అన్వేషించండి

SBI: స్టేట్‌ బ్యాంక్‌ శాలరీ అకౌంట్‌తో రూ.కోటి ఇన్సూరెన్స్‌ పూర్తిగా ఉచితం, చాలామందికి ఇది తెలీదు

SBI Salary Package Account: జీతం తీసుకునే వ్యక్తులకు మాత్రమే కాదు, అతను/అమె కుటుంబానికి కూడా స్టేట్‌ బ్యాంక్‌ శాలరీ ప్యాకేజ్‌ అకౌంట్‌ నుంచి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి.

Salary Package Account SBI: ఉద్యోగం చేసే కస్టమర్లను ఆకర్షించడానికి అన్ని బ్యాంక్‌లు శాలరీ అకౌంట్స్‌ కోసం ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. జీతం పొందే వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా ఆ ఖాతాలను స్పెషల్‌ ఫీచర్‌లతో నింపుతున్నాయి. దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా జీతపు ఖాతాలపై చాలా బెనిఫిట్స్‌ అందిస్తోంది. జీతం తీసుకునే వ్యక్తుల బ్యాంకింగ్ అవసరాలన్నింటినీ తీర్చేలా ఈ ఖాతాలను స్టేట్‌ బ్యాంక్‌ తీర్చిదిద్దింది. 

SBI శాలరీ ప్యాకేజ్‌ అకౌంట్‌ అంటే ఏమిటి?

శాలరీ ప్యాకేజ్‌ ఖాతా అనేది.. నెట్‌ బ్యాంకింగ్ & మొబైల్ బ్యాంకింగ్‌కు యాక్సెస్‌తో పాటు సాధారణ కస్టమర్లకు అందని అదనపు & విభిన్నమైన సేవలను అందించేందుకు ఉద్యోగుల కోసం రూపొందించిన ప్రత్యేకమైన సేవింగ్స్‌ ఆప్షన్‌. ప్రభుత్వ & ప్రైవేటు రంగ ఉద్యోగులంతా SBI శాలరీ ప్యాకేజ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయడానికి అర్హులే.

SBI శాలరీ ప్యాకేజ్‌ అకౌంట్‌ రకాలు:

- ఉద్యోగి జీతం రూ.2 లక్షల దాటితే రోడియం కేటగిరీలో శాలరీ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు.
- జీతం రూ.1 లక్ష- రూ.2 లక్షల వరకు ఉంటే ప్లాటినం అకౌంట్‌ ప్రారంభించొచ్చు.
- జీతం రూ.50,000-రూ.లక్ష వరకు ఉంటే డైమండ్‌ కేటగిరీ కిందకు వస్తారు.
- జీతం రూ.25,000-రూ.50,000 వరకు ఉంటే గోల్డ్‌ విభాగంలో ఖాతా ప్రారంభించొచ్చు.
- జీతం రూ.10,000-రూ.25,000  వరకు ఉంటే సిల్వర్‌ కేటగిరీలో అకౌంట్‌ తీసుకోవచ్చు. 
- ఈ కేటగిరీలను బట్టి, బ్యాంక్‌ అందించే ప్రయోజనాల్లో కొన్ని తేడాలు ఉంటాయి. ప్రతి ప్రయోజనాన్ని రూపాయి ఖర్చు లేకుండా అందుకోవచ్చు.

SBI శాలరీ అకౌంట్‌ ప్రయోజనాలు:

- ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్‌. ఖాతాలో ఒక్క రూపాయి బ్యాలెన్స్‌ లేకపోయినా పెనాల్టీ ఉండదు.
- మంత్లీ యావరేజ్‌ బ్యాలెన్స్ ఛార్జీలు లేవు.
- మీ అకౌంట్‌ కోసం ఫ్యాన్సీ నంబర్‌ తీసుకోవచ్చు.
- ఆటో స్వీప్ ఫెసిలిటీ ఉంటుంది. ఇది ఐచ్ఛికం. మీ అకౌంట్‌లో మీ అవసరానికి మించి డబ్బు ఉంటే, ఈ ఆప్షన్‌ ఎంచుకున్నప్పుడు, మిగిలిన డబ్బు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లోకి వెళుతుంది. మీకు అవసరమైనప్పుడు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆ - డబ్బును వెనక్కుతీసుకోవచ్చు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో ఉన్నన్ని రోజులకు మీకు వడ్డీ లభిస్తుంది.
- సాధారణ కస్టమర్ల కంటే ప్రత్యేకమైన ప్రయోజనాలతో ఉచిత డెబిట్ కార్డ్ వస్తుంది.
- భారతదేశంలోని SBI లేదా ఇతర బ్యాంకుల ATMల్లో ఎన్నిసార్లయినా డబ్బు తీసుకోవచ్చు, ఛార్జీలు వర్తించవు.
- శాలరీ కేటగిరీని బట్టి బ్యాంక్‌ నుంచి ఇంటర్నేషనల్‌ రోడియం/ప్లాటినం/డైమండ్‌/గోల్డ్‌/సిల్వర్‌ డెబిట్‌ కార్డ్‌ తీసుకోవచ్చు. ఇది ఇంటర్నేషనల్‌ డెబిట్‌ కార్డ్‌. విదేశాలకు వెళ్లినప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు. విదేశాల్లో ఏటీఎంలోకి వెళ్లినప్పుడు మీ ఖాతాలోని రూపాయలు ఆటోమేటిక్‌గా ఆ దేశపు కరెన్సీలోకి మారి, ఆ కరెన్సీ ఏటీఎం నుంచి వస్తుంది.
- క్రెడిట్‌ కార్డ్‌ మీద కూడా ప్రత్యేక బెనిఫిట్స్‌ అందుతాయి.
- డిమాండ్ డ్రాఫ్ట్‌ (DD) ఛార్జీల నుంచి 100% మినహాయింపు ఉంటుంది. ఒక నెలలో ఎన్ని డీడీలయినా తీసుకోవచ్చు.
- నెలకు 25 చెక్ లీవ్స్‌ వరకు తీసుకోవచ్చు, దీనికి కూడా ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.
- ఆన్‌లైన్ RTGS / NEFT ఛార్జీల నుంచి మినహాయింపు.
- మిగిలినవారి కంటే తక్కువ వడ్డీ రేట్లకు వ్యక్తిగత రుణాలు (SBI Personal Loan), కారు లోన్‌ (SBI Car Loan), గృహ రుణాలు (SBI Home Loan) అందుబాటులో ఉంటాయి.
- ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది. జీతం రావడం ఆలస్యమైన సందర్భాల్లో దీనిని ఉపయోగించుకోవచ్చు. ప్లాటినం కేటగిరీలో ఉన్న ఉద్యోగులు రూ.2 లక్షలు వరకు తీసుకోవచ్చు. డైమండ్‌ కేటగిరీలో ఉన్నవాళ్లు గరిష్టంగా రూ.1.50 లక్షలు, గోల్డ్‌ విభాగంలోని వ్యక్తులు రూ.75,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. సిల్వర్‌ కేటగిరీ వాళ్లకు ఈ సౌకర్యం లేదు.
- వార్షిక లాకర్ అద్దె ఛార్జీలపై రాయితీ కూడా లభిస్తుంది. ప్లాటినం వాళ్లకు ఏడాదికి 25% డిస్కౌంట్‌, డైమండ్‌ వాళ్లకు 15% డిస్కౌంట్‌ ఉంటుంది. 
- OTT, ఫుడ్‌ అగ్రిగేటర్స్‌ (జొమాటో, స్విగ్గీ వంటివి) సబ్‌స్క్రిప్షన్లను కూడా కొన్నాళ్ల పాటు ఉచితంగా అందుకోవచ్చు. 
- మూవీ టిక్కెట్ల బుకింగ్‌ సమయంలో డిస్కౌంట్స్‌ లభిస్తాయి. 
- స్పా, జిమ్‌, గోల్ఫ్‌ క్లబ్‌ వంటి వాటిల్లోకి కాప్లిమెంటరీ విజిట్స్‌ లభిస్తాయి.
- శాలరీ కేటగిరీని బట్టి, మీ డెబిట్‌ కార్డ్‌ ద్వారా డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ల్లోకి ఉచిత ప్రవేశం లభిస్తుంది.

