అన్వేషించండి

Banking: ఆదివారం కూడా బ్యాంక్‌లు పని చేస్తాయి, సెలవు లేదు

నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) రెండూ మార్చి 31 అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయి.

Banks Works on Sunday: ఈ ఆదివారం (మార్చి 31) బ్యాంక్‌లకు సెలవు లేదు, పని చేస్తాయి. దీనిపై రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది. RBI ప్రకటన ప్రకారం... 2024 మార్చి 30, శనివారం రోజున & మార్చి 31 ఆదివారం రోజున అన్ని ఏజెన్సీ బ్యాంకులు పని చేస్తాయి. ఆ రోజున ఏజెన్సీ బ్యాంక్‌ల అన్ని శాఖలు తెరిచి ఉంచాలని కేంద్ర బ్యాంక్‌ ఆదేశించింది. ఈ ఆదేశం ప్రకారం, శనివారం, ఆదివారం కూడా బ్యాంక్‌లు పని చేస్తాయి. 

నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) రెండూ మార్చి 31 అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు రోజుల్లో చెక్ క్లియరింగ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. 

స్పెషల్‌ డిపాజిట్‌ పథకాలు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), కిసాన్‌ వికాస్‌ పత్ర ‍‌(KVP), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి పథకాల్లో కనీస డిపాజిట్‌ చేయడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి కూడా మార్చి 31 చివరి రోజు కాబట్టి, వీటికి సంబంధించిన లావాదేవీలను కూడా అనుమతిస్తారని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. శని, ఆదివారాల్లో బ్యాంకుల్లో డబ్బులు వేయడం, తీయడం వంటి సాధారణ లావాదేవీలను కూడా అనుమతిస్తారా, లేదా అన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. 

ఏజెన్సీ బ్యాంకులు అంటే ప్రభుత్వ లావాదేవీలను సెటిల్‌ చేసేందుకు అధికారం ఉన్న బ్యాంకులు. ఏజెన్సీ బ్యాంకుల్లో 12 ప్రభుత్వ బ్యాంకులు సహా మొత్తం 33 బ్యాంకులు ఉన్నాయి. మార్చి 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి, ప్రభుత్వ ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను ఈ బ్యాంక్‌లు సెటిల్‌ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగే అన్ని ప్రభుత్వ లావాదేవీలను ఈ ఆర్థిక సంవత్సరం ఖాతాల్లో నమోదు చేయాలని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది. ఈ కారణంగా, ఈ ఆర్థిక సంవత్సరం చివరి రెండు రోజును ఏజెన్సీ బ్యాంక్‌లు పనిదినంగా పాటించాలని, ఆదివారం అయినప్పటికీ అన్ని శాఖలను తెరవాలని ఆదేశించింది.

ఏజెన్సీ బ్యాంక్‌ల లిస్ట్‌లో ఉన్న 33 బ్యాంక్‌లు

1. బ్యాంక్ ఆఫ్ బరోడా
2. బ్యాంక్ ఆఫ్ ఇండియా
3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
4. కెనరా బ్యాంక్
5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
6. ఇండియన్ బ్యాంక్
7. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
8. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
9. పంజాబ్ నేషనల్ బ్యాంక్
10. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
11. UCO బ్యాంక్
12. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
13. యాక్సిస్ బ్యాంక్
14. సిటీ యూనియన్ బ్యాంక్
15. DCB బ్యాంక్
16. ఫెడరల్ బ్యాంక్
17. HDFC బ్యాంక్ 
18. ICICI బ్యాంక్ 
19. IDBI బ్యాంక్ 
20. IDFC ఫస్ట్‌ బ్యాంక్
21. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 
22. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 
23. కర్ణాటక బ్యాంక్ 
24. కరూర్ వైశ్యా బ్యాంక్ 
25. కోటక్ మహీంద్ర బ్యాంక్ 
26. RBL బ్యాంక్ 
27. సౌత్ ఇండియన్ బ్యాంక్ 
28. యెస్ బ్యాంక్ 
29. ధనలక్ష్మి బ్యాంక్ 
30. బంధన్ బ్యాంక్ 
31. CSB బ్యాంక్ 
32. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 
33. DBS బ్యాంక్ ఇండియా

నోటిఫికేషన్‌లో RBI సూచించిన ప్రకారం... శని, ఆదివారాల్లో బ్యాంకులు ఎప్పటిలాగే సాధారణ సమయాల ప్రకారమే తెరిచి ఉంటాయి. కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 మొదటి రోజున (సోమవారం, 01 ఏప్రిల్‌ 2024) మాత్రం బ్యాంక్‌లు పని చేయవు, సెలవు తీసుకుంటాయి.

మరో ఆసక్తికర కథనం: మార్చి 31లోగా పూర్తి చేయాల్సిన పనులివి, మర్చిపోతే మీ జేబుకు చిల్లు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget