Price Drop Offer: రూ.1.40 లక్షల తక్కువ ధరకు Tata Curvv EV – పెట్రోల్ పోయాల్సిన అవసరమే లేదు
Tata Curvv EV Coupe: Tata Curvv EV రెండు బ్యాటరీ ఆప్షన్లతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది, కస్టమర్ తన అవసరానికి అనుగుణంగా డ్రైవింగ్ రేంజ్‌ను ఎంచుకోవచ్చు.

Tata Curvv EV 2025 Price, Range And Features In Telugu: టాటా మోటార్స్, తన పాపులర్ Curvv EV కూపే ఎలక్ట్రిక్ SUV ని కొనే కస్టమర్లకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆగస్టు నెలలో, కర్వ్ ఎలక్ట్రిక్ SUV కొనుగోలుపై కంపెనీ రూ. 1 లక్ష 40 వేల తగ్గింపును (Discount on Tata Curvv EV) అందిస్తోంది. ఇందులో నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా కలిసి ఉంది.
Tata Curvv EV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 17.49 లక్షలు కాగా, దాని టాప్ మోడల్ ధర రూ. 22.24 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధర) ఉంటుంది. అన్ని ఖర్చులు కలుపుకుని, హైదరాబాద్‌లో దీని బేస్ వేరియంట్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 21.61 లక్షలు కాగా, విజయవాడలో దాదాపు రూ. 21.62 లక్షలు అవుతుంది.
టాటా కర్వ్ క్యాబిన్ ఫీచర్లు
Curv EV లోపలి భాగం అత్యాధునిక సాంకేతికత & ప్రీమియం కంఫర్ట్ ఫీచర్లతో నిండి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ SUV క్యాబిన్‌లో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది వినియోగదారులకు స్మార్ట్ & సహజమైన అనుభవాన్ని అందిస్తుంది.
భద్రతా ఫీచర్లు
టాటా కర్వ్ EVలో 6 ఎయిర్ బ్యాగ్‌లు, వెనుక & ముందు పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) & లెవల్-2 ADAS వంటి అత్యాధునిక భద్రతా లక్షణాలు & సాంకేతికతలు ఉన్నాయి. ఈ అన్ని లక్షణాలతో ఈ కారు భద్రత & సౌకర్యం రెండింటిలోనూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తుంది.
600 కి.మీ. వరకు డ్రైవింగ్ పరిధి
టాటా కర్వ్ EV రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో వచ్చింది. కారు కొనే కస్టమర్, తన అవసరానికి అనుగుణంగా ఒక బ్యాటరీ ప్యాక్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మొదటి ఎంపిక 45 kWh బ్యాటరీ ప్యాక్, దీనిని పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ కారు 502 కి.మీ. వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది.
రెండోది దీని కంటే పెద్ద బ్యాటరీ, 55 kWh బ్యాటరీ ప్యాక్. ఈ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 585 కి.మీ.ల లాంగ్ డ్రైవ్ అందించగలదు. ఈ గణాంకాలను బట్టి, టాటా కర్వ్ లాంగ్ డ్రైవ్‌లకు అనువైన ఎలక్ట్రిక్ SUV అని అర్ధమవుతుంది. సుదీర్ఘ బ్యాటరీ లెవెల్స్ కారణంగా, తరచుగా ఛార్జింగ్ చేయాలన్న ఆందోళనలు కూడా చాలా వరకు తగ్గుతాయి, సమయం మిగులుతుంది. ఈ బ్యాటరీ ఎంపికలతో పాటు, టాటా కర్వ్ EV 5 ఆకర్షణీయమైన రంగులలో మార్కెట్‌లో లభిస్తోంది.
కంపెనీ అందిస్తున్న రూ. 1.40 లక్షల డిస్కౌంట్ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే చెల్లుతుంది. డిస్కౌంట్‌కు సంబంధించి మరిన్ని వివరాల కోసం, కస్టమర్లు తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. ఈ ఆఫర్లు లొకేషన్ & వేరియంట్‌ను బట్టి మారవచ్చు.





















