News
News
X

Petrol-Diesel Price, 6 September: పెట్రోలు ధరలు మళ్లీ పెరిగాయి, రేటు చూస్తే గుండె గుభేల్‌

ఒకవేళ ఒపెక్‌ ప్లస్‌ దేశాలు చమురు ఉత్పత్తిని కట్‌ చేస్తే, మన దేశంలో రేట్లు మళ్లీ భారీగా పెరిగే అవకాశం ఉంది.

FOLLOW US: 

Petrol-Diesel Price, 6 September: చమురు ఉత్పత్తి చేసే ఒపెక్‌ ప్లస్‌ దేశాల సమావేశం నేపథ్యంలో, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధర భారీగా పెరిగింది. బ్యారెల్‌కు దాదాపు మూడు డాలర్ల వరకు జంప్‌ చేసింది. చమురు ఉత్పత్తిని తగ్గించి, రేటు పడిపోకుండా ఒపెక్‌ ప్లస్‌ దేశాలు నిర్ణయం తీసుకుంటాయని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. ఇవాళ బ్యారెల్‌ ఆయిల్‌ ధర 2.62 డాలర్లు పెరిగి 89.42 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 2.82 డాలర్లు పెరిగి 95.96 డాలర్లకు చేరింది. ఒకవేళ ఒపెక్‌ దేశాలు చమురు ఉత్పత్తిని కట్‌ చేస్తే, మన దేశంలో రేట్లు మళ్లీ భారీగా పెరిగే అవకాశం ఉంది.

మన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో ఇంధనం ధరలు (Petrol Price in Telangana)

హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) ఇంధన ధరల్లో కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు ఉండడం లేదు. నిన్నటితో (సోమవారం) పోలిస్తే ఇవాళ (మంగళవారం) కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు లీటరు పెట్రోల్ ధర ₹ 109.66 గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 గా ఉంది. 
వరంగల్‌లోనూ (Petrol Price in Warangal) ఇంధన ధరలు కొన్నాళ్లుగా స్థిరంగా ఉన్నాయి. ఈ నగరంలో లీటరు పెట్రోల్ ధర నేడు ₹ 109.10 గా ఉంది. లీటరు డీజిల్ ధర ₹ 97.29 వద్ద నిలకడగా ఉంది. 
వరంగల్ రూరల్ జిల్లాలో లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 109.14 గా ఉండగా, ఇవాళ ₹ 109.47 కి పెరిగింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.32 గా ఉండగా, ఇవాళ ₹ 97.63 కు పెరిగింది.
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.36 గా ఉండగా, ఇవాళ ₹ 111.72 కు చేరింది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 99.40 గా ఉండగా, ఇవాళ ₹ 99.74 కి చేరింది.
నల్లగొండలో (Petrol Price in Nalgonda) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.41 గా ఉండగా, ఇవాళ కూడా ₹ 109.41 కొనసాగుతోంది. డీజిల్‌ ధర నిన్న ₹ 97.57 కాగా, ఇవాళ కూడా ₹ 97.57 రేటు ఉంది.
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.32 గా ఉండగా, ఇవాళ ₹ 109.94 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.50 గా ఉండగా ఇవాళ ₹ 98.07 గా నమోదైంది.
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 111.90 గా ఉండగా, ఇవాళ ₹ 111.32 గా ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.90 వద్ద ఉండగా, ఇవాళ ₹ 99.36 కు తగ్గింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధనం ధరలు (Petrol Price in Andhra Pradesh)

విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ ధర నిన్న (సోమవారం) ₹ 112.03 నుంచి ఇవాళ (మంగళవారం) ₹ 111.44 కు తగ్గింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.76 గా ఉండగా, ఇవాళ ₹ 99.21 కు తగ్గింది. 
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.78 గా ఉండగా, ఇవాళ ₹ 111.83 కి పెరిగింది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.51 నుంచి ఇవాళ ₹ 99.58 కి చేరింది.
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.09 గా ఉంటే, ఇవాళ ₹ 110.85 గా నమోదైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.87 గా ఉండగా, ఇవాళ ₹ 98.64 కు తగ్గింది. 
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ ధర నిన్నటి ₹ 111.28 నుంచి ఇవాళ ₹ 111.23 కి తగ్గింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.01 గా ఉండగా, ఇవాళ ₹ 98.97 గా నమోదైంది. 
తిరుపతిలో (Petrol Price in Tirupati)  లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.98 గా ఉండగా, ఇవాళ ₹ 112.52 కు పెరిగింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.69 గా ఉండగా, ఇవాళ ₹ 100.08 కి చేరింది.
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.90 గా ఉంటే ఇవాళ ₹ 111.76 గా నమోదైంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.64 నుంచి ఇవాళ ₹ 99.49 కి తగ్గింది.
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 112.11 గా ఉంటే, ఇవాళ ₹ 112.04 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.84 గా ఉండగా, ఇవాళ ₹ 99.77 కి తగ్గింది.

Published at : 06 Sep 2022 05:48 AM (IST) Tags: Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

Aarti Industries Share: ఏడాదిలో 30% డౌన్‌ - ఆర్తి ఇండస్ట్రీస్‌ను అమ్మేసే టైమొచ్చిందా?

Aarti Industries Share: ఏడాదిలో 30% డౌన్‌ - ఆర్తి ఇండస్ట్రీస్‌ను అమ్మేసే టైమొచ్చిందా?

Stocks to watch 29 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - Voda Ideaతో జాగ్రత్త బాస్‌!

Stocks to watch 29 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - Voda Ideaతో జాగ్రత్త బాస్‌!

Petrol-Diesel Price, 29 September: శాంతించిన చమురు, మీ ఏరియాలో ఇవాళ్టి ధర ఇది

Petrol-Diesel Price, 29 September: శాంతించిన చమురు, మీ ఏరియాలో ఇవాళ్టి ధర ఇది

Gold-Silver Price 29 September 2022: బంగారం లాంటి అవకాశం, 50 వేలకు దిగువనే పసిడి ధర

Gold-Silver Price 29 September 2022: బంగారం లాంటి అవకాశం, 50 వేలకు దిగువనే పసిడి ధర

RBI MPC Meeting: అన్ని కళ్లూ ఆర్‌బీఐ మీదే - నేటి నుంచి పరపతి సమీక్ష

RBI MPC Meeting: అన్ని కళ్లూ ఆర్‌బీఐ మీదే - నేటి నుంచి పరపతి సమీక్ష

టాప్ స్టోరీస్

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

Kondapur News : వైద్యుల నిర్లక్ష్యంతో బాత్ రూమ్ లో శిశువు జననం, పుట్టిన పది నిమిషాలకే!

RRR JAPAN : తారక్, చరణ్ తో కలిసి జపాన్ కు వెళ్తున్న రాజమౌళి | ABP Desam

RRR JAPAN : తారక్, చరణ్ తో కలిసి జపాన్ కు వెళ్తున్న రాజమౌళి | ABP Desam

Mukesh Ambani Z+ Security: ముకేశ్ అంబానికి Z ప్లస్ సెక్యూరిటీ! నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయా?

Mukesh Ambani Z+ Security: ముకేశ్ అంబానికి Z ప్లస్ సెక్యూరిటీ! నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయా?

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు

JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు