By: ABP Desam | Updated at : 15 Feb 2022 06:32 AM (IST)
బంగారం, వెండి ధరలు (Representational Image)
Gold Price Today In Hyderabad 15 February 2022: తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వారం రోజులు పెరిగిన బంగారం ధర నేడు దిగొచ్చింది. మరోవైపు వెండి ధర కూడా పసిడి బాటలో పయనిస్తూ భారీగా క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర రూ.550 మేర తగ్గడంతో తాజాగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,300 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.50,510 అయింది. స్వచ్ఛమైన వెండి ధర రూ.1,200 మేర భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.68,600 కు ఎగబాకింది.
ఏపీ మార్కెట్లో బంగారం ధరలు నేడు తగ్గాయి. విజయవాడలో రూ.510 మేర బంగారం ధర (Gold Rate in Vijayawada 15th February 2022) తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,500 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300కి పతనమైంది. విజయవాడలో వెండి 1 కేజీ ధర రూ.68,600 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం, వెండి ఇదే ధరలో ట్రేడింగ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,510 అయింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధర..
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లోనూ బంగారం ధరలు దిగొచ్చాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,510 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,300 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి, చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,510 అయింది.
ప్లాటినం ధర
మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధరలు పలు నగరాలలో ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో, ఏపీలోని విశాఖపట్నం, విజయవాడలో రూ.21 మేర పెరిగింది. 10 గ్రాముల ప్లాటినం ధర రూ.25,000 కి ఎగబాకింది. చెన్నైలో 10 గ్రాముల ధర రూ.24,750కి దిగొచ్చింది. ముంబైలో ప్లాటినం ధర రూ.25,000 అయింది. ఢిల్లీలో ప్లాటినం ధర రూ.4 తగ్గడంతో తులం ధర రూ.24,750 అయింది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Cars With Six Airbags: సేఫ్టీ ఫస్ట్, తక్కువ ధరలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కార్లు ఇవే!
Also Read: Skoda Kodiaq: ఈ సూపర్ హిట్ కారు అవుట్ ఆఫ్ స్టాక్.. 2022లో అస్సలు కొనలేరు!
New Brezza: కొత్త బ్రెజాలో అదే హైలెట్ - లాంచ్ త్వరలోనే - లుక్ ఎలా ఉందంటే?
Kotak Mutual Fund: రూ.10 వేల సిప్ - 3 ఏళ్లలో రూ.5 లక్షల రిటర్న్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ ఇది
Stock Market News: సెన్సెక్స్ - 250 నుంచి + 500కు! ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఎగబడ్డ ఇన్వెస్టర్లు!
Cryptocurrency Prices Today: రోజురోజుకీ పతనమవుతున్న బిట్‌కాయిన్, ఎథీరియమ్!
Infosys CEO Salary: ఆ సీఈవో వేతనం రూ.42.50 కోట్ల నుంచి రూ.80 కోట్లకు పెంపు!
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు