Offers On Smart Phones: తక్కువ ధరకే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు- ఐఫోన్‌పై ఏకంగా రూ.11వేలు తగ్గింపు!
Amazon Prime Day Sale: ప్రైమ్‌డే సేల్ సందర్భంగా దాదాపు అన్ని బ్రాండెడ్ మొబైల్స్‌పై అమెజాన్ భారీ ఆఫర్స్ ప్రకటించింది. అర్థరాత్రి నుంచి సేల్ లైవ్ అయింది. ఒక్కో ఫోన్‌పై పదివేలకుపైగానే ఆఫర్ వస్తోంది.
Amazon Prime Day is Live now: ఇష్టమైన ప్రిమియమ్ ఫోన్లను అందుబాటు ధరల్లో పొందాలనుకునే మొబైల్ ప్రియులకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే అమెజాన్ ప్రై డే సేల్ మొదలైంది. గ్యాడ్జెట్ ప్రియుల అభిరుచులకు తగ్గట్లు... వివిధ కంపెనీల స్మార్ట్ ఫోన్లను మంచి డిస్కౌంట్స్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. వివిధ మొబైల్ తయారీ సంస్థలు సైతం వారి సరికొత్త స్మార్ట్‌ఫోన్లను అమెజాన్ ప్రైమ్ డే లాంఛ్ చేశారు. మరి ఈ సేల్‌లో పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లపై ప్రకటించిన ఆకర్షణీయమైన డీల్స్, ఆఫర్స్‌పై ఓ లుక్కేయండి.
ఆఫర్లు వర్తించే ఫోన్లు - సామ్సంగ్ గెలాక్సీ ఎమ్35 5జీ, ఐక్యూ జెడ్9 లైట్ 5జీ, మోటోరోలా రేజర్ 50 అల్ట్రా, లావా బ్లేజ్ ఎక్స్ వంటి కొత్త మోడళ్లతో పాటు రెడ్ మీ 13 5జీ, వన్ ప్లస్ నోర్డ్ సీఈ 4 లైట్, రియల్మీ జీటీ 6టీ 5జీ, వన్ ప్లస్12 ఆర్తోపాటు పలు ఫోన్లపై ఆఫర్లను ఇస్తోంది అమెజాన్.
ఐఫోన్13 : ఈ ప్రైమ్ డేలోని బిగ్గెస్ట్ డీల్స్‌లో ఐఫోన్ 13 కూడా ఒకటి. తక్కువ ధరకే దీనిని అందిస్తుంది. బ్యాంక్స్ ఆఫర్లతో కలిపి 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.47,999కు లభిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.59,900. అంటే ఈ ప్రైమ్ సేల్ ద్వారా రూ.11,901 తక్కువకే కొనుగోలు చేయొచ్చు.
సామ్సంగ్ - సామ్సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ ఏఐ స్మార్ట్‌ఫోన్ కూడా రూ.74,999కే దొరకనుంది. అది కూడా కూపన్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎమ్ఐ సదుపాయం కూడా కల్పిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ M35 మోడల్ అయితే ఇన్స్టాంట్ బ్యాంక్ డిస్కౌంట్, ప్రైమ్ డే కూపన్ ఆఫర్ మొత్తం కలిపి 4 వేల డిస్కౌంట్‌తో దీనిని రూ.16వేలకు దక్కించుకోవచ్చు. దీని ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్లో 120Hz రీఫ్రెష్ రేట్, సూపర్ అమోలెడ్ FHD+ డిస్‌ప్లే, గొరెల్లా గ్లాస్ విక్టస్ డిస్‌ప్లే, 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 50MP OIS, 8MP, 2MP కెమెరాలు సహా 13MP సెల్ఫీ కెమెరా ఉంది. 6000mAh బ్యాటరీ.
