By: ABP Desam | Updated at : 15 Feb 2022 07:29 AM (IST)
పెట్రోల్, డీజిల్ ధరలు (File Photo)
Petrol Price Today 15th February 2022: హైదరాబాద్‌లో ఇంధన ధరలు నేడు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోనూ గత డిసెంబర్ తొలి వారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద స్థిరంగా ఉంది.
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర పెరిగింది. 19 పైసలు పెరగడంతో వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.107.88 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.94.31 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.107.88 కాగా, 21 పైసలు పెరగడంతో డీజిల్ లీటర్ ధర రూ.94.31 కి తగ్గింది. కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar 15th February 2022) భారీగా పెరిగాయి. 48 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర రూ.108.55 కు చేరింది.. 45 పైసలు పెరగడంతో డీజిల్ ధర రూ.94.94 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజామాబాద్‌లోపెట్రోల్ పై రూ.0.35 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.09 కాగా, డీజిల్‌పై రూ.0.33 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.38 అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్ (Petrol Price in Vijayawada 15th February 2022)పై 22 పైసలు తగ్గడంతో నేడు లీటర్ ధర రూ.110.29 కాగా, ఇక్కడ డీజిల్ పై 23 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.36 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. 52 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.109.57 అయింది. డీజిల్‌పై 48 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.95.66 కు ఎగబాకింది.
చిత్తూరు జిల్లాలో ధరలు..
చిత్తూరులోనూ ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 35 పైసలు పెరగడంతో లీటర్ ధర ప్రస్తుతం రూ.110.93 అయింది. డీజిల్ ధర రూ.0.31 పైసలు పెరగగా లీటర్ ధర రూ.96.91 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి.
ధరల పెరుగుదలకు కారణం..
గత సంవత్సరం మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై పడి వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా డిసెంబరు 2 నాటి ధరల ప్రకారం 66.52 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.
Also Read: Cars With Six Airbags: సేఫ్టీ ఫస్ట్, తక్కువ ధరలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కార్లు ఇవే!
Petrol-Diesel Price, 29 May: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం - ఈ నగరాల్లో స్థిరంగా
Gold-Silver Price: నేడు నిలకడగా బంగారం ధరలు, వెండి మాత్రం పైపైకి - మీ ప్రాంతంలో ధరలు ఇవీ
Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం
Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?
Gas Cylinders Explode: గ్యాస్ సిలిండర్ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్ ఇదే!
IPL 2022, GT vs RR Final: బట్లర్ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్ ఉన్నాడోచ్!
బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!
Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు
Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం, సంస్థపై ప్రయాణికులు ఫైర్!