Stocks to watch 22 November 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - Nykaaలో ఇవాళ మరో భారీ సెల్లింగ్
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 22 November 2022: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 43 పాయింట్లు లేదా 0.25 శాతం గ్రీన్ కలర్‌లో 18,248.5 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
కేన్స్ టెక్నాలజీస్ ఇండియా: ఇవాళ ఈ కంపెనీ షేర్లు మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయి. నవంబర్ 10-14 మధ్య జరిగిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా రూ.858 కోట్లను సేకరించింది. ఒక్కో షేరును రూ. 559-587 రేంజ్‌లో విక్రయించింది.
జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్: నేపాల్‌లో డొమినోస్ పిజ్జా వ్యాపారాన్ని నిర్వహించేందుకు అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడానికి కంపెనీ బోర్డు ఆమోదించింది. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ ఇంటర్నేషనల్ లక్సెంబర్గ్ ఆధ్వర్యంలో అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనున్నారు.
లుపిన్: రాజస్థాన్‌లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ అనుబంధ సంస్థ - రాజస్థాన్ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అల్వార్ జిల్లాలో కార్డియోవాస్కులర్ డిసీజ్ (CVD), క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) కేసుల నియంత్రణ కోసం ఈ ఒప్పందం జరిగింది.
డెలివెరి: 1,84,04,607 డెలివెరీ షేర్లు లేదా 2.5 శాతం వాటాను పెట్టుబడి సంస్థ కార్లైల్ గ్రూప్ యొక్క CA స్విఫ్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా ఆఫ్‌లోడ్ చేసింది. ఒక్కో షేరును సగటున రూ. 330.02 ధర చొప్పున మొత్తం రూ. 607.38 కోట్లకు విక్రయించింది. మోర్గాన్ స్టాన్లీ ఆసియా (సింగపూర్) అదే ధర వద్ద 48,54,607 షేర్లను కొనుగోలు చేసింది.
FSN ఈ-కామర్స్ వెంచర్స్ (Nykaa): పెట్టుబడి సంస్థ లైట్‌హౌస్ ఇండియా, రూ. 335 కోట్ల విలువైన నైకా షేర్లను బ్లాక్ డీల్ ద్వారా ఇవాళ విక్రయిస్తోంది. ఒక్కో షేరు ధర రూ. 180- 183.50 శ్రేణిలో అమ్ముతోంది.
JK పేపర్: హారిజాన్ ప్యాక్స్, సెక్యూరిపాక్స్ ప్యాకేజింగ్ కంపెనీలను సుమారు రూ. 578 కోట్లకు జేకే పేపర్ కొనుగోలు చేయనుంది. ఈ రెండు కంపెనీలకు దేశవ్యాప్తంగా ఏడు ప్లాంట్లు ఉన్నాయి.
ఫోర్స్ మోటార్స్: పుణె కేంద్రంగా పని చేస్తున్న ఈ ఆటోమోటివ్ కంపెనీ, రూ. 1,000 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేసిన నెక్ట్స్-జెనరేషన్ షేర్డ్ వెహికల్ 'అర్బేనియా' ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపింది. 2020లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఈ వెహికల్‌ను ప్రదర్శించింది.
న్యూఢిల్లీ టెలివిజన్ (NDTV): మీడియా సంస్థ NDTVలో అదనంగా 26 శాతం వాటాను మార్కెట్ నుంచి కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఒక్కో షేరుకు రూ. 294 ప్రైస్ బ్యాండ్‌తో ఉన్న ఈ ఆఫర్ డిసెంబర్ 5న ముగుస్తుంది.
సద్భవ్ ఇంజినీరింగ్: కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పదవికి వశిష్ట పటేల్ రాజీనామా చేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవికి నితిన్ పాటిల్ కూడా రాజీనామా చేశారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.