కోటి రూపాయల ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ 

శాలరీ అకౌంట్‌ హోల్డర్‌కు ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ ఉంటుంది, ప్రీమియం డబ్బును బ్యాంక్‌ కడుతుంది. ఏదైనా ప్రమాదంలో ఖాతాదారు మరణిస్తే బ్యాంక్‌ నుంచి 30 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్‌ రూపంలో లభిస్తాయి. అదనంగా, డెబిట్‌ కార్డ్‌ మీద కూడా బీమా ఉంటుంది. డెబిట్‌ కార్డ్‌ నుంచి కవరేజ్‌ రూపంలో మరో రూ.10 లక్షల వరకు వస్తాయి. మొత్తంగా కలిపి రూ.40 లక్షల వరకు ఆ కుటుంబానికి అందుతాయి. క్లెయిమ్‌ చేసుకున్న 15 రోజులలోపు డబ్బులు వస్తాయి. ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.30 లక్షలు బ్యాంక్‌ నుంచి అందుతాయి. చాలామందికి ఈ విషయం తెలీక క్లెయిమ్‌ చేయడం లేదు.

శాలరీ అకౌంట్‌ హోల్డర్‌కు కోటి రూపాయల వరకు ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్‌ కూడా ఉంటుంది. అన్ని కేటగిరీల వాళ్లకు ఈ కవరేజ్‌ ఉంటుంది. దీనికి అదనంగా, ATM కార్డ్‌ మీద కూడా ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్‌ ఉంటుంది. కార్డ్‌ రకాన్ని బట్టి వచ్చే కవరేజ్‌ మొత్తం మారుతుంది.

SBI అందించే వివిధ రకాల శాలరీ ఖాతా ప్యాకేజ్‌లు ఏమిటి?

సెంట్రల్‌ గవర్నమెంట్‌ శాలరీస్‌ ప్యాకేజ్‌ (CGSP)
స్టేట్‌  గవర్నమెంట్‌ శాలరీస్‌ ప్యాకేజ్‌ (SGSP)
రైల్వే శాలరీ ప్యాకేజ్‌ (RSP)
డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్‌ (DSP)
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ శాలరీ ప్యాకేజ్‌ (CAPSP)
పోలీస్‌ శాలరీస్‌ ప్యాకేజ్‌ (PSP)
ఇండియన్ కోస్ట్ గార్డ్ శాలరీ ప్యాకేజ్‌ (ICGSP)
కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్‌ (CSP)
ప్రారంభ శాలరీ ప్యాకేజ్‌ ఖాతా (SUSP)

జీతం పొందే వ్యక్తి నేరుగా బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లిగానీ, YONO యాప్‌ ద్వారా గానీ జీతపు ఖాతా తెరవొచ్చు.

శాలరీ అకౌంట్‌ తెరవడానికి అవసరమైన పత్రాలు:

పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో
పాన్ కార్డ్ కాపీ
వ్యక్తిగత గుర్తింపు & చిరునామా రుజువు పత్రాలు
ఉద్యోగి ఐడీ కార్డ్‌ జిరాక్స్‌
సర్వీస్‌ సర్టిఫికెట్‌
తాజా పే స్లిప్

ఇప్పటికే ఉన్న సేవింగ్స్ ఖాతాను శాలరీ అకౌంట్‌గా మార్చొచ్చా?

మార్చొచ్చు. SBIలో ఇప్పటికే ఉన్న సేవింగ్స్‌ ఖాతాను జీతం ప్యాకేజ్‌ ఖాతాగా మార్చొచ్చు. ఇందుకోసం పైన చెప్పిన పత్రాలను బ్యాంక్‌కు సమర్పిస్తే చాలు.

మరో ఆసక్తికర కథనం: కొనసాగుతున్న చమురు ధరల పతనం - మీ నగరంలో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Squid Game Season 2 Teaser: స్క్విడ్ గేమ్ సీజన్ 2... డెడ్లీ గేమ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఆట చూసేందుకు రెడీనా?
స్క్విడ్ గేమ్ సీజన్ 2... డెడ్లీ గేమ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఆట చూసేందుకు రెడీనా?
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Embed widget