ఆక్రమణలు , ఉల్లంఘనలు లేకుండా హైడ్రా చూసుకుంటుందని తేలిపోయింది. ప్రస్తుతం ఎక్కువగా హైడ్రా ఏర్పడక ముందు ఉన్న ప్రాజెక్టులే కావడంతో అన్నీ సేఫ్ జోన్ లోనే ఉన్నట్లుగా రంగనాథ్ సిగ్నల్స్ పంపినట్లయింది.
Also Read: గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గతంలో పాత ఆక్రమణలు కూడా కూల్చివేసిన హైడ్రా
మొదట హైడ్రాను ఏర్పాటు చేసినప్పుడు చెరువులను ఆక్రమించి కట్టిన ఫామ్ హౌస్‌లు , విల్లాలను కూల్చివేశారు. ఆ సమయంలో ప్రజల నుంచి మద్దతు లభించింది. అయితే తర్వాత ప్రభుత్వ భూమిని ఆక్రమించి అమీన్ పూర్ లో కట్టిన ఇళ్ల విషయంలో మాత్రం రివర్స్ అయింది. అవి మధ్యతరగతి ఇళ్లు కావడం.. అన్నింటికీ ప్రభుత్వ అనుమతులు ఉండటంతో కూల్చివేయడంపై వ్యతిరేకత వ్యక్తమయింది. అయితే ఓ సర్వే నెంబర్ చూపించి మరో సర్వే నెంబర్ లో ఇళ్లను నిర్మించారు. అయినా కూల్చివేతలు ఎక్కువగా ప్రజా వ్యతిరేకతకు కారణం అవుతున్నాయని గుర్తించారు.
Also Read: ఆపరేషన్ అని బెయిల్‌పై బయటకు వచ్చాడు... బాబోయ్ దర్శన్ కేసులో ఈ ట్విస్టేంటి?
చట్టబద్దత వచ్చినప్పటి నుండి మాత్రమే బాధ్యత
తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ .. చట్టబద్దత కోసం ఎదురు చూశారు. చట్టబ్దదత వచ్చిన తర్వాత.. గతంలో జరిగిన ఆక్రమణల విషయం గ్రేటర్ పరిధిలో ఉంటుదని .. జూలై నుంచి ఎవరైనా కొత్తగా అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టినా.. చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంటే.. ఇక ముందు కబ్జాలు కాకుండా చూడటానికే.. హైడ్రా అని రంగనాథ్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక హైడ్రా భయం వదిలేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.