Stocks to watch 15 November 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - Alembic Pharmaకు మంచి రోజులు
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stocks to watch today, 15 November 2022: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 60 పాయింట్లు లేదా 0.33 శాతం గ్రీన్ కలర్‌లో 18,437.5 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్ కంపెనీలు: రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, AVG లాజిస్టిక్స్, షాలోన్ సిల్క్ ఇండస్ట్రీస్, MRC ఆగ్రోటెక్, లీ & నీ సాఫ్ట్‌వేర్స్, మిల్టన్ ఇండస్ట్రీస్, డెస్టినీ లాజిస్టిక్స్
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
న్యూఢిల్లీ టెలివిజన్ (NDTV): మీడియా సంస్థ NDTVలో అదనంగా 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌కు సెబీ అనుమతి లభించింది. ఈ ఆఫర్ ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది. ఓపెన్ ఆఫర్ విలువ రూ. 492.81 కోట్లు.
అలెంబిక్ ఫార్మాస్యూటికల్: వివిధ రకాల క్యాన్సర్ చికిత్సల్లో ఉపయోగించే సైక్లోఫాస్ఫమైడ్ క్యాప్సూల్స్‌ను అమెరికాలో మార్కెట్ చేయడానికి USFDA అనుమతి పొందింది. హిక్మా ఫార్మాస్యూటికల్స్ జెనరిక్ వెర్షన్‌గా సైక్లోఫాస్ఫమైడ్ క్యాప్సూల్స్‌ను తీసుకొచ్చింది.
PB ఫిన్‌టెక్ (Policybazaar): 1,34,17,607 పాలసీబజార్ షేర్లు లేదా 2.98 శాతం స్టేక్‌ను రూ. 389.38 - రూ. 389.44 రేంజ్‌లో టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ ఆఫ్‌లోడ్ చేసింది. రూ. 522.50 కోట్లకు ఓపెన్ మార్కెట్ లావాదేవీ జరిగింది.
NMDC: 2022 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో, ప్రభుత్వ యాజమాన్యంలో పని చేసే ఈ మెటల్ ప్లేయర్ ఏకీకృత నికర లాభం 62 శాతం పడిపోయి రూ. 885.65 కోట్లకు చేరుకుంది. ఆదాయం బాగా తగ్గడం ప్రధాన కారణం. గత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ కాలంలో రూ. 2,339.58 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
బయోకాన్: సెప్టెంబర్ త్రైమాసికంలో ఖర్చుల్లో పెరుగుదల కారణంగా ఈ బయో టెక్నాలజీ కంపెనీ ఏకీకృత నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 168 కోట్లకు చేరుకుంది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 188 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్: నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చిందీ రియాల్టీ కంపెనీ. సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ. 52 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 14 కోట్ల నికర నష్టాన్ని మూటగట్టుకుంది.
స్పైస్ జెట్: సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో, రికార్డు స్థాయి ఇంధన ధరలు - రూపాయి విలువ క్షీణించడంతో ఈ బడ్జెట్ క్యారియర్ నికర నష్టం రూ. 837.8 కోట్లకు పెరిగింది.
అపోలో టైర్స్: దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల జోరు కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 11 శాతం పెరిగి రూ. 194 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ కాలంలో రూ. 174 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.