వాట్సాప్, టెలిగ్రామ్ , ఫేస్‌బుక్‌లో 'స్టాక్ మార్కెట్ టిప్స్' లేదా 'భారీ లాభాలు' అంటూ గ్రూపుల్లో యాడ్ చేస్తే వెంటనే బయటకు వచ్చేయండి.

Published by: Raja Sekhar Allu

పెట్టుబడి పెట్టే యాప్ లేదా సంస్థ ఖచ్చితంగా సెబీ (SEBI) వద్ద రిజిస్టర్ అయి ఉందో లేదో తనిఖీ చేయండి.

Published by: Raja Sekhar Allu

ఒక్క రోజులోనే డబ్బు డబుల్ అవుతుంది లేదా నెలలోనే 50% లాభం వంటి ఆఫర్లు ఇచ్చేవారంతా కేటుగాళ్లే

Published by: Raja Sekhar Allu

నిందితులు పంపే లింక్‌ల ద్వారా ఏవైనా APK ఫైల్స్‌ను లేదా అపరిచిత యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకండి.

Published by: Raja Sekhar Allu

వ్యక్తిగత ఖాతాలకు నగదు బదిలీ చేయకండి, ట్రేడింగ్ కోసం మీరు పంపే డబ్బు ఎప్పుడూ కార్పొరేట్ కంపెనీ ఖాతాకు వెళ్లాలి.

Published by: Raja Sekhar Allu

మీ లాభాలను విత్‌డ్రా చేసుకోవాలంటే మళ్ళీ 'టాక్స్' లేదా 'సర్వీస్ ఛార్జ్' అడిగితే మోసపోయినట్లే.

Published by: Raja Sekhar Allu

స్క్రీన్ షేరింగ్ యాప్స్ వద్దు.AnyDesk లేదా TeamViewer వంటి స్క్రీన్ షేరింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయమని సైబర్ నేరగాళ్లు కోరుతారు.

Published by: Raja Sekhar Allu

నేరగాళ్లు ప్రముఖ ట్రేడింగ్ కంపెనీల పేర్లతోనే నకిలీ వెబ్‌సైట్లు సృష్టిస్తారు. ఆ వెబ్‌సైట్ అడ్రస్ (URL) స్పెల్లింగ్‌ను జాగ్రత్తగా పరిశీలించండి.

Published by: Raja Sekhar Allu

బ్యాంకింగ్ లావాదేవీలు చేసేటప్పుడు బహిరంగ ప్రదేశాల్లోని ఉచిత వైఫైని వాడటం సురక్షితం కాదు.

Published by: Raja Sekhar Allu

మోసపోయారని తెలిస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌ లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.

Published by: Raja Sekhar Allu