AMS: కొనేవాళ్లు తప్ప అమ్మేవాళ్లు లేని స్టాక్ ఇది, నెలలో 63% జంప్
కంపెనీ స్టాక్ వరుసగా ఏడో రోజు కూడా 5 శాతం అప్పర్ సర్క్యూట్‌లోకి వెళ్లిపోయింది.
Apollo Micro Systems Share Price: అపోలో మైక్రో సిస్టమ్స్ (AMS) షేర్లు ఇవాళ (మంగళవారం, 27 జూన్ 2023) కూడా 5 శాతం అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి, రూ. 55.25 వద్ద కొత్త 52-వీక్ హైని టచ్ చేశాయి. ఈ కౌంటర్‌లో కొనేవాళ్లు తప్ప, అమ్మేవాళ్లే కనిపించడం లేదు.
AMS షేర్ల కోసం NSE, BSEలో 8.9 లక్షల షేర్ల బయ్ ఆర్డర్లు (buy orders) పెండింగ్‌లో ఉన్నాయి, 3.5 లక్షల షేర్లు చేతులు మారాయి.
ఏరోస్పేస్ & డిఫెన్స్ కంపెనీ స్టాక్ వరుసగా ఏడో రోజు కూడా 5 శాతం అప్పర్ సర్క్యూట్‌లోకి వెళ్లిపోయింది. ఈ ఏడు రోజుల్లోనే 41 శాతం పెరిగింది.
జూన్ నెలలో ఇప్పటివరకు, S&P BSE సెన్సెక్స్ 1 శాతం కూడా పెరగలేదు. అదే సమయంలో ఈ కౌంటర్ 63 శాతం జూమ్ అయింది. గత ఒక సంవత్సరంలో, బెంచ్‌మార్క్ ఇండెక్స్ 19 శాతం రిటర్న్ ఇస్తే, ఈ స్టాక్ 355 శాతం లాభాలను తీసుకొచ్చి ఇచ్చింది.
కంపెనీ వ్యాపారం
ఇది డిఫెన్స్ సెక్టార్‌కు చెందిన స్టాక్. రక్షణ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలకు (PSUలు) ఇటీవల రిలీజ్ చేసిన ఆర్డర్‌ల ద్వారా ఆర్డర్ బుక్‌లో హెల్తీ గ్రోత్‌ను ఈ కంపెనీ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY24) రక్షణ రంగానికి భారత ప్రభుత్వం చేసిన బలమైన కేటాయింపుల కారణంగా, ఆర్డర్లు పెరుగుతాయని, ఆదాయం 45-50 శాతం వరకు జంప్ చేస్తుందని ఈ కంపెనీ అంచనా వేసింది. కార్యకలాపాలు పెరిగి, ఎబిటా మార్జిన్ 22-23 శాతం నమోదు కావచ్చని లెక్కగట్టింది.
ఈ ఏడాది మే 4న, ఈ స్టాక్ 1:10 నిష్పత్తిలో ఈ స్టాక్ స్ప్లిట్ అయింది. అంటే, రూ. 10 ఫేస్ వాల్యూతో ఉన్న ఒక్కో షేర్‌ను ఒక రూపాయి ఫేస్ వాల్యు చొప్పున 10 ఈక్విటీ షేర్‌లుగా విభజించింది. లిక్విడిటీ పెంచడం, షేర్‌హోల్డర్ బేస్‌ను విస్తరించడం, రిటైల్ ఇన్వెస్టర్లకు మరింత దగ్గర కావడం వంటివి స్టాక్ స్ల్పిట్ వెనుకున్న కారణాలు.
ఎలక్ట్రానిక్ తయారీ, హార్డ్‌వేర్ డిజైనింగ్, వెపన్ ఇంటిగ్రేషన్, ప్లాట్‌ఫామ్ ఇంటిగ్రేషన్ సెగ్మెంట్స్‌లో బిజినెస్ చేస్తున్న AMS, భారత రక్షణ రంగంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా మారింది. అపోలో మైక్రో సిస్టమ్స్ తయారు చేసే ఉత్పత్తులను ఏరోస్పేస్ సిస్టమ్స్, గ్రౌండ్ డిఫెన్స్, స్పేస్, ఏవియానిక్స్ సిస్టమ్స్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, ట్రాన్స్‌పోర్టేషన్ సహా చాలా పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు.
సుప్రసిద్ధ ఖాతాదార్లు
ఈ కంపెనీకి అటు పబ్లిక్ సెక్టార్‌లోను, ఇటు ప్రైవేట్ సెక్టార్‌లోను పేరుమోసిన క్లయింట్స్ ఉన్నారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (DPSU), అదానీ, L&T వంటివి క్లయింట్స్ లిస్ట్‌లో ఉన్న కొన్ని పేర్లు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో (FY23). సంవత్సరానికి (YoY) 22.34 శాతం వృద్ధితో రూ. 298 కోట్ల ఆదాయాన్ని అపోలో మైక్రో సిస్టమ్స్ సాధించింది. మెటీరియల్ ప్రైస్ తగ్గడం, వ్యయ నిర్వహణలో సమర్థవంతంగా వ్యవహరించడం వల్ల ఎబిటా మార్జిన్స్ కూడా FY21లోని 18.77 శాతం నుంచి FY22లో 21.63 శాతానికి పెరిగాయి.
మరో ఆసక్తికర కథనం: మార్కెట్ ఎలా ఉన్నా డబ్బులు సంపాదించే మార్గం ఒకటుంది!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial