India ICC Tournament Records | 29 మ్యాచ్‌ల్లో కేవలం 2 ఓటములు
టీ20 ప్రపంచకప్ 2026 ( T20 World Cup 2026 ) సూపర్-8 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలయింది. ఇది భారత్ కు వరల్డ్ కప్ లో తోలి ఓటమి. దాంతో ఫ్యాన్స్ చాలా డిస్సపాయింట్ అయ్యారు. కానీ, స్టాట్స్ ఒక్కసారి చెక్ చేస్తే ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ ఎంతటి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందో అర్థమవుతుంది. గత 29 ఐసీసీ టోర్నమెంట్ మ్యాచ్‌లను చూసుకుంటే, భారత్ కేవలం రెండే రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
మొదటిది, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమి. అప్పటివరకు వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా, ఫైనల్లో బోల్తా పడింది. ఇక రెండోది, తాజాగా అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్. ఈ రెండు మినహా మిగిలిన అన్ని సందర్భాల్లోనూ భారత్ ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది.
అయితే సూపర్ 8 మ్యాచ్ లో ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) మాట్లాడుతూ.. బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణమని చెప్పుకొచ్చాడు. బౌలింగ్ పరంగా చూసుకుంటే బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఈ ఓటమి కేవలం ఒక చిన్న ఎదురుదెబ్బ మాత్రమేనని, జింబాబ్వేతో జరగబోయే తదుపరి మ్యాచులో మరింత బలంగా తిరిగి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.























