Stock Market Crash: మార్కెట్లో రష్యా-ఉక్రెయిన్‌ టెన్షన్‌: సెన్సెక్స్‌ 500, నిఫ్టీ 150 డౌన్‌

ఈ వారంలో వరుసగా రెండో సెషన్లోనూ సూచీలు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒకవైపు అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు, మరోవైపు రష్యా, ఉక్రెయిన్‌ ఆందోళనలు మదుపర్లను టెన్షన్‌ పెడుతున్నాయి.

FOLLOW US: 

Stock Market Update: భారత స్టాక్‌ మార్కెట్లు ఒడుదొడులకు లోనవుతున్నాయి! ఈ వారంలో వరుసగా రెండో సెషన్లోనూ తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒకవైపు అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు, మరోవైపు రష్యా, ఉక్రెయిన్‌ ఆందోళనలు మదుపర్లను టెన్షన్‌ పెడుతున్నాయి. ఇన్వెస్టర్లలో నెగెటివ్‌ సెంటిమెంట్‌ వ్యాపించడంతో విక్రయాల బాట పడుతున్నారు. విచిత్రంగా ఫండమెటల్స్‌ బలంగా ఉన్న కంపెనీల షేర్లనూ అమ్మేస్తున్నారు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 500, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 150 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

క్రితం రోజు 57,621 వద్ద ముగిసిన సెన్సెక్స్‌ నేడు 57,799 వద్ద లాభాల్లోనే మొదలైంది. జోరుమీదున్న సూచీ వెంటనే 57,925 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అరగంట కాగానే అమ్మకాల సెగ మొదలైంది. దాంతో సూచీ 57,058 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకుంది. ప్రస్తుతం కొస్త కోలుకొని 444 పాయింట్ల నష్టంతో 57,177 వద్ద కొనసాగుతోంది.

Also Read: ఐపీవో క్రేజ్‌ - పెట్టుబడి పెట్టే ముందు ఇవి గుర్తుపెట్టుకుంటే నష్టాలు రావు!

సోమవారం 17,213 వద్ద మొదలైన నిఫ్టీ మంగళవారం 17,279 వద్ద మొదలైంది. 17,306 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది. అమ్మకాల ఒత్తిడితో 17,043 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం కోలుకొని 108 పాయింట్ల నష్టంతో 17,105 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

నిఫ్టీ బ్యాంకు సైతం ఒడుదొడుల్లోనే ఉంది. ఉదయం 38,176 వద్ద మొదలైన సూచీ వెంటనే 38,222 వద్ద గరిష్ఠ స్థాయికి చేరుకుంది. విక్రయాల సెగతో పతనమవ్వడం మొదలైంది. 37,319 వద్ద ఇంట్రాడే కనిష్ఠ స్థాయిని తాకింది. ఇప్పుడు కాస్త కోలుకొని 555 పాయింట్ల నష్టంతో 37,347 వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీలో 10 కంపెనీలు లాభాల్లో, 40 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, సిప్లా, బజాజ్‌ ఫైనాన్స్‌, హీరోమోటో కార్ప్‌, దివిస్‌ ల్యాబ్‌ లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, ఎల్‌టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒక ఫార్మాను మినహాయిస్తే మిగతా రంగాల సూచీలన్నీ ఎరుపు రంగులోనే ఉన్నాయి. పవర్‌, పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీలు 1-2 శాతం నష్టపోయాయి.

Also Read: ఆసియాలో రిచెస్ట్ పర్సన్‌గా గౌతమ్ అదానీ, రెండో స్థానానికి రిలయన్స్ అధినేత

Published at : 08 Feb 2022 11:29 AM (IST) Tags: SBI sensex Nifty Stock Market Update share market BSE NSE Tata Motors Stock Market Crash

సంబంధిత కథనాలు

GST Rate Cut: ప్రభువుల వారు కరుణించారు! జీఎస్‌టీ తగ్గించిన వస్తువుల జాబితా!

GST Rate Cut: ప్రభువుల వారు కరుణించారు! జీఎస్‌టీ తగ్గించిన వస్తువుల జాబితా!

GST Rate Increase: ప్యాక్‌ చేసిన పెరుగు, లస్సీపై జీఎస్‌టీ - ఆస్పత్రి బెడ్స్, గ్రైండర్లపై పన్ను మోత!

GST Rate Increase: ప్యాక్‌ చేసిన పెరుగు, లస్సీపై జీఎస్‌టీ - ఆస్పత్రి బెడ్స్, గ్రైండర్లపై పన్ను మోత!

Hero Passion XTEC: కొత్త ప్యాషన్ వచ్చేసింది - రూ.లక్ష లోపు బెస్ట్ బైక్!

Hero Passion XTEC: కొత్త ప్యాషన్ వచ్చేసింది - రూ.లక్ష లోపు బెస్ట్ బైక్!

Cryptocurrency Prices: ఎరుపెక్కిన క్రిప్టోలు! బిట్‌కాయిన్‌ మళ్లీ పతనం!

Cryptocurrency Prices: ఎరుపెక్కిన క్రిప్టోలు! బిట్‌కాయిన్‌ మళ్లీ పతనం!

Credit Card Usage May 2022: మే నెల్లో క్రెడిట్‌ కార్డుల స్పెండింగ్‌ తెలిస్తే..! కళ్లు తిరుగుతాయ్‌!!

Credit Card Usage May 2022: మే నెల్లో క్రెడిట్‌ కార్డుల స్పెండింగ్‌ తెలిస్తే..! కళ్లు తిరుగుతాయ్‌!!

టాప్ స్టోరీస్

TS SSC Results 2022: ఇవాళే తెలంగాణ పదోతరగతి ఫలితాలు - రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

TS SSC Results 2022: ఇవాళే తెలంగాణ పదోతరగతి ఫలితాలు - రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

Maharashtra Political Crisis: సుప్రీం కోర్టు తీర్పుతో మారిన మహారాష్ట్ర పొలిటికల్ సీన్- కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌!

Maharashtra Political Crisis: సుప్రీం కోర్టు తీర్పుతో మారిన మహారాష్ట్ర పొలిటికల్ సీన్- కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌!

Relief For Amaravati Employees : మరో రెండు నెలలు ఉచిత వసతి - అమరావతి ఉద్యోగులకు సర్కార్ చివరి నిమిషంలో రిలీఫ్ !

Relief For Amaravati Employees  : మరో రెండు నెలలు ఉచిత వసతి - అమరావతి ఉద్యోగులకు సర్కార్ చివరి నిమిషంలో రిలీఫ్ !

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నుంచి రోహిత్ అవుట్ - కెప్టెన్ చాన్స్ ఎవరికంటే?

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నుంచి రోహిత్ అవుట్ - కెప్టెన్ చాన్స్ ఎవరికంటే?