Ramdev Baba: చలికాలంలో ఇమ్యూనిటీని పెంచుకోవడం ఎలా? ఇవిగో రాందేవ్ బాబా టిప్స్
Patanjali: రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి , కాలానుగుణ వ్యాధుల నుండి రక్షించడానికి స్థిరమైన అలవాట్లు, యోగా , పతంజలి చవన్‌ప్రాష్‌లు చాలు. స్వామి రామ్‌దేవ్ ఆరోగ్య చిట్కాలను ఇలా వివరిస్తున్నారు.

Ramdev Baba Shares Tips To Boost Immunity In Winter: యోగ గురువు స్వామి రాందేవ్ శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి పలు సూచనలు చేశారు. ఇటీవల నిర్వహించిన ఫేస్‌బుక్ లైవ్ సెషన్‌లో ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, యోగా మరియు పతంజలి చ్యవన్‌ప్రాశ్ వంటి ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా శీతాకాలపు అనారోగ్యాల నుండి రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు.
ఇమ్యూనిటీ రాత్రికిరాత్రి రాదు
కృంగిపోయే చలి, మారుతున్న వాతావరణం కారణంగా శీతాకాలంలో వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుందని, ఇలాంటి సమయంలో శరీర రోగనిరోధక శక్తిని పటిష్టం చేసుకోవడమే పెద్ద సవాలని స్వామి రాందేవ్ పేర్కొన్నారు. రోగనిరోధక శక్తి అనేది రాత్రికి రాత్రే వచ్చేది కాదని, దానిని 'కాంపౌండ్ ఇంట్రెస్ట్' అంటే చక్రవడ్డీతో ఆయన పోల్చారు. క్రమం తప్పకుండా తీసుకునే పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు కాలక్రమేణా శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని, దీర్ఘాయువును మరియు దృఢత్వాన్ని ఇస్తాయని ఆయన వివరించారు.
పతంజలి చ్యవన్‌ప్రాశ్‌లో 51 రకాల మూలికల సారం
శీతాకాలపు అలసట, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందడానికి సాంప్రదాయ ఆయుర్వేద ఔషధమైన చ్యవన్‌ప్రాశ్ ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. పతంజలి చ్యవన్‌ప్రాశ్‌లో 51 రకాల మూలికల సారం, 5,000 కంటే ఎక్కువ ఔషధ సమ్మేళనాలు ఉన్నాయని, ఇవి శరీర సహజ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయని తెలిపారు. వివిధ వయస్సుల వారు మరియు వివిధ ఆరోగ్య అవసరాలు ఉన్నవారి కోసం పతంజలి బ్యాలెన్స్ సెంటర్లలో వేర్వేరు రకాల చ్యవన్‌ప్రాశ్ వెరైటీలు అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు.
మధుమేహుల కోసం ప్రత్యేక చ్యవన్‌ప్రాష్
చక్కెర స్థాయిల గురించి ఆందోళన చెందే మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం స్వామి రాందేవ్ ఒక శుభవార్త చెప్పారు. సాధారణంగా తీపిగా ఉండే చ్యవన్‌ప్రాశ్‌ను షుగర్ పేషెంట్లు దూరం పెడుతుంటారని, అయితే ఇప్పుడు వారి కోసం 'షుగర్-ఫ్రీ' ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల డయాబెటిస్ ఉన్నవారు కూడా ఎలాంటి ఆందోళన లేకుండా తమ రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని సూచించారు.
జీవనశైలి ముఖ్యం
కేవలం మందులు లేదా సప్లిమెంట్లు మాత్రమే కాకుండా, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అత్యంత ముఖ్యమని రాందేవ్ బాబా గుర్తు చేశారు.
ప్రతిరోజూ యోగా సాధన చేయడం
సమతుల్య ఆహారం తీసుకోవడం
క్రమబద్ధమైన దినచర్య
ఇలాంటి అలవరచుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయన పిలుపునిచ్చారు. ప్రాచీన ఆయుర్వేదం మరియు ఆధునిక క్రమశిక్షణల కలయికే వ్యాధిరహిత జీవితానికి మూలమని ఆయన పునరుద్ఘాటించారు.





















