Stock Market Update: బుల్.. సై! సెన్సెక్స్ 776+, నిఫ్టీ 234+, ఏ షేర్లు లాభపడ్డాయంటే?
భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు గరిష్ఠాలను తాకాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ గురువారం 57,781 వద్ద భారీ గ్యాప్‌అప్‌తో మొదలైంది.చివరికి 776 పాయింట్లు లాభపడి 58,461 వద్ద ముగిసింది.
భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు గరిష్ఠాలను తాకాయి. సూచీలు పైపైకి దూసుకుపోయాయి. ఒమిక్రాన్ భయం తగ్గడం, అంతర్జాతీయంగా సానుకూల సెంటిమెంట్ ఉండటం, జీఎస్‌టీ వసూళ్లూ ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఇందుకు దోహదం చేశాయి.
క్రితం రోజు 57,684 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ గురువారం 57,781 వద్ద భారీ గ్యాప్‌అప్‌తో మొదలైంది. మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ ఉండటంతో ఇంట్రాడేలో 58,513 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత ఇంకా ఎక్కువ ర్యాలీ జరిగి చివరికి 776 పాయింట్లు లాభపడి 58,461 వద్ద ముగిసింది.
ముందు రోజు 17,166 వద్ద ముగిసిన నిఫ్టీ నేడు 17,183 వద్ద మొదలైంది. కొంతసేపటికే 17,149 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి తాకింది. కొనుగోళ్లు పెరగడంతో 17,420 వద్ద గరిష్ఠాన్ని అందుకొంది. చివరికి 234 పాయింట్ల లాభంతో 17,401 వద్ద ముగిసింది.
నిఫ్టీలో అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్ కార్ప్, టాటా స్టీల్, సన్‌ఫార్మా లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్ నష్టాల్లో ముగిశాయి. వివిధ రంగాల సూచీలన్నీ లాభాల్లోనే కొనసాగాయి. ఐటీ, మెటల్, రియాలిటీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్, గ్యాస్, పవర్ సూచీలు 1 నుంచి 2 శాతం వరకు ఎగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1 శాతం పెరిగాయి.
BSE commodity price update 1st December, 2021#commodity #exchange #cotton#BRCrude #Gold #Turmeric #Almond #trade #futuretrading #commoditytrading pic.twitter.com/YdGzCu0rrU
— BSE India (@BSEIndia) December 2, 2021
Also Read: December Financial Changes: డిసెంబర్లో డబ్బు పరంగా జరిగే మార్పులివే..! లేదంటే..!
Also Read: GST Collections: చరిత్రలో రెండోసారి అత్యధికంగా జీఎస్‌టీ రాబడి.. ఎంత వచ్చాయంటే..!
Also Read: GST on Salary: ఉద్యోగి వేతనంపై జీఎస్‌టీ..! నోటీస్ పిరియడ్ సర్వ్ చేయకుంటే పన్ను పడతాది!
Also Read: SBI ATM Withdrawal Rule: ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేస్తుంటే సమస్యా? ఈ కొత్త రూల్ తెలుసా?
Also Read: Banks Money : ఆ రూ. 26వేల కోట్లు ఎవరివో ? బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసి మర్చిపోయిన జనం..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Shri @Bhupendrapbjp, Hon'ble Chief Minister of Gujarat and Shri @ashishchauhan, MD&CEO, BSE along with Senior Officials from Gujarat Government ringing the #BSEBell on 2nd Dec, 2021 at @BSEIndia @CMOGuj pic.twitter.com/ENotNnDbQL
— BSE India (@BSEIndia) December 2, 2021