Share Market Opening Today: ప్రశాంతంగా ప్రారంభమైన మార్కెట్లు - 22,300 దగ్గర నిఫ్టీ
BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ & స్మాల్ క్యాప్ ఇండెక్స్ తలా ఒక శాతం బలపడ్డాయి.
Stock Market News Today in Telugu: గత వారంలో తీవ్రమైన ఒడుదొడుకుల తర్వాత, భారతీయ స్టాక్ మార్కెట్ ఈ వారంలో తొలిరోజున పచ్చగా ప్రారంభమైంది. ఈ రోజు (సోమవారం, 22 ఏప్రిల్ 2024) ఓపెనింగ్ టైమ్‌లో, HDFC బ్యాంక్ నుంచి బ్యాంక్ నిఫ్టీకి మద్దతు లభించింది. అయితే నిమిషాల వ్యవధిలోనే ఈ స్టాక్ రెడ్ జోన్‌లోకి జారుకుంది.
ఈ రోజు మన మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (శుక్రవారం) 73,088 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 578.18 పాయింట్లు లేదా 0.79 శాతం పెరుగుదలతో 73,666.51 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. శుక్రవారం 22,147 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 189.90 పాయింట్లు లేదా 0.86 శాతం పెరుగుదలతో 22,125.30 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
విస్తృత మార్కెట్లలో... BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ & స్మాల్ క్యాప్ ఇండెక్స్ తలా ఒక శాతం బలపడ్డాయి.
సెక్టార్ల వారీగా చూస్తే... నిఫ్టీ PSU బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఫార్మా సూచీలు 1% పైగా లాభంలో ఉన్నాయి. నిఫ్టీ హెల్త్‌కేర్, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా లాభాల వరుసలో నిలిచాయి.
ఈ రోజు బిజినెస్ ప్రారంభమైనప్పుడు సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో కేవలం 3 షేర్లు మాత్రమే డౌన్‌ట్రెండ్‌లో ఉన్నాయి, మిగిలిన 27 షేర్లు అప్‌ట్రెండ్‌లో ఉన్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో... యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ బ్యాంక్, ICICI బ్యాంక్, విప్రో, L&T చోటు సంపాదించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ నష్టపోయిన లిస్ట్‌లో కనిపించాయి.
నిఫ్టీ50 విషయానికి వస్తే... బీపీసీఎల్, కోల్ ఇండియా టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. మహీంద్ర అండ్ మహీంద్ర టాప్ లూజర్స్‌లో ఉంది.
ఓపెనింగ్ టైమ్‌లో, BSEలో మొత్తం 3,132 షేర్లు ట్రేడ్ అవుతుండగా.. వాటిలో 2,424 షేర్లు లాభాల్లో ఉన్నాయి. 588 షేర్లు క్షీణించాయి. 120 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. 136 స్టాక్స్ 52 వారాల గరిష్ఠ స్థాయిలో, 7 స్టాక్స్ 52 వారాల కనిష్ఠ స్థాయిలోనూ ట్రేడవుతున్నాయి. 171 షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో, 55 షేర్లు లోయర్ సర్క్యూట్‌లో ఆగిపోయాయి. NSEలో 1,817 షేర్లు పచ్చగా, 166 షేర్లు ఎరుపు రంగులో ట్రేడ్ చేశాయి.
BSE మార్కెట్ క్యాపిటలైజేషన్
గత వారం రోలర్ కోస్టర్ రైడ్ తర్వాత, బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ (BSE Market Capitalization) ఈ రోజు తిరిగి పుంజుకుంది, రూ.396.73 లక్షల కోట్లకు చేరింది. కొన్ని రోజుల క్రితం ఇది ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.402 లక్షల కోట్లకు చేరింది.
ఈ రోజు ఉదయం 10.15 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 276.58 పాయింట్లు లేదా 0.38% పెరిగి 73,364.91 దగ్గర; NSE నిఫ్టీ 101.10 పాయింట్లు లేదా 0.46% పెరిగి 22,248.10 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో.. ఈ ఉదయం జపాన్‌కు చెందిన నికాయ్ 0.49 శాతంతో గ్రీన్‌లో ట్రేడవుతుండగా, బ్రాడ్-బేస్డ్ టోపిక్స్ 1.23 శాతం పెరిగింది. దక్షిణ కొరియాలోని కోస్పి 0.59 శాతం ఎగబాకింది. ఆస్ట్రేలియాకు చెందిన S&P/ASX 200 1.18 శాతం పెరిగింది. హాంకాంగ్‌లోని హ్యాంగ్ సెంగ్ కూడా 2.29 శాతం పైకి చేరింది.
శుక్రవారం అమెరికన్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. S&P 500 0.88 శాతం తగ్గితే, నాస్‌డాక్ కాంపోజిట్ 2.05 శాతం పడిపోయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.56 శాతం పెరిగింది.
అమెరికన్ బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.654 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $86 వద్ద ట్రేడ్ అవుతోంది. గోల్డ్ ఒక్కసారిగా దూసుకెళ్లింది, ఔన్సుకు $2,390 దగ్గర ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఆపిల్ సంస్థ బంపరాఫర్ - భారత్‌లో వచ్చే మూడేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు!