ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న ఈ-జీరో ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేసుకోవచ్చు?
ప్రథమ సమాచార నివేదికనే ఎఫ్ఐఆర్ అని కూడా పిలుస్తారు.
ఒక నేరం జరిగినట్లు సమాచారం అందినప్పుడు పోలీసులు తయారుచేసే ఒక లిఖిత పత్రం ఇది.
ఇది సాధారణంగా బాధితుడి తరపున పోలీసులకు చేసిన ఫిర్యాదు.
ఎఫ్ఐఆర్ కూడా చాలా రకాలుగా ఉంటుంది
అందులో ఒకటి ఈ-జీరో ఎఫ్‌ఐఆర్. ఈ-జీరో ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేయాలో తెలియజేస్తాను.
ఈ జీరో ఎఫ్ఐఆర్ ఒక ప్రక్రియ, మీరు 10 లక్షల రూపాయలకు పైబడిన ఆర్థిక మోసానికి గురైనప్పుడు ఎన్సీఆర్పీ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కి ఫిర్యాదు చేయవచ్చు.
ఎన్‌సిఆర్‌పి లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు నమోదు అయినప్పుడు ఇది ఆటోమేటిక్‌గా ఢిల్లీలో ఉన్నా ఇ-క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌గా రిజిస్టర్ అవుతుంది.
ఆ తర్వాత ఈ ఫిర్యాదును సంబంధిత ప్రాంతీయ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు పంపుతారు
ఫిర్యాదుదారు కూడా 3 రోజుల్లో సంబంధిత సైబర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ జీరో ఎఫ్ఐఆర్‌ను సాధారణ ఎఫ్‌ఐఆర్‌గా మార్చాలి.