By: ABP Desam | Updated at : 16 Jun 2022 02:16 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఎల్‌ఐసీ బీమా
LIC Micro Insurance Plan: ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో జీవిత బీమా (Life Insurance) నిత్యావసరంగా మారిపోయింది! పన్నులు ఎక్కువని, డబ్బులు ఎక్కువ చెల్లించాలని మధ్యతరగతి వర్గాలు బీమా తీసుకొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. అందుకే తక్కువ ఆదాయ వర్గాల కోసం భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) ఒక మైక్రో బచత్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చింది.
ఏంటీ పాలసీ!
ఎల్‌ఐసీ మైక్రో బచత్ ఇన్సూరెన్స్ (LIC Micro Insurance Plan) రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. కుటుంబానికి భద్రత కల్పించడంతో పాటు డబ్బును ఆదా చేస్తుంది. మరణానంతర ప్రయోజనాన్ని కల్పించడమే కాకుండా మెచ్యూరిటీ టైమ్‌లో భారీ మొత్తంలో డబ్బు అందజేస్తుంది. ఈ ప్లాన్‌లో కనీస బీమా మొత్తం రూ.50వేలు. గరిష్ఠ మొత్తం రూ.2 లక్షలు. ఇందులో బెనిఫిట్ ఆఫ్ లాయల్టీ సైతం లభిస్తుంది. మూడేళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే రుణం సదుపాయాన్నీ కల్పిస్తున్నారు.
Also Read: అతి త్వరలో ఈపీఎఫ్ వడ్డీ జమ! బ్యాలెన్స్ చెక్ చేయడానికి 4 మార్గాలు
ప్రీమియం చెల్లించకున్నా కవరేజి!
ఈ పాలసీ తీసుకొనేందుకు కనీస వయసు 18 ఏళ్లు. గరిష్ఠ వయసు 55. టర్మ్ పాలసీ కాదు కాబట్టి ఎలాంటి ఆరోగ్య పరీక్షలు అవసరం లేదు. వరుసగా మూడేళ్లు సరిగ్గా ప్రీమియం చెల్లిస్తే అదనంగా ఆరు నెలల పాటు ప్రీమియం కట్టకున్నా పాలసీ కొనసాగుతుంది. ఐదేళ్లు చెల్లిస్తే ఆటోమేటిక్‌గా మరో రెండేళ్లు బీమా ప్రయోజనం లభిస్తుంది. ఎల్‌ఐసీ మైక్రో బచత్ బీమా పాలసీ 10-15 ఏళ్లు తీసుకోవచ్చు. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి ప్రీమియం చెల్లించొచ్చు. అవసరం అనుకుంటే అదనంగా యాక్సిడెంటల్ రైడర్ తీసుకోవచ్చు.
రూ.28తో ప్లాన్ చేయండి!
ఈ మైక్రో బచత్ పాలసీని 18 ఏళ్ల వయసులో తీసుకుంటే ప్రతి రూ.1000కి రూ.51.60 ప్రీమియం చెల్లించాలి. అదే ప్లాన్‌ను 25 ఏళ్ల వయసులో తీసుకుంటే రూ.51.60, 35 ఏళ్ల వయసులో అయితే రూ.52.20 ప్రీమియంగా చెల్లించాలి. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్లకు రూ.లక్ష పాలసీ తీసుకుంటే ఏడాదికి రూ.5116 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి చెల్లించిన ప్రీమియంలో 70 శాతం వరకు రుణం ఇస్తారు. ఇక రూ.2 లక్షల మొత్తానికి తీసుకుంటే ఏడాదికి రూ.10,300 ప్రీమియం కట్టాలి. అంటే రోజుకు రూ.28, నెలకు రూ.840 అవుతుంది.
Also Read: సెన్సెక్స్ బిగ్ క్రాష్‌కు 5 కీలక కారణాలు ఇవే!!
Also Read: 200 రోజుల EMA కిందే నిఫ్టీ! వారంలో రూ.10 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఉఫ్!
Gold-Silver Prices Today 30 Nov: ప్యూర్ గోల్డ్, ఆర్నమెంట్ గోల్డ్ రేట్లు తగ్గాయ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Minor PAN Card: పిల్లల కోసం పాన్ కార్డ్ ఎలా తీసుకోవాలి, ఏంటి లాభం?
Gold-Silver Prices Today 29 Nov: నగలు కొనేవాళ్లకు రోజుకో షాక్ ఇస్తున్న గోల్డ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
ఎఫ్డి మ్యాక్స్: బజాజ్ ఫైనాన్స్ యొక్క తాజా అధిక- రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫర్
Good Personal Loan: అత్యవసర ఖర్చుల్లో ఉన్నారా ? - పెద్దగా భారం పడని నాలుగు పర్సనల్ లోన్ మర్గాలు ఇవిగో
Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్, ఏడుగురు మావోయిస్టుల హతం
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