వన్‌ప్లస్ - వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు రూ. 17,999 పోస్ట్-ఆఫర్‌లతో అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ 12 5జీ ఫోన్ ఆఫర్లు, డిస్కౌంట్లు పోను రూ. 52,999లకు దొరుకుతోంది. వన్‌ప్లస్ 12ఆర్ 5జీ (16జీబీ+ 256జీబీ) రూ. 40,999కు లభిస్తోంది. అదే పాత ఫోన్‌పై ట్రేడింగ్ చేస్తే అదనంగా 5వేల రూపాయల వరకు తగ్గింపు పొందవచ్చు.
ఐక్యూ - ఐక్యూ కూడా మంచి ఆఫర్లను ఇస్తోంది. ఐక్యూ జెడ్9 లైట్, ఐక్యూ జెడ్9ఎక్స్ 5జీ కొత్తగా లాంఛ్ అవుతున్నాయి. ఈ కంపెనీకు సంబంధించిన మరిన్ని స్మార్ట్ ఫోన్స్ అన్నీ ఆఫర్లతో కలిపి రూ.9,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ రూ.3 వేల వరకు, అడిషనల్ ఆఫర్లు క్యూపన్లు, 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎమ్ఐ వంటి ఆఫర్లు ఇస్తున్నారు. ఐక్యూ నియో 9 ప్రో బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్స్‌తో కలిపి రూ. 29,999కి దొరుకుతోంది.
షియోమీ(Xiaomi) - షియోమీ ఫోన్ల ధరలు రూ.7,699 నుంచి ప్రారంభం అవుతున్నాయి. షావోమీ 11T ప్రొ 5G 48శాతం డిస్కౌంట్‌తో రూ.25,999కి అందుబాటులో ఉంది.
రెడ్‌మి: రెడ్‌మి-12 5జీ డిస్కౌంట్ ప్రైస్‌తో రూ.11,499 నుంచి అందుబాటులో ఉన్నాయి. రెడ్‌మి 13 5జీ చూస్తే హ్యాండ్ సెట్ రూ.14000 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్లో అమేజింగ్ పెర్ఫార్మెన్స్, ఇంప్రెసివ్ డిస్‌ప్లే ఫీచర్స్ ఉన్నాయి.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
రియల్ మి - రియల్ మి స్మార్ట్ ఫోన్లు రూ.7,499 ధర నుంచి అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనుగోలు చేయాలనుకుంటే రూ.1000 వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అదే విధంగా 4వేల రూపాయల వరకు కూపన్ ఆఫర్ కూడా ఉంటుంది. పొందవచ్చు. ఈ కంపెనీ నుంచి రియల్ మి జీటీ 6టీ 5జీ కొత్త మోడల్ రానుంది. ఇక రియల్‌మి నార్జో-70ఎక్స్ 5జీ మోడల్ చూస్తే ఇక ఇది అన్ని ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్లు పోను రూ.11,749లకు అందుబాటులో ఉంది. రియల్ మి నార్జో 70 ప్రో కూడా అన్ని కూపన్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్ పోనూ రూ.15,249కు దొరకనుంది.
మోటో(Moto): మోటోరోలా నుంచి మోటోరోలా రాజ్ర్ 50 అల్ట్రా అదిరిపోయే డిజైన్, ఏఐ ఫీచర్లతో వచ్చింది. అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ ధర రూ.89,999. అయితే రూ. 10 వేల తగ్గింపుతో ఇది అందుబాటులో ఉండనుంది. అలాగే నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ 18 నెలల వరకు ఉంది. మోటోరోలా రాజ్ర్ 40 సిరీస్ బ్యాంక్ డిస్కౌంట్‌తో కలిపి రూ.39,999 అందుబాటులో ఉంది. అలాగే 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎమ్ఐ ఆఫర్ ఉంది.
లావా - లావా నుంచి లావా బ్లేజ్ ఎక్స్ 5జీ మోడల్ రానుంది. ఫస్ట్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, సోనీ ఏఐ సెన్సార్ కలిగిన 64 ఎంపీ రియర్ కెమెరా ఫీచర్ ఇందులో ఉంది. బ్యాంక్ ఆఫర్లతో కలిపి దీని ప్రారంభ ధర రూ.13,999గా ఉంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మోబైల్స్ ఇవే