అన్వేషించండి

SBI Credit Card New Rules: జవనరి నుంచి ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ కొత్త రూల్స్‌ - ఓచర్లు & రివార్డ్‌ పాయింట్లలో మార్పులు

ఈ ఏడాది జూన్‌ నాటికి మన దేశంలో 14 మిలియన్ల ( ఒక కోటి 40 లక్షలు) SBI క్రెడిట్‌ కార్డ్స్‌ జారీ అయ్యాయి.

SBI Credit Card New Rules: మన దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (State Bank Of India -SBI) అతి పెద్దది. ప్రతి రోజు కోట్ల మంది ఖాతాదారులు బ్యాంక్‌ సేవలను ఉపయోగించుకుంటుంటారు. వారీలో స్టేట్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్లు కూడా ఉంటారు. ఈ ఏడాది జూన్‌ నాటికి మన దేశంలో 14 మిలియన్ల ( ఒక కోటి 40 లక్షలు) SBI క్రెడిట్‌ కార్డ్స్‌ జారీ అయ్యాయి. ఈ కార్డుల ద్వారా వివిధ రకాల వరల్డ్‌ క్లాస్‌, వాల్యూ యాడెడ్‌ పేమెంట్‌ ప్రొడక్ట్స్‌, సర్వీసులను కస్టమర్లు అందుకుంటున్నారు. 

వివిధ రకాల ప్రొడక్ట్స్‌ & సర్వీసులు అందిస్తున్నందుకు, కస్టమర్ల నుంచి రకరకాల రూపాల్లో రుసుములను ఎస్‌బీఐ కార్డ్‌ (SBI Card - ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులను జారీ చేసే సంస్థ ఇది) వసూలు చేస్తుంటుంది.

2023 జనవరి నుంచి కొత్త రూల్స్‌
SBI క్రెడిట్ కార్డ్ నియమాలు 2023 జనవరి 1వ తేదీ నుంచి మారుతున్నాయి. కొంతమంది కార్డ్ హోల్డర్లకు ఈ నియమాలు వర్తిస్తాయి. ముందుగా, SimplyCLICK కార్డ్ హోల్డర్‌ల కోసం నిర్దిష్ట నియమాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్‌ & పేమెంట్‌ సర్వీసెస్‌ (State Bank of India Cards and Payment Services) అప్‌డేట్ చేసింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్ వెబ్‌సైట్ ప్రకారం... ఓచర్‌లు, రివార్డ్ పాయింట్‌ల రిడెంప్షన్‌కు సంబంధించి రెండు నియమాలు కొత్త సంవత్సరం (2023) నుంచి మారతాయి.

"2023 జనవరి 6వ తేదీ నుంచి, SimplyCLICK కార్డ్ హోల్డర్‌లకు జారీ చేసిన క్లియర్‌ ట్రిప్‌ (Cleartrip) ఓచర్‌ను ఒకే లావాదేవీలో మాత్రమే రీడీమ్ చేయాలి. మరే ఇతర ఆఫర్ లేదా ఓచర్‌తో కలిపి ఉపయోగించకూడదు. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌లో చూడవచ్చు" అని SBI కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్ తెలిపింది. 

ఇది కాకుండా, SimplyCLICK లేదా SimplyCLICK Advantage ఎస్‌బీఐ కార్డ్‌ ద్వారా Amazon. inలో చేసే ఆన్‌లైన్ వ్యయం మీద రివార్డ్ పాయింట్‌లకు సంబంధించిన నియమాలు కూడా 2023 జనవరి 1 నుంచి మారుతాయి.

"SimplyCLICK లేదా SimplyCLICK Advantage ఎస్‌బీఐ కార్డ్‌ ద్వారా Amazon. inలో చేసే ఆన్‌లైన్ వ్యయం మీద అందించే 10X రివార్డ్ పాయింట్లను 2023 జనవరి 1వ తేదీ నుంచి 5X రివార్డ్ పాయింట్లకు సవరించడం జరుగుతుంది. SimplyCLICK లేదా SimplyCLICK Advantage ఎస్‌బీఐ కార్డ్‌ ద్వారా అపోలో 24X7, బుక్‌ మై షో, క్లియర్‌ ట్రిప్‌, ఈజీ డైనర్‌, లెన్స్‌కార్ట్‌, నెట్‌మెడ్స్‌ వెబ్‌సైట్లలో చేసే ఆన్‌లైన్‌ వ్యయం మీద 10X రివార్డ్ పాయింట్ల జమ కొనసాగుతుంది." అని SBI కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఇప్పటికే ఛార్జీల మోత
ఇప్పటికే... కొన్ని ఛార్జీల విషయంలో SBI Card మార్పులు చేసింది. EMI లావాదేవీల మీద ఛార్జీలు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి చేసే అద్దె చెల్లింపుల మీద కొత్త ఛార్జీలను పెంచింది. 2022 నవంబర్ 15వ తేదీ నుంచి ఇవి అమల్లోకి కూడా వచ్చాయి.

EMI లావాదేవీల మీద ప్రాసెసింగ్ ఫీజును "రూ. 99 + వర్తించే పన్నులు" నుంచి "రూ. 199 + వర్తించే పన్నులు"కు పెంచింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి చేసే అద్దె చెల్లింపు లావాదేవీల మీద గతంలో లేని ప్రాసెసింగ్ ఫీజును 2022 నవంబర్ 15వ తేదీ నుంచి వసూలు చేస్తోంది. "రూ. 99 + వర్తించే పన్నులు"ను ప్రాసెసింగ్‌ ఫీజుగా తీసుకుంటోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Embed widget