అన్వేషించండి

Share Market Today:స్టాక్‌ మార్కెట్లలో ప్రాఫిట్‌ బుకింగ్ ఒత్తిడి - రికార్డ్ రేంజ్‌ నుంచి జారిపోయిన సూచీలు

Share Market Open Today: నూతన రికార్డ్‌ స్థాయికి చేరుకున్న స్టాక్ మార్కెట్లలో, ఒక్కరోజు వ్యవధిలోనే ప్రాఫిట్‌ బుకింగ్‌ ఒత్తిడి కనిపిస్తోంది.

Stock Market News Updates Today in Telugu: దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు (శుక్రవారం, 13 సెప్టెంబర్‌ 2024) ట్రేడింగ్‌లో హుషారు కనిపించడం లేదు. నిన్న సరికొత్త చారిత్రక గరిష్ఠ రికార్డు సృష్టించిన మార్కెట్లు, ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బీఎస్‌ఇ సెన్సెక్స్ 83,000 మార్క్‌ పైన ఓపెన్‌ అయినప్పటికీ, ప్రస్తుతం ఆ రేంజ్‌ కంటే తక్కువలో ట్రేడవుతోంది.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..

గత సెషన్‌లో (గురువారం) 82,963 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 129 పాయింట్ల పెరుగుదలతో 83,091.55 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గురువారం 25,389 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 41 పాయింట్ల వృద్ధితో 25,430.45 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

ప్రారంభ ట్రేడింగ్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లోని దాదాపు 20 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, JSW స్టీల్ షేర్లు తలో 1 శాతం పైగా పెరిగాయి. ఏషియన్ పెయింట్స్ 1.65 శాతం పతనమైంది. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, ఇన్ఫోసిస్ వంటి షేర్లు కూడా ప్రారంభ ట్రేడింగ్‌లో ప్రతికూల జోన్‌లో పడిపోయాయి.

ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ దాదాపు 120 పాయింట్లు నష్టపోయి 82,850 పాయింట్ల దిగువకు చేరింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ దాదాపు 40 పాయింట్ల నష్టంతో 25,350 పాయింట్లకు చేరువలో ఉంది.

ఈ రోజు ఉదయం 10.00 గంటలకు, BSE సెన్సెక్స్ 167.43 పాయింట్లు లేదా 0.20% తగ్గి 82,795.28 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి NSE నిఫ్టీ కూడా 55.85 పాయింట్లు లేదా 0.22% పడిపోయి 25,333.05 దగ్గర ట్రేడవుతోంది.

ప్రి-ఓపెనింగ్ సెషన్‌
దేశీయ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభం కాకముందే.. ఫ్లాట్‌ ట్రేడింగ్‌ సూచనలు కనిపించాయి. మార్కెట్‌ ప్రి-ఓపెన్ సెషన్‌లో సెన్సెక్స్ దాదాపు 130 పాయింట్ల లాభంతో 83,100 పాయింట్ల దగ్గర ట్రేడవుతుండగా, నిఫ్టీ దాదాపు 42 పాయింట్ల లాభంతో 25,430 పాయింట్ల వద్ద ఉంది. ఉదయం మార్కెట్ ప్రారంభానికి ముందు, గిఫ్ట్‌ సిటీలో నిఫ్టీ ఫ్యూచర్స్ సుమారు 56 పాయింట్ల ప్రీమియంతో 25,390 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. అయితే, ట్రేడ్‌ ప్రారంభమైన వెంటనే మన మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త రికార్డ్‌
గురువారం విపరీతమైన వృద్ధి కనిపించింది, దేశీయ మార్కెట్లు కొత్త శిఖరాలను (Stock markets at record levels) అధిరోహించాయి. నిన్నటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1,439.55 పాయింట్ల (1.77 శాతం) భారీ పెరుగుదలతో 82,962.71 పాయింట్ల వద్ద ముగిసింది. ఆ రోజు ఇంట్రాడేలో సరికొత్త ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి ‍(Sensex at fresh all-time high) 83,116.19 పాయింట్లను తాకింది. NSE నిఫ్టీ ఇండెక్స్‌ కూడా అద్భుతంగా రాణించింది, 470.45 పాయింట్ల (1.89 శాతం) భారీ పెరుగుదలతో 25,388.90 పాయింట్ల వద్ద ముగిసింది. ఆ రోజు ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో, నిఫ్టీ సరికొత్త ఆల్ టైమ్ హై లెవెల్ (Nifty at fresh all-time high) 25,433.35 పాయింట్లను తాకింది.

గ్లోబల్‌ మార్కెట్లు
నిన్న, అమెరికన్‌ మార్కెట్లు బుల్లిష్‌గా క్లోజ్‌ అయ్యాయి. వాల్ స్ట్రీట్‌లోని డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.58 శాతం లాభపడింది. S&P 500 ఇండెక్స్ 0.75 శాతం పెరిగింది. టెక్-ఫోకస్డ్ ఇండెక్స్ నాస్డాక్ 1 శాతం ర్యాలీ చేసింది. ఈ రోజు, ఆసియా మార్కెట్‌లో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. జపాన్‌కు చెందిన నికాయ్‌ 0.43 శాతం క్షీణించగా, టోపిక్స్ ఇండెక్స్ 0.58 శాతం పడిపోయింది. దక్షిణ కొరియాలో కోస్పి, కోస్డాక్ ఫ్లాట్‌గా ఉన్నాయి. హాంగ్‌ కాంగ్‌లోని హ్యాంగ్‌ సెంగ్ సూచీ ఈ రోజు బుల్లిష్‌గా ప్రారంభమైంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: పెరుగుతూనే ఉన్న ఇంధనం రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Embed widget