RealEstate News : ఎర్రచందనం మొక్కలతో ఇళ్ల స్థలాలు - ఈ ఐడియాతోనే దూసుకెళ్తున్న రియల్ఎస్టేట్ సంస్థ !
ఎర్ర చందనం మొక్కలను నాటి ప్లాట్లను విక్రయిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థ శ్రీసాయి ప్రాజెక్ట్స్ 16 ఏళ్లు పూర్తి చేసుకుంది.

RealEstate News : రియల్ ఎస్టేట్ రంగంలో " సాయి ప్రాపర్టీస్ & ప్రాజెక్ట్స్ లిమిటెడ్ " ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ సంస్థ ప్రారంభమై ఇప్పటికి పదహారేళ్లయింది. ఈ సందర్భంగా 16 వ వార్షికోత్సవ వేడుకలు జూలై 11 వ తేదీన విజయవాడ నగరంలోని 'మురళి రిసార్ట్స్' లో వైభవంగా నిర్వహించారు. 2006 వ సంవత్సరంలో ఓ సాధారణ రియల్ ఎస్టేట్ సంస్థగా తమ సంస్థను ప్రారంభించామనీ , కస్టమర్ల ఆదరాభిమానాలు , ఆశీస్సులతో చక్కని అభివృద్ధిని సాధించామని కంపెనీ మేనేజింగ్ డైరక్టర్ సాయి శ్రీనివాస్ తెలిపారు. 2017 వ సంవత్సరంలో ఓ వినూత్నమైన ఆలోచనతో ఎర్రచందనం ప్లాంటేషన్ రంగంలోకి ప్రవేశించారు. ప్లాట్లలో ఎర్రచందనం మొక్కలు పెంచడం ద్వారా అందర్నీ ఆకట్టుకున్నారు.
కస్టమర్ల ఆదరాభిమానాలే సోపానాలుగా ఈ నూతన రంగంలో కూడా అభివృద్ధి పథంలో పయనిస్తున్నామనీ కేవలం 5 ఏళ్లలో 1500 ఎకరాలలో 15 వెంచర్లు చేపట్టి..విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని సాయి శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ 6 లక్షలకు ఎర్ర చందనం మొక్కలు... 4 వేల మందికి పైగా ఉన్న సంతోషకరమైన కస్టమర్లే తమ సంస్థ అభివృద్ధికి నిదర్శనమని అయన పేర్కొన్నారు . ఎర్ర చందనంతో చేసే బొమ్మలకు, ఎర్ర చందనం పౌడరుకు, ఆయిల్ కు , ఎర్రచందనం ఒక భాగంగా ఉండే ప్రతి ఉత్పత్తికీ..ప్రపంచ దేశాలలో.. ముఖ్యంగా ఆసియా దేశాలలో అమితమైన డిమాండ్ ఉందనీ , ఈ డిమాండ్ కస్టమర్లకు కాసుల వర్షం కురిపిస్తుందనీ , ప్రజలు ఈ విషయంపై అవగాహన పెంచుకోవాలన్నారు.
తమ ప్రతి వెంచర్ లోనూ ఎర్ర చందనం మొక్కలు ఉంటాయని సాయి శ్రీనివాస్ చెబుతున్నారు. అయితే ఎర్రచందనం పెంచడానికి అనుమతులు ఉంటాయా అని చాలా మంది సందేహిస్తూ ఉంటారు. అయితే చట్టబద్ధమైన రీతిలో ఎర్రచందనం సాగు , విక్రయాన్ని చేపట్టి..ఈ తరహా వ్యాపార విధానాన్ని ప్రపంచానికి మొదటిసారిగా పరిచయం చేశామని " సాయి ప్రాపర్టీస్ & ప్రాజెక్ట్స్ లిమిటెడ్ " ఎండీ చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా వృద్ది చెందుతున్న దశలో రియల్టర్లు తమదైన ఆలోచనలతో ముందడుగు వేస్తున్నారు. వినూత్నమైన ఐడియాతో ముందుకొచ్చినవారే సక్సెస్ అవుతున్నారు. ప్లాట్లలో ఎర్రచందనం మొక్కలనే ఐడియాతో రియల్ ఎస్టేట్ రంగంలో సాయి శ్రీనివాస్ తనదైన ముద్ర వేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

