అన్వేషించండి

Muhurat Trading 2023: ఈ ఆదివారం స్టాక్‌ మార్కెట్‌లో స్పెషల్‌ ట్రేడింగ్‌, కేవలం గంట పాటు అనుమతి

సాయంత్రం 6:15 నుంచి 7:15 వరకు మార్కెట్‌లో ముహూరత్‌ ట్రేడింగ్‌ ఉంటుంది.

Muhurat Trading session 2023: నవంబర్‌ నెలలో మొత్తం 10 రోజుల పాటు స్టాక్‌ మార్కెట్లకు హాలిడేస్‌ వచ్చాయి, వీటిలో శని, ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి. BSE, NSE షెడ్యూల్ ప్రకారం, స్టాక్‌ మార్కెట్లకు ఈ నెల 14న (మంగళవారం) దీపావళి సెలవును ప్రకటించారు. అయితే, లక్ష్మీపూజ సందర్భంగా ఈ నెల 12న (ఆదివారం) ఒక గంట పాటు ముహూరత్‌ ట్రేడింగ్ ‍‌(Muhurat Trading) జరుగుతుంది.

నవంబర్‌ నెలలో స్టాక్ మార్కెట్ సెలవు రోజులు
దీపావళి సందర్భంగా నవంబర్ 14న (మంగళవారం) స్టాక్ మార్కెట్‌ పని చేయదు
గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 27న (సోమవారం) ట్రేడింగ్‌ జరగదు
నవంబర్ 11న శనివారం, 12న ఆదివారం (గంట పాటు ముహూరత్‌ ట్రేడింగ్‌ ఉంటుంది) సెలవు
నవంబర్ 18 శనివారం, నవంబర్ 19 ఆదివారం సాధారణ సెలవులు
నవంబర్ 25 శనివారం, నవంబర్ 26 ఆదివారం సాధారణ సెలవులు

ముహూరత్‌ ట్రేడింగ్ టైమింగ్స్‌
ప్రతి సంవత్సరం దీపావళి నాడు ముహూరత్‌ ట్రేడింగ్ జరుగుతుంది. దీపావళి రోజున స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడం శుభప్రదంగా భావిస్తారు. అయితే, సాధారణ రోజుల్లోలాగా ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కాకుండా,  సాయంత్రం పూట కేవలం ఒక గంట పాటు లావాదేవీలకు అనుమతిస్తారు. ఈ ఏడాది, నవంబర్ 12న దీపావళి ‍(లక్ష్మీపూజ) సందర్భంగా, సాయంత్రం 6:15 నుంచి 7:15 వరకు మార్కెట్‌లో ముహూరత్‌ ట్రేడింగ్‌ ఉంటుంది. ఈ టైమ్‌లో షేర్లను కొనొచ్చు, అమ్మొచ్చు. F&Oలోనూ కూడా ట్రేడ్‌ చేయొచ్చు. ట్రేడ్‌ మాడిఫికేషన్స్‌ కోసం 7:25 PM వరకు అనుమతిస్తారు. చివరగా, క్లోజింగ్‌ సెషన్ రాత్రి 7:25 నుంచి 7:35 వరకు జరుగుతుంది.

సాయంత్రం 6:00-6:08 మధ్య ప్రి-ఓపెన్ సెషన్ కోసం 8 నిమిషాల విండో కేటాయించారు. బ్లాక్ డీల్ సెషన్‌ 5:45 PMకి ఓపెన్‌ అవుతుంది, 6 PM వరకు ఉంటుంది.

ముహూరత్‌ ట్రేడింగ్ అంటే ఏంటి?
ముహూరత్‌ ట్రేడింగ్ (ప్రత్యేక ముహూర్తపు ట్రేడింగ్‌) అనేది దీపావళి సందర్భంగా నిర్వహించే స్పెషల్‌ సెషన్. పండుగ రోజు మొత్తం స్టాక్ మార్కెట్‌ను మూసేసినా, ముహూరత్‌ ట్రేడింగ్ కోసం ఒక గంట పాటు ఓపెన్‌లో ఉంటుంది. లక్ష్మీపూజ చేసే టైమ్‌లో ముహూరత్‌ ట్రేడింగ్‌ జరుగుతుంది కాబట్టి, ఈ గంట సమయంలో షేర్లు కొంటే సంపద పెరుగుతుందని, నూతన సంవత్‌లో అవి అదృష్టాన్ని తెస్తాయని చాలామంది పెట్టుబడిదార్లు విశ్వసిస్తారు.

2018 నుంచి, ముహూరత్‌ ట్రేడింగ్ సెషన్‌ గ్రీన్‌లో ముగుస్తోంది. 2022లో సెషన్‌లో సెన్సెక్స్ 0.88 శాతం లాభపడింది. 2021లో గ్రీన్‌లో 0.49 శాతం ప్రాఫిట్‌తో ముగిసింది. 2020, 2019లో, BSE యొక్క బెంచ్‌మార్క్ ఇండెక్స్ వరుసగా 0.45 శాతం, 0.49 శాతం లాభపడింది.

ముహూర్తం ట్రేడింగ్ ఎప్పుడు ప్రారంభించారు?
కొన్ని రిపోర్ట్స్‌ ప్రకారం, దీనిని, ప్రాచీన భారతదేశంలో రాజు విక్రమాదిత్య ప్రారంభించాడు. 1957లో BSE దీన్ని మొదటిసారిగా అవలంబించింది, ఈ పద్ధతికి అధికారిక గుర్తింపును ఇచ్చింది. NSE, 1992 నుంచి ముహూరత్‌ ట్రేడింగ్‌ స్టార్ట్‌ చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా, కోట్ల మంది ఇన్వెస్టర్లు/ట్రేడర్లు ఈ స్పెషల్‌ ట్రేడింగ్ సెషన్‌లో పాల్గొంటున్నారు. 

ఈ నెల 14న దీపావళి, 27న గురునానక్ జయంతి తర్వాత, వచ్చే నెల 25న (డిసెంబర్‌ 25) క్రిస్మస్‌ సందర్భంగా స్టాక్‌ మార్కెట్లకు సెలవు ప్రకటించారు.

మరో ఆసక్తికర కథనం: షాకింగ్‌ న్యూస్‌, అదానీ విల్మార్‌ షేర్లన్నీ అమ్మేసేందుకు గౌతమ్‌ అదానీ ప్రయత్నం!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget