అన్వేషించండి

Property Purchase Alert : Plot / Flat కొనుగోలు ముందు జాగ్రత్త.. ఈ 5 డాక్యుమెంట్స్ చెక్ చేయకపోతే లీగల్ సమస్యలు ఖాయం

Legal Checklist : ప్రాపర్టీ కొనడమనేది జీవితంలో పెద్ద నిర్ణయం. ఆ సమయంలో తొందరపడి తీసుకున్న నిర్ణయం జీవితకాల సమస్యగా మారవచ్చు. కాబట్టి కొన్ని డాక్యుమెంట్స్ కచ్చితంగా చెక్ చేసుకోవాలి. అవేంటంటే..

Essential Documents to Check Before Buying Plot / Flat : ప్రాపర్టీ కొనడం చాలామందికి డ్రీమ్. పైగా ఇదేమి చిన్న విషయం కాదు. ఒక ప్లాట్ లేదా ఫ్లాట్ కొనడానికి చాలామంది జీవితకాల పొదుపును ఖర్చు చేస్తారు. మరికొందరు లోన్స్ తీసుకుంటారు. ప్రాపర్టీలు కొన్నప్పుడే ఫ్యామిలీ సెటిల్ అయిందని భావిస్తారు. చాలామంది మిడిల్ క్లాస్ వారికి ఈ ఫీల్ ఉంటుంది. అయితే లోన్ తీసుకుని లేదా సేవింగ్స్ చేసి ప్రాపర్టీ కొనేప్పుడు తొందరపడకుండా.. కానీ డాక్యుమెంట్స్ కచ్చితంగా చెక్ చేసుకోవాలి. లేకుంటే తరువాత లీగల్ సమస్యలు, కోర్టు కేసులు, డబుల్ రిజిస్ట్రేషన్ మోసాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అందుకే ప్లాట్ / ఫ్లాట్ / ఇండిపెండెంట్ హౌస్ కొనేముందు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ తప్పకుండా పరిశీలించాలని అంటున్నారు నిపుణులు. వాటిలో 5 డాక్యుమెంట్స్ కచ్చితంగా చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇంతకీ ఆ డాక్యుమెంట్స్ ఏంటో.. అవి ఎందుకు చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Sale Deed – ఓనర్ ఎవరో తెలుసుకోండి..

Sale Deed అనేది ఆ ప్రాపర్టీకి సంబంధించిన అసలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. ఇది మీకు ఈ ప్రాపర్టీని ప్రస్తుతం అమ్ముతున్న వ్యక్తి అసలు ఓనర్‌నా? అతను ఎప్పుడు కొనుగోలు చేశాడు? పూర్తి స్థలం/ఫ్లాట్ డిటైల్స్ సరైనవేనా అనేది చెప్తుంది. సేల్ డీడ్‌లో ఉన్న వివరాలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ రికార్డ్స్‌తో మ్యాచ్ అవుతున్నాయా చెక్ చేసుకవాలి. ఫోటోకాపీ కాకుండా.. ఒరిజినల్ లేదా సర్టిఫైడ్ కాపీ చూసి నిర్ణయం తీసుకోవాలి.

Link Documents –  30 ఏళ్ల హిస్టరీ

చాలామంది పెద్దగా పట్టించుకోని డాక్యుమెంట్ ఇదే. కానీ ఇది కూడా ఓ ముఖ్యమైన డాక్యుమెంట్​గా చెప్తారు. గత 30 ఏళ్లలో ఆ ప్రాపర్టీ ఎవరెవరి చేతుల్లోకి వెళ్లింది? ఎక్కడైనా లీగల్ డిస్ప్యూట్ ఉందా? ఏదైనా గిఫ్ట్ డీడ్, సెటిల్‌మెంట్ డీడ్, కోర్టు ఆర్డర్ ఉందా? అనేది ఈ డాక్యుమెంట్ చెప్తుంది. Link Documents క్లియర్‌గా లేకపోతే భవిష్యత్తులో సమస్యలు రావచ్చు.

Encumbrance Certificate (EC) – లోన్ లేదా బాకీలు ఉన్నాయా?

ప్రాపర్టీ కొనేముందు EC చాలా కీలకం. ఆ ప్రాపర్టీపై బ్యాంక్ లోన్ ఉందా? ఎలాంటి బాకీలు పెండింగ్‌లో ఉన్నాయి? కోర్టు అటాచ్‌మెంట్ ఉందా? అనేది దీనితో తెలుస్తుంది.  ECలో ఎలాంటి ఎంట్రీలు ఉన్నాయో జాగ్రత్తగా చదవాలి. “Nil EC” అంటే ఎలాంటి లీగల్ సమస్యలు లేవని అర్థం. 

RERA రిజిస్ట్రేషన్ 

భారతదేశంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు Real Estate (Regulation and Development) Act, 2016 కింద RERA రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ప్రాజెక్ట్ RERAలో నమోదు అయ్యిందా? డెడ్‌లైన్ ఏమిటి? లీగల్ అప్రూవల్స్ ఉన్నాయా? అనేది దీనితో తెలుస్తుంది. RERA వెబ్‌సైట్‌లో ప్రాజెక్ట్ వివరాలు చెక్ చేయడం వల్ల మోసాలను చాలా వరకు నివారించవచ్చు.

BRS / Building Rules – అనుమతుల కోసం..

ఫ్లాట్ లేదా హౌస్ కొనేటప్పుడు ఈ డాక్యుమెంట్ చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. బిల్డింగ్ ప్లాన్ మున్సిపల్ అప్రూవల్ పొందిందా? ఎన్ని ఫ్లోర్స్‌కు అనుమతి ఉంది? అనధికార నిర్మాణం ఉందా? అనేవి తెలుసుకోవచ్చు. అనుమతి లేకుండా అదనపు ఫ్లోర్స్ కట్టినట్లయితే భవిష్యత్తులో డెమాలిషన్ నోటీసులు రావచ్చు. కాబట్టి ముందుగా జాగ్రత్త పడేందుకు ఇది హెల్ప్ చేస్తుంది. 

ఎక్కువగా జరిగే ప్రాపర్టీ స్కామ్‌లు

ఈ డాక్యుమెంట్స్ సరిగ్గా పట్టించుకోకుంటే.. మీరు ప్రాపర్టీ స్కామ్​లకు గురికావాల్సి వస్తుంది. అవేంటంటే డబుల్ రిజిస్ట్రేషన్, ఫేక్ పవర్ ఆఫ్ అటార్నీ, లేఅవుట్ అప్రూవల్ లేకుండా ప్లాట్స్ విక్రయం, RERA లేకుండా ప్రీ-లాంచ్ ఆఫర్లు ఎక్కువగా జరిగే స్కామ్స్​గా చెప్పవచ్చు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీరు ఏదైనా ప్రాపర్టీ, హోస్, ప్లాట్, ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే.. ముందుగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఒక మంచి లాయర్ దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకోండి. బ్యాంక్ లోన్ అప్లై చేస్తే బ్యాంక్ కూడా లీగల్ వెరిఫికేషన్ చేస్తుంది. అడ్వాన్స్ ఇచ్చే ముందు అన్ని పేపర్లు పూర్తిగా చెక్ చేసుకోండి. మాటలపై కాకుండా రాతపూర్వక ఒప్పందం కచ్చితంగా తీసుకోండి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Embed widget