అన్వేషించండి

డీమార్టుకు పోటీగా స్టార్టప్ దూకుడు, రెండేళ్లలో ఓడిస్తామని ఛాలెంజ్! అంత మ్యాటర్ ఉందా

E Eommerce Telugu News: దేశంలో రిటైల్ వ్యాపారంలో డీమార్ట్ స్టోర్ల రాక పెను మార్పులకు దారితీస్తోంది. రానున్న కాలంలో వీరి వ్యాపారాన్ని అధిగమిస్తామని క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో సీఈవో పేర్కొన్నారు.

Dmart Vs Zepto: దేశంలో రిటైల్ వ్యాపారంలో డీమార్ట్ స్టోర్ల రాక పెను మార్పులకు దారితీసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి దీనికి ముందు ఫ్యూచర్ గ్రూప్ దేశంలోని మధ్యతరగతి ప్రజలకు అత్యంత ఇష్టమైన షాపింగ్ డెస్టినేషన్ గా ఉండేది. అయితే కరోనా సమయంలో ఏర్పడిన ఫైనాన్షియల్ క్రంచ్, వ్యాపారాన్ని రిలయన్స్ కంపెనీకి విక్రయించటాన్ని అమెజాన్ అడ్డుకోటంతో చివరి దివాలా ప్రక్రియకు కంపెనీ వెల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

అయితే రాధాకిషన్ దమానీకి చెందిన అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ కంపెనీ వాస్తవానికి దేశంలోని డీమార్ట్ స్టోర్లను నిర్వహిస్తోంది. దమానీ దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రముఖ ఇన్వెస్టర్ పైగా దివంగత బిగ్‌బుల్ రాకేష్ జున్‌జున్‌వాలాకి గురువని మనలో చాలా మందికి తెలియదు. డీమార్ట్ అర్థం "Discount Mart". దమానీ చిన్న వ్యాపారం నుంచి ప్రారంభించి క్రమంగా దానిని విస్తరించారు. తక్కువ ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడం ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవడం ఆయన వ్యూహం. ఈ కంపెనీ భారతదేశంలోని అతిపెద్ద రిటైల్ చైన్‌లలో ఒకటిగా ఎదిగి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300కి పైగా స్టోర్లను స్థాపించింది. 

డీమార్ట్ భారతదేశ రిటైల్ రంగంలో ఒక ముఖ్యమైన ఆటగాడిగా మారింది. అనేక సంవత్సరాలుగా వ్యాపారాన్ని క్రమపద్ధితిలోకి తెచ్చిన దమానీ ప్రస్తుతం వేగంగా కొత్త స్టోర్లను ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే రానున్న రోజుల్లో డీమార్ట్ వ్యాపారాన్ని అధిగమించగలమని తాము వేగంగా ముందుకు సాగుతున్నట్లు క్విక్ కామర్స్ స్టార్టప్ జెప్టో సీఈవో ఆదిత్ పలిచా పేర్కొన్నారు. రాబోయే 18-24 నెలల్లో కంపెనీ విక్రయాలు డీమార్ట్ అమ్మకాలను అధిగమిస్తాయన్నారు. రానున్న 5-10 ఏళ్లలో 2.5 ట్రిలియన్ రూపాయల వ్యాపారాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం దేశంలోని 40 నగరాల్లో 50-75 మిలియన్ల మందిని టార్గెట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

2029 ఆర్థిక సంవత్సరం నాటికి భారత రిటైల్ మార్కెట్ వ్యాపారం ఏకంగా 850 బిలియన్ డాలర్ల మార్కుకు చేరుకుంటుందని అంచనా వేయబడింది. అయితే ఇందులో 400 బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని గృహ వినియోగదారుల నుంచి పొందాలని కంపెనీ యోచిస్తోంది. ఈ క్రమంలో వ్యాపారాన్ని వేగంగా విస్తరించేందుకు వీలుగా ఇటీవలి కాలంలో కంపెనీ సిరీస్ ఎఫ్ రౌండ్ ఫండింగ్ ద్వారా 665 మిలియన్ డాలర్లను 3.6 బిలియన్ డాలర్ల విలువతో సమీకరించింది. ఈ సొమ్ముతో ఇప్పటికే దేశంలోని వివిధ నగరాల్లో 350గా డార్క్ స్టోర్ల సంఖ్యను డబుల్ చేసి 700లకు చేర్చాలని ప్లాన్ చేస్తోంది. అలాగే కంపెనీ రానున్న 12-15 నెలల్లో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఐపీవో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. 

జెప్టో ఇప్పటికే క్విక్ కామర్స్ వ్యాపారంలో స్విగ్గీ ఇన్టామార్ట్, జొమాటో బ్లింకిట్, టాటా బిగ్ బాస్కెట్, కంట్రీడిలైట్ వంటి పెద్ద ఆటగాళ్లతో పోటీ పడుతోంది. అయితే రిలయన్స్ కంపెనీకి చెందిన జియో మార్ట్ సైతం రానున్న కాలంలో ఈ వ్యాపార విభాగంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. వస్తువులను 10-15 నిమిషాల్లో డెలివరీ చేసే వ్యాపారంలో జెప్టో వేగంగా మార్కెట్ షేర్ పొందాలని చూస్తోంది. వాస్తవానికి ఈ కంపెనీ 2021లో ప్రారంభించబడింది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget