అన్వేషించండి

Adani Wilmar: షాకింగ్‌ న్యూస్‌, అదానీ విల్మార్‌ షేర్లన్నీ అమ్మేసేందుకు గౌతమ్‌ అదానీ ప్రయత్నం!

మరో నెల రోజుల్లో డీల్‌ కుదిరే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Adani to exit From Wilmar: ఫార్చ్యూన్ బ్రాండ్‌తో వంట నూనెలు, కిరాణా సామగ్రి అమ్ముతున్న అదానీ విల్మార్ లిమిటెడ్‌ నుంచి బయటకు వచ్చేందుకు, అదానీ గ్రూప్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అదానీ విల్మార్‌ ఒక జాయింట్‌ వెంచర్‌ (JV). దీనిలో, గౌతమ్‌ అదానీకి, 43.97 శాతం వాటా ఉంది. సింగపూర్‌కు చెందిన విల్మార్‌ ఇంటర్నేషనల్‌కు కూడా ఇంతే మొత్తం (43.97) స్టేక్‌ ఉంది. మిగిలిన 12.06 శాతం షేర్లు పబ్లిక్‌ చేతుల్లో ఉన్నాయి. 

డీల్‌ ఓకే అయ్యే ఛాన్స్‌
అదానీ విల్మార్‌లో తనకు ఉన్న మొత్తం 43.97% వాటాను విక్రయించడానికి అదానీ గ్రూప్ గత ఆగస్టు నుంచి ట్రై చేస్తున్నట్లు, కొన్ని మల్టీనేషనల్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో డీల్‌ కుదిరే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 

ఈ జాయింట్ వెంచర్‌లో వాటా అమ్మకం ద్వారా 2.5-3 బిలియన్‌ డాలర్లను అదానీ గ్రూప్‌ ఆశిస్తోంది. నాన్‌-కోర్‌ అసెట్స్‌ను అమ్మేసి, భారీ మొత్తంలో డబ్బు నిల్వలు సృష్టించాలన్నది గౌతమ్‌ అదానీ ప్లాన్‌గా తెలుస్తోంది.

"అదానీ గ్రూప్ కొన్ని వ్యాపారాల నుంచి ఎగ్జిట్‌ అవుతుంది, ఇన్‌ఫ్రా వంటి వంటి కోర్ ఫోకస్డ్‌ ఏరియాల్లో మరిన్ని పెట్టుబడులు పెడుతుంది" కంపెనీకి చెందిన వ్యక్తులు చెప్పినట్లు ది ఎకనమిక్‌ టైమ్స్‌ రిపోర్ట్‌ చేసింది. అదానీ విల్మార్‌లో వాటా విక్రయం ద్వారా వచ్చే డబ్బును గ్రూప్‌లోని ఇతర కీలక వ్యాపారాల్లో పెట్టుబడులకు గౌతమ్‌ అదానీ ఉపయోగిస్తారని, అప్పులు చెల్లించడానికి ఆ డబ్బును వాడరని కూడా నివేదించింది.

ఎడిబుల్ ఆయిల్ (వంట నూనె) సెగ్మెంట్‌లో, దేశంలో ఉన్న అతి పెద్ద ప్లేయర్స్‌లో అదానీ విల్మార్ ఒకటి. గత ఆర్థిక సంవత్సరంలో (FY23) ఈ కంపెనీ 55,262 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ఖర్చులన్నీ పోగా, 607 కోట్ల రూపాయల లాభం మిగుల్చుకుంది. 

అదానీ విల్మార్‌ షేర్‌ ప్రైస్‌
అదానీ విల్మార్ షేరు ధర, ఈ ఏడాది మే మధ్యలోని రూ. 488 నుంచి గత శుక్రవారం రూ. 317.45కి తగ్గింది. ఈ రోజు (సోమవారం, 06 నవంబర్‌ 2023) ఉదయం 10.15 గంటల సమయానికి, 0.50 రూపాయలు లేదా 0.16% గ్రీన్‌లో రూ. 317.95 వద్ద ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 41,258 కోట్లు (4.96 బిలియన్ డాలర్లు).

ఈ సంవత్సరం ప్రారంభంలో, అదానీ గ్రూప్‌పై, అమెరికన్‌ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ ఇచ్చిన బ్లాస్టింగ్‌ రిపోర్టుతో అదానీ గ్రూప్‌ షేర్లు కుప్పకూలాయి. ఆ సమయంలో ఏకంగా 150 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిదార్ల సంపద ఆవిరైంది. ఆ తర్వాత గ్రూప్ కంపెనీల షేర్ల చాలా వరకు కోలుకున్నాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఈ వారానికి శుభారంభం, 470 పాయింట్ల జంప్‌తో 64,800 దాటిన సెన్సెక్స్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget