అన్వేషించండి

Tata Tiago Discount Offer: రూ.5 లక్షల టాటా టియాగోపై రూ. 55,000 డిస్కౌంట్‌, ఫుల్‌ట్యాంక్‌తో 900 km రేంజ్‌

Tata Tiago Discount Offer: టాటా టియాగోలో 35-లీటర్ పెట్రోల్ ట్యాంక్ & 60-లీటర్ల CNG ట్యాంక్‌ ఉంది. వీటిని ఫుల్‌ చేస్తే 900 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

Tata Tiago Price, Mileage And Features In Telugu: టాటా టియాగో బాహ్య రూపం ఆధునిక డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. దీని షార్ప్ హెడ్‌ల్యాంప్స్‌ & వైడ్‌ గ్రిల్‌ కారు ముందు భాగాన్ని స్పోర్టీ అపీల్‌తో చూపిస్తాయి. స్మూత్‌ కర్వ్‌లతో కూడిన బాడీ లైన్లు దీనిని చాలా స్టైలిష్‌గా మార్చాయి. అలాయ్ వీల్స్‌ & డ్యుయల్ టోన్ పెయింట్ ఆప్షన్స్‌ టియాగోకు ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి. వీటన్నింటితోపాటు, ఇది మంచి మైలేజ్‌ ఇచ్చే కారు కూడా. ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లి రావడానికి, టూర్లు తిరగడానికి ఈ కారు చక్కగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం, పెట్రోల్ & డీజిల్ ధరలు పెరిగిన తర్వాత, డ్రైవింగ్‌ చేయడం ఖరీదైన వ్యవహారంగా మారింది. ఈ పరిస్థితిలో, ప్రతి ఒక్కరూ అందుబాటు ధరలో, మంచి మైలేజీ ఇవ్వడమే కాకుండా, గొప్ప ఫీచర్లు కలిగి ఉన్న కారును కోరుకుంటారు. టాటా టియాగోలో అలాంటి అన్ని లక్షణాలు కనిపిస్తాయి.

టాటా టియాగో పై డిస్కౌంట్ ఆఫర్‌
మీడియా వెబ్‌సైట్ గాడివాడి రిపోర్ట్‌ ప్రకారం, ఆగస్టు 2025లో టాటా టియాగో కొనుగోలుపై మీరు రూ. 55,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ డిస్కౌంట్‌లో రూ. 10,000 నగదు తగ్గింపు & రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే వర్తిస్తుంది. టాటా టియాగో ఎక్స్-షోరూమ్ ధర రూ. 5 లక్షల నుంచి ప్రారంభమై టాప్-ఎండ్ వేరియంట్‌కు రూ. 8.55 లక్షల వరకు ఉంటుంది. 

తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌-రోడ్‌ ధర
రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, ఇన్సూరెన్స్‌, ఇతర ఖర్చులు కలుపుకుని, హైదరాబాద్‌లో టాటా టియాగో బేస్‌ వేరియంట్‌ దాదాపు రూ. 6.03 లక్షలు. ఆన్‌-రోడ్‌ రేటుకు (Tata Tiago on-road price, Hyderabad) వస్తుంది. విజయవాడలో ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 6.05 లక్షలు (Tata Tiago on-road price, Vijayawada).

టాటా టియాగో పవర్‌ట్రెయిన్ 
టాటా టియాగో 1199 cc 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ కారులోని ఈ ఇంజన్ 6,000 rpm వద్ద 86 PS శక్తిని & 3,300 rpm వద్ద 113 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. టాటా టియాగో CNGలో కూడా అందుబాటులో ఉంది. టియాగో CNGలోని ఇంజిన్ 6,000 rpm వద్ద 75.5 PS శక్తిని & 3,500 rpm వద్ద 96.5 Nm టార్క్‌ను ఇస్తుంది. 

టాటా టియాగో కారు 242 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తుంది. ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm. టాటా టియాగో ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు & వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. 

టాటా టియాగో మైలేజ్
దీని పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ దాదాపు 20.09 kmpl మైలేజీని ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ టాటా కారు 19 kmpl వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ డేటా చూపుతోంది.

టాటా టియాగో కారు CNG మోడ్‌లో మెరుగైన మైలేజీని ఇస్తుంది. టియాగో CNG వేరియంట్‌ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 26.49 కి.మీ./కిలో & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 28.06 కి.మీ./కిలో మైలేజీని ఇస్తుంది. ఈ కారులో 35 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ & 60 లీటర్ల CNG ట్యాంక్ ఉన్నాయి, వీటిని పూర్తిగా నింపితే, కంపెనీ లెక్క ప్రకారం, ఈ కారు 900 km వరకు డ్రైవింగ్‌ రేంజ్‌ ఇస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget