News
News
X

Samvardhana Motherson: ఒక్క బ్లాక్‌ డీల్‌తో మట్టి కరిచిన సంవర్ధన మదర్‌సన్‌, ఏకంగా 8% పతనం

SAMIL మొత్తం ఈక్విటీలో 2.95 శాతానికి సమానమైన 133.35 మిలియన్ షేర్లు (13.33 కోట్ల షేర్లు) BSEలో చేతులు మారాయని ఎక్స్ఛేంజ్ డేటా చూపిస్తోంది.

FOLLOW US: 
 
Samvardhana Motherson Shares: ఇవాళ్టి (మంగళవారం) ట్రేడ్‌లో, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ (SAMIL) షేర్లు 7 శాతం పైగా పతనంతో రూ. 63.30 వద్ద 52 వారాల కనిష్టానికి చేరాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 29న తాకిన మునుపటి కనిష్ట స్థాయి రూ.68.53 కంటే ఇవాళ దిగువకు పడిపోయింది.

ఈ ఆటో అనుబంధ కంపెనీకి చెందిన 100 మిలియన్లకు పైగా షేర్లు బ్లాక్ డీల్స్ ద్వారా చేతులు మారడంతో ఇంత భారీగా పడిపోయింది.

ఉదయం 09:15 గంటల సమయంలో, SAMIL మొత్తం ఈక్విటీలో 2.95 శాతానికి సమానమైన 133.35 మిలియన్ షేర్లు (13.33 కోట్ల షేర్లు) BSEలో చేతులు మారాయని ఎక్స్ఛేంజ్ డేటా చూపిస్తోంది. అమ్మింది ఎవరో, కొన్నది ఎవరో ఇవాళ సాయంత్రానికి తెలుస్తుంది.

నమ్మకమైన సమాచారం ప్రకారం... జపాన్‌కు చెందిన సోజిట్జ్ కార్ప్ (Sojitz Corp), బ్లాక్ డీల్ ద్వారా ఈ ఆటో కాంపోనెంట్ మేజర్‌లో 1.9 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది. బ్లాక్ డీల్ ఫ్లోర్ ప్రైస్‌ ఒక్కో షేరుకు రూ. 64.36. అంటే, ఈ ధర లేదా ఇంతకంటే ఎక్కువ ధరకు షేర్లు చేతులు మారాయి.

News Reels

ఫ్లోర్ ప్రైస్‌ రూ.64.36
ఉదయం 10:19 గంటల సమయానికి S&P BSE సెన్సెక్స్‌లోని 1.2 శాతం పెరుగుదలతో పోలిస్తే, ఈ షేరు 6 శాతం తగ్గి రూ. 65.20 వద్ద ట్రేడయింది. ఆ సమయానికి NSE, BSEలో కలిపి 202 మిలియన్  షేర్ల (20.20 కోట్ల షేర్లు) ట్రేడింగ్‌ జరిగింది.

మధ్యాహ్నం 1.15 గంటల సమయానికి ఈ షేరు 7.15 శాతం క్షీణించి, రూ. 64.25 వద్ద కదులుతోంది.

ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సరఫరా వైపు పరిమితుల కారణంగా గత కొన్ని త్రైమాసికాలుగా ఈ కంపెనీ లాభదాయకత, పనితీరు క్షీణిస్తోంది. ఎబిటా (EBITDA) మార్జిన్‌ Q1FY23లో 6.5 శాతంగా ఉంది, ఇది Q4FY22లోని 7.1 శాతం నుంచి తగ్గింది. లాభదాయకత పెంచుకునేందుకు.. ఖర్చులు తగ్గించేలా కంపెనీ కొన్ని చర్యలు చేపట్టిందని, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు/లోయర్‌ ఆఫ్‌టేక్‌లను భర్తీ చేసుకునేందుకు తన కస్టమర్లతో చర్చలు జరుపుతోందని రేటింగ్‌ ఏజెన్సీ ICRA పేర్కొంది.

సైక్లికాలిటీ, పెరుగుతున్న రెగ్యులేటరీ జోక్యాలు, కీలకమైన అభివృద్ధి చెందిన మార్కెట్లలో, ముఖ్యంగా యూరప్‌లోని (కంపెనీ ఆదాయంలో దాదాపు 40 శాతం) ఆటోమోటివ్ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ వంటి సవాళ్లను ఈ కంపెనీ ఎదుర్కొంటోంది. వీటి వల్ల SAMIL ఫైనాన్షియల్‌ పెర్పార్మెన్స్‌ ప్రభావితమవుతోంది. దీనికితోడు, ఆదాయం కోసం యూరోపియన్ OEMల మీద ఎక్కువగా ఆధారపడటం, ఆ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ గొడవలు, వాణిజ్య సుంకాలతో డిమాండ్‌ తగ్గడం వంటివి కంపెనీ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.

అయితే, SAMIL పాదముద్ర ప్రపంచవ్యాప్తంగా 269 ప్రాంతాల్లో విస్తరించి ఉంది. దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఈ కంపెనీ మీద "స్టేబుల్‌" రేటింగ్‌ను ICRA జారీ చేసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 18 Oct 2022 01:31 PM (IST) Tags: Stock Market 52 week low Samvardhana Motherson Shares SAMIL

సంబంధిత కథనాలు

Gold Overdraft Loan: గోల్డ్ ఓవర్‌ డ్రాఫ్ట్ లోన్‌ కోసం ప్లాన్ చేస్తున్నారా?, ముందు దాని లాభనష్టాలు తెలుసుకోండి

Gold Overdraft Loan: గోల్డ్ ఓవర్‌ డ్రాఫ్ట్ లోన్‌ కోసం ప్లాన్ చేస్తున్నారా?, ముందు దాని లాభనష్టాలు తెలుసుకోండి

Bajaj Hindusthan Sugar Shares: బాకీలు తీర్చేశాక బరబరా పెరిగిన స్టాక్‌ ఇది, తియ్యటి కబురుతో 43% జంప్‌

Bajaj Hindusthan Sugar Shares: బాకీలు తీర్చేశాక బరబరా పెరిగిన స్టాక్‌ ఇది, తియ్యటి కబురుతో 43% జంప్‌

తీసుకున్న లోన్‌ కట్టలేదని ఫోన్ చేస్తుంటే మీరు కేసు పెట్టొచ్చు!

తీసుకున్న లోన్‌ కట్టలేదని ఫోన్ చేస్తుంటే మీరు కేసు పెట్టొచ్చు!

Tata group stocks: అన్‌లక్కీ 2022, ఈ ఏడాదిని నష్టాలతో ముగించనున్న 8 టాటా గ్రూప్‌ స్టాక్స్‌

Tata group stocks: అన్‌లక్కీ 2022, ఈ ఏడాదిని నష్టాలతో ముగించనున్న 8 టాటా గ్రూప్‌ స్టాక్స్‌

LIC Dhan Varsha: ఒక్క ప్రీమియం కడితే చాలు, 10 రెట్లు రిటర్న్‌ ఇచ్చే ఎల్‌ఐసీ పాలసీ ఇది

LIC Dhan Varsha: ఒక్క ప్రీమియం కడితే చాలు, 10 రెట్లు రిటర్న్‌ ఇచ్చే ఎల్‌ఐసీ పాలసీ ఇది

టాప్ స్టోరీస్

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!