Reliance To Buy Revlon: అంబానీ మరో మాస్టర్ ప్లాన్! ఆ అమెరికా కంపెనీని కొంటున్నారా!
Reliance To Buy Revlon: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మరో కీలక అడుగు వేయబోతున్నారా? అమెరికాలో దివాలా తీసిన కంపెనీని కొనుగోలు చేస్తున్నారా?
Reliance To Buy Revlon: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మరో కీలక అడుగు వేయబోతున్నారా? అమెరికాలో దివాలా తీసిన రెవ్లాన్ కంపెనీని కొనుగోలు చేస్తున్నారా? ప్రపంచంలోనే అతిపెద్ద కాస్మొటిక్ ఉత్పత్తుల తయారీ కంపెనీను సొంతం చేసుకోబోతున్నారా? అంటే అవుననే తెలుస్తోంది!
పది బిలియన్ డాలర్ల అప్పులతో సతమతం అవుతున్న రెవ్లాన్‌ను ముకేశ్ అంబానీ కొనుగోలు చేస్తారని సమాచారం. ఆ కంపెనీని సొంతం చేసుకొని కాస్మొటిక్ వ్యాపారా రంగంలోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నారని తెలిసింది.
ఈ మధ్య కాలంలో రిలయన్స్ తమ వ్యాపార ప్రణాళికలను మార్చింది. వైవిధ్యం పెంచింది. ఆయిల్, డేటా, టెలికాం, నిత్యావసర సరుకుల స్టోర్స్, ఫ్యాషన్ రంగాల్లో సేవలను విస్తరిస్తోంది. అంతేకాకుండా బ్రిటన్‌లో ఈ మధ్యే ఓ హోటల్‌ను సొంతం చేసుకుంది. ఆతిథ్య రంగంలోకి అడుగుపెడుతోందని తెలిసింది.
ఇదీ రెవ్లాన్ కథ!
Revlon Bankruptcy: కాస్మొటిక్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన రెవ్లాన్ (Revlon) కంపెనీ తన సౌందర్యం కోల్పోయింది! చేసిన అప్పులు చెల్లించకలేక దివాలా అంచున నిలిచింది. తాము దివాలా తీస్తున్నామని అమెరికా కోర్టులో ఛాప్టర్ 11 పత్రాలను దాఖలు చేసింది. నానాటికీ పెరుగుతున్న అప్పులు, ముడి వనరుల ధరలు, సరఫరా కొరత ఇందుకు కారణాలని వెల్లడించింది.
తమకు రక్షణ కల్పించాలని రెవ్లాన్ అధినేత రాన్ పెరెల్‌మ్యాన్ న్యూయార్క్ కోర్టును ఆశ్రయించారు. ఆస్తులు, అప్పులు చెరో పది బిలియన్ డాలర్ల వరకు ఉన్నాయని కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. ఛాప్టర్ 11 పత్రాలు దాఖలు చేయడం వల్ల రుణదాతలకు డబ్బులు చెల్లించే ప్రణాళికతో పాటు కంపెనీ సేవలు సజావుగా సాగేందుకు అవకాశం దొరుకుతుంది.
Also Read: రూ.28కే రూ.2 లక్షల ఎల్‌ఐసీ బీమా! ప్రీమియం లేటైనా కవరేజీ!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారితో లాక్‌డౌన్లు విధించారు. ఈ సమయంలో ఎవరూ కాస్మొటిక్స్ వాడకపోవడంతో కంపెనీ అమ్మకాలు భారీగా పడిపోయాయి. వినియోగదారుల ఇష్టానిష్టాలు మారాయి. కొత్త కంపెనీలు మార్కెట్లో తమ వాటాను పెంచుకున్నాయి. దాంతో వారిని ఆకట్టుకోవడంలో రెవ్లాన్ ఇబ్బంది పడింది. ఈ కంపెనీ 90 ఏళ్ల క్రితం మహా మాంద్యంలో (Great Depression) మొట్ట మొదటిసారి నెయిల్ పాలిష్‌లు అమ్మింది. ఆ తర్వాత లిప్‌స్టిక్‌లు తీసుకొచ్చింది. 1955లో అంతర్జాతీయ బ్రాండ్‌గా ఎదిగింది.
Also Read: ఎన్‌పీఎస్ కడుతున్నారా! బెనిఫిట్స్‌పై కీలక మార్పులు చేసిన పీఎఫ్ఆర్‌డీఏ!
1985లో రెవ్లాన్ నియంత్రణను పెరెల్‌మ్యాన్ హోల్డింగ్స్ కంపెనీ, మ్యాక్ ఆండ్రూస్ అండ్ ఫోర్బ్స్ తీసుకున్నాయి. మైకేల్ మిల్కన్ సమీకరించిన అప్పులకు వీరు ఫండింగ్ చేశారు. 2016లో ఎలిజబెత్ ఆర్డెన్‌ను విలీనం చేసుకొనేందుకు 2 బిలియన్ డాలర్ల రుణాలు, బాండ్లను రెవ్లాన్ అమ్మింది. క్యూటెక్స్ (Cutex), ఆల్మే (Almay) బ్రాండ్లనూ సొంతం చేసుకుంది. 150కి పైగా దేశాల్లో విక్రయాలు చేపట్టింది. కరోనా తర్వాతే కంపెనీ దశ మారిపోయింది. సోషల్ మీడియాలో ఎంత ప్రచారం చేసినా అమ్మకాలు పెరగలేదు. మార్జిన్లు తగ్గాయి. సమస్యలు పెరిగాయి. అప్పులు తీర్చలేక ఇప్పుడు దివాలాకు దరఖాస్తు చేసింది.