(Source: ECI/ABP News/ABP Majha)
Petrol-Diesel Price, 7 October: మళ్లీ భారీగా ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కొద్దిరోజులుగా తగ్గని రేట్లు, తాజా ధరలు ఇలా..
విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు మరోసారి వరుసగా పెరిగాయి. ప్రస్తుతం రూ.109.79 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.53 పైసలు పెరిగింది. డీజిల్ ధర రూ.0.55 పైసలు పెరిగి ఏకంగా రూ.101.83కు చేరింది.
రోజూ ఎంతో కొంత ఎగబాకుతూ వస్తున్న ఇంధన ధరలు తాజాగా మరింతగా పెరిగాయి. హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.0.32 పెరిగి రూ.107.09 అయింది. రూ.98.72 గా ఉన్న డీజిల్ ధర.. ప్రస్తుతం రూ.99.75కు చేరింది. ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.0.31 పైసలు పెరిగి రూ.106.60గా ఉంది. డీజిల్ ధర రూ.0.38 పైసలు పెరిగి రూ.99.29 గా ఉంది. వరంగల్‌లో గత కొన్ని రోజులుగా నిలకడగా ధరలు ఉంటుండగా.. తాజాగా పెరిగాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.49 పైసలు పెరిగి.. రూ.107.43గా ఉంది. డీజిల్ ధర రూ.0.54 పైసలు పెరిగి రూ.100.06కు చేరింది. నిజామాబాద్‌లోనూ ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.46 పైసలు పెరిగి రూ.108.86 గా ఉంది. డీజిల్ ధర రూ.0.52 పైసలు పెరిగి రూ.101.40 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
Also Read: జియో సేవల్లో అంతరాయం.. #jiodown అంటూ యూజర్ల ఫిర్యాదులు
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు మరోసారి వరుసగా పెరిగాయి. ప్రస్తుతం రూ.109.79 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.53 పైసలు పెరిగింది. డీజిల్ ధర రూ.0.55 పైసలు పెరిగి ఏకంగా రూ.101.83కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.99గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.05 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.100.14గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో ఇంధన ధరల్లోనూ భారీ పెరుగుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.64 పైసలు పెరిగి రూ.109 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.101.08గా ఉంది. డీజిల్ ధర లీటరుకు ఏకంగా రూ.0.69 పైసలు పెరిగింది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 7 నాటి ధరల ప్రకారం 76.63 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Also Read: క్రిప్టో కరెన్సీ క్రేజ్.. బిట్ కాయిన్ ఉంటే బేఫికర్.. ఈ రెస్టారెంట్లో అదిరే ఆఫర్
ఎమ్మెల్యే రాజయ్య మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జనగామ జిల్లా చిలుపూర్ మండలం లింగంపల్లిలో సోమవారం బతుకమ్మ చీరలను దహనం చేశారు. కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి కండ్లకోలు బాలరాజు నేతృత్వంలో చీరలను దహనం చేశారు. అనంతరం బాలరాజు మాట్లాడుతూ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజయ్య తక్షణమే అంబేద్కర్ విగ్రహం ఎదుట క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవలే ఓ కార్యక్రమంలో రాజయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ తల్లి, తండ్రి, భర్త అంటూ నోరు జారిన సంగతి తెలిసిందే.
Also Read: దీపావళి రోజున ముహూరత్ ట్రేడింగ్.. ఆ టైమ్ లో షేర్లు కొనుగోలు చేస్తే..