Stocks to watch 18 November 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - Nykaa, Paytmతో మరికొన్ని రోజులు జాగ్రత్త!
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 18 November 2022: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 65 పాయింట్లు లేదా 0.35 శాతం గ్రీన్ కలర్‌లో 18,440 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
అల్ట్రాటెక్ సిమెంట్: రాజస్థాన్‌లోని బిర్లా వైట్ వాల్ కేర్ పుట్టి మూడో ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమైంది. రూ. 187 కోట్ల ఖర్చుతో నిర్మించారు. సంవత్సరానికి 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం దీని సొంతం. ఈ మూడు ప్లాంట్లలో కలిపి కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 13 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది.
బజాజ్ ఆటో: బజాజ్ ఆటోలో 2 శాతం వాటాను లేదా 56.68 లక్షల షేర్లను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా విక్రయించింది. దీంతో, ఈ కంపెనీలో ఎల్‌ఐసీ వాటా 7.2 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గింది.
FSN ఈ-కామర్స్ (Nykaa): అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ TPG క్యాపిటల్, రూ. 1,000 కోట్ల విలువైన Nykaa షేర్లను బ్లాక్ డీల్ ద్వారా విక్రయించడానికి సిద్ధమైంది. ఒక్కో షేరును సగటున రూ. 184.55 ధర వద్ద విక్రయించే అవకాశం ఉంది.
భారత్ ఎలక్ట్రానిక్స్: డిఫెన్స్ PSU అయిన ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్‌తో (అవని) భారత్ ఎలక్ట్రానిక్స్ MoU కుదుర్చుకుంది. యుద్ధ వాహనాలు, ప్రధాన యుద్ధ ట్యాంకులు (MBTలు), పదాతిదళ యుద్ధ వాహనాలు (IFVలు), సాయుధ యుద్ధ వాహనాలు (AFVలు), సంబంధిత వ్యవస్థలకు సంబంధించి దేశీయంగా, ఎగుమతి అవకాశాలను కలిసి అందుకుంటారు.
One97 కమ్యూనికేషన్స్ (Paytm): సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన SVF ఇండియా హోల్డింగ్స్ (కేమాన్), బల్క్ డీల్స్ ద్వారా 2.93,50,000 పేటీఎం షేర్లను లేదా ఈ కంపెనీలో 4.5 శాతం వాటాను ఒక్కో షేరుకు సగటున రూ. 555.67 ధర చొప్పున అమ్మింది. మొత్తం డీల్ వాల్యూ రూ. 1,630.89 కోట్లు.
బ్లూ డార్ట్: టైర్ I, టైర్ II పట్టణాల్లో 19కు పైగా రిటైల్ అవుట్‌ట్లను ప్రారంభించి తన వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించింది. ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక సహా 14 రాష్ట్రాల్లో కొత్త స్టోర్లను తెరిచింది.
CSB బ్యాంక్: బ్యాంక్ తాత్కాలిక చైర్‌పర్సన్‌గా శ్రీమతి భామ కృష్ణమూర్తి నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. నవంబర్ 17 నుంచి నియామకం అమల్లోకి వచ్చింది. సెప్టెంబర్ 28, 2024 వరకు ఆ సీట్‌లో ఆమె ఉంటారు.
మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్: ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ 'మహీంద్రా సిటాడెల్' ఫేజ్-1 ప్రారంభమైంది. పుణెలోని పింప్రి చించ్వాడ్‌లో ఈ ప్రాజెక్ట్ ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